రైతులను విచారించిన అధికారులు
తాబేళ్ల రక్షణకు చర్యలు
తాబేళ్ల సంరక్షణకు చర్యలు చేపట్టారు. నరసాపురం మండలంలోని తాబేళ్ల గుడ్ల సేకరణ, పునరుత్పత్తి కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. 8లో u
నిడమర్రు: ఎఫ్‌ఎస్‌వో శ్రీనివాస్‌బాబుపై రైతులు చేస్తున్న లంచాల ఆరోపణలపై నిడమర్రు సచివాలయం కార్యాలయంలో మంగళవారం అటవీ శాఖ రేంజర్ పి.మోహినీ విజయలక్ష్మి విచారణ నిర్వహించారు. ‘అడిగినంత ఇస్తేనే ఆక్వా సాగు’ అనే శీర్షికన ఈ నెల 14న సాక్షిలో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. డీఎఫ్‌వో స్పందించి విచారణకు రేంజర్‌ను నియమించారు. విచారణలో జాప్యంతో విచారణ పక్కదారి పడుతోందంటూ నిడమర్రు రైతులు సాక్షిని ఆశ్రయించడంతో ‘లంచాల బాగోతంపై మీనమేషాలు’ అంటూ సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు విచారణాధికారి నిడమర్రు వస్తున్నట్లు ఫిర్యాదుదారుడు మండా పోలయ్యకు సమాచారం అందించారు. జి రాయితీ భూముల్లో సాగు చేసుకునేందుకు ఎఫ్‌ఎస్‌వో తన దగ్గర రూ. 40 వేలు లంచం తీసుకున్నాడని, ఇంకా డిమాండ్ చేయడంతో వీడియోలు తీసి ఫిర్యాదు చేసినట్లు పోలయ్య లిఖిత పూర్వకంగా రేంజర్‌కు వివరాలు అందించారు. గ్రామంలో విచారణ పూర్తయ్యిందని నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు.
రైతులను విచారించిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment