ఇళ్ల తొలగింపుల్లో ఉద్రిక్తత
పాలకోడేరు: పాలకోడేరు శివారు ఏఎస్‌ఆర్ నగర్‌లో 21 కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేయాలని లేదంటే తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో మంగళవారం ఉదయం నుంచి వారంతా మెయిన్ రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. చివకు పోలీసు, పంచాయతీ, రెవెన్యూ యంత్రాంగం చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ.. 21 మందికి ప్రత్యామ్నాయం చూపినట్లుగా నోటీసులు ఇచ్చి విద్యుత్తు కనెక్షన్లు కట్ చేయడం సరైన కాదని ఆరుగురు మాత్రమే ఇల్లు నిర్మించుకున్నారని మిగిలిన వారందరికీ విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించాలన్నారు. ఇల్లు నిర్మించుకున్న ఆరుగురు ఈ రోజే వెళ్ళిపోతారని తెలిపారు. రెండు నెలల్లో అందరికీ ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుందన్నారు. విద్యుత్ కనెక్షన్లన్నీ ఈరోజే పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment