నీటి కష్టాలకు చెక్
తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెంలో తాగునీటి సమస్యపై ‘ప్రజల నీటి కష్టాలు!’ శీర్షికన శని వారం ‘సాక్షి’లో ప్ర చురించిన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. కుళాయిలు వస్తున్న సమయంలో విద్యు త్ సరఫరా ఉండటంతో మోటార్ల ద్వారా కొందరు అక్రమంగా నీటిని తోడుతున్నారని, దీంతో పలు ప్రాంతాలకు కుళాయి నీరు రావడం లేదని మహిళలు ఆందోళన చెందుతున్నారు. ‘సాక్షి’ కథనంపై స్పందించిన మున్సిపల్ కమిషనర్, విద్యుత్ శాఖ అధికారులు కుళాయిలు వచ్చే సమయంలో ఉదయం, సాయంత్రం అరగంట సేపు విద్యుత్ సరఫరా నిలిపివేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో మూడు రోజులుగా తాగునీటి సమస్య ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో కుళాయిల ద్వారా నీరందింది.
వైఎస్సార్‌సీపీ అనుబంధ కమిటీల్లో నియామకాలు
భీమవరం(ప్రకాశం చౌక్): వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా నేతలను రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో వివిధ హాదాల్లో నియమిస్తూ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర కమిటీలో వివిధ హోదాల వారీగా నియమితులైన వారు ఇలా.. మహిళా విభాగం జనరల్ సెక్రటరీగా కర్రా జయసరిత, మహిళా విభాగం సెక్రటరీగా పాలవెల్లి మంగ, బీసీ సెల్ జనరల్ సెక్రటరీగా దొంగ మురళీ కృష్ణ, బీసీ సెల్ జనరల్ సెక్రటరీగా కట్టుబోయిన ప్రసాద్, బీసీ సెల్ సెక్రటరీగా కర్రి ఏసుబాబు, బీసీ సెల్ సెక్రటరీగా సందక సత్తిబాబును ని యమించారు. అలాగే వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీగా సీరం దుర్గరాజు, వాణిజ్య వి భాగం సెక్రటరీగా ఎస్.లీలా భావనారాయణ, వాణిజ్య విభాగం సెక్రటరీగా పెనుగొండ ఆదిశేష వెంకట నాగేశ్వరరావు, ఇంటలెక్చువల్స్ ఫోరం సెక్రటరీగా చోడే గోపీకృష్ణ, ఇంటలెక్చువల్స్ ఫోరం సెక్రటరీగా హరిదాసు రవీంద్రకుమార్, ఇంటలెక్చువల్స్ ఫోరం జాయింట్ సెక్రటరీగా ఎస్‌ఎస్ ప్రసాద్ నియమితులయ్యారు.
మహిళల స్థానం ప్రత్యేకం
భీమవరం(ప్రకాశం చౌక్): మనదేశంలో మహిళలకు ఉన్న గౌరవం ప్రపంచంలో ఎక్కడా లేదని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రకాశం చౌక్ నుంచి మహిళా ర్యాలీని డిప్యూటీ స్పీకర్ కను మూరి రఘురామ కృష్ణరాజు, కలెక్టర్ చదలవా డ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, ఆ చంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తితో కలిసి బెలూన్లు వదిలి ఆయన ప్రారంభించారు. ర్యాలీలో మహిళలు, విద్యార్థినులు పాల్గొన్నారు. ర్యాలీ అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వరకు సాగింది. జిల్లాలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి అన్నారు.
‘వైద్యసేవ’ ఉద్యోగులవిధుల బహిష్కరణ
భీమవరం(ప్రకాశం చౌక్): డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10, 17, 24 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా విధులు బహిష్కరిస్తున్నామని ఏపీ వైద్య సేవ ఎంప్లాయీస్ జేఏసీ సంఘ నాయకులు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని బీమా పరిధిలోకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తోందని, ఆప్కాస్ రద్దు దిశగా ఇప్పటికే అడుగులేసిందన్నారు. ఈ పరిణామాలతో రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు. విధుల బహిష్క రణతో పాటు జిల్లా సమన్వయకర్త అధికారి కా ర్యాలయం వద్ద నిరసన తెలుపుతామన్నారు.
సమస్యలపై సైకిల్ యాత్ర
భీమవరం(ప్రకాశం చౌక్): పేదల ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాల సమస్యల పరిష్కరించాలని, టిడ్కో కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లాలోని 20 మండలాలు, ఆరు పట్టణాల్లో సైకిల్ యాత్ర చేపట్టినట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్ తెలిపారు. భీమవరం టిడ్కో ఇళ్ల వద్ద గోపాలన్ ఆధ్వర్యంలో 15 మంది నాయకులతో చేపట్టిన యాత్రను రాష్ట్ర కమి టీ సభ్యుడు బి.బలరాం ప్రారంభించారు. బల రామ్ మాట్లాడుతూ యాత్ర 17 వరకు సాగుతుందని, పేదల ఇళ్ల సమస్యలు, కాలనీల్లో సౌకర్యాలను తెలుసుకుంటామన్నారు. కూట మి ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment