
స్పౌజ్ పింఛన్లకు కొర్రీ
కొత్త పింఛన్లు మంజూరై 15 నెలలు
ఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025
సాక్షి, భీమవరం: సూపర్ సిక్స్ అమలుకు చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం పేదలకు ఆర్థిక భరోసా నిచ్చే పింఛన్లకు కొర్రీలు పెడుతోంది. పాలన చేపట్టిన పది నెలల కాలంలో కొత్త పింఛన్ల మంజూరు చేయకపోగా ముందెన్నడూ లేనివిధంగా స్పౌజ్ పింఛన్ల మంజూరుకు కటాఫ్ డేట్ పెట్టింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో లబ్ధిదారుడు మృతిచెందితే మరుసటి నెల నుంచే భార్యకు పింఛన్ అందిస్తే ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది.
నవంబరు నుంచి మాత్రమే.. సాధారణంగా పింఛన్ లబ్ధిదారుడు మృతిచెందితే అతని భార్య (స్పౌజ్)కు పింఛన్ మంజూరు చేస్తారు. ఈ మేరకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ యాప్‌లో ఆప్షన్ ఉంటుంది. కూటమి పాలన చేపట్టిన వెంటనే సంక్షేమ పథకా లు, పౌరసేవలకు సంబంధించిన వెబ్‌సైట్లను క్లోజ్ చేయడంతో స్పౌజ్ పింఛన్ల మంజూరు నిలిచిపోయింది. ఎట్టకేలకు నవంబరులో పెన్షన్ వెబ్‌సైట్‌లో కేవలం స్పౌజ్ ఆప్షన్ మాత్రమే ఓపెన్ చేసిన కూ టమి ప్రభుత్వం ఆ నెల నుంచి మృతి చెందిన వారి భార్యలకు మాత్రమే పింఛన్ మంజూరు అయ్యేలా మార్పులు చేసింది. దీంతో అంతకుముందు చనిపోయిన వారి కుటుంబాలకు ఈ పథకం వర్తించకుండా పోయింది. రెండు నెలల పాటు స్పౌజ్ పింఛన్లు మంజూరు చేయగా తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో మళ్లీ ఆప్షన్‌ను క్లోజ్ చేసేసి తాజాగా మార్చి నెల నుంచి మళ్లీ ఓపెన్ చేసింది.
స్పౌజ్ లబ్ధి కొందరికే.. నవంబరు నుంచి మాత్రమే స్పౌజ్ పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కటాఫ్ డేట్ పెట్టడంతో అంతకు ముందు భర్తను కోల్పోయిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గతేడాది జనవరి నాటికి జిల్లాలో 2,36,928 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా ప్రస్తుతం వారి సంఖ్య 2,27,086కు తగ్గింది. 9,842 మంది పింఛన్లను ప్రభుత్వం తొలగించింది. మృతిచెందిన వారి పింఛన్లు తొలగించినట్టుగా అధికారులు చెబుతున్నారు. వీరిలో 60 శాతం మంది పురుషులే ఉంటారని అంచనా. ఈ మేరకు సుమారు 5,900 మంది మృతులకు సంబంధించి వారి భార్యలకు (స్పౌజ్ కేటగిరీ) పింఛన్ మంజూరు చేయాల్సి ఉండగా కేవలం 607 మందికి మాత్రమే పింఛన్ సాయం అందిస్తుండటం గమనార్హం. మిగిలిన వారికి పింఛన్ సాయం పొందేందుకు అర్హత ఉన్నా కూటమి తీరుతో వారికి అందడం లేదు.
న్యూస్‌రీల్
మోగల్లుకు చెందిన 62 ఏళ్ల భాగ్యవతి భర్త గతేడాది ఆగస్టులో చనిపోయారు. అప్పటికే
ఆయన పింఛన్ తీసుకుంటుండటంతో స్పౌజ్ కోటాలో మరుసటి నెల నుంచే ఆమెకు పింఛన్
అందజేయాలి. అయితే ఆమెకు పింఛన్ రాకపోవడంతో సచివాలయానికి పలుమార్లు వెళ్లి అడిగినా స్పౌజ్ ఆప్షన్ ఓపెన్ కావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. కానీ నవంబరులో అదే గ్రామానికి చెందిన మరో పింఛన్ లబ్ధిదారుడు మృతిచెందగా ఆయన భార్యకు పింఛన్ మంజూరైంది. ఇదేంటని సచివాలయ సిబ్బందిని అడిగితే నవంబరు నుంచి చనిపోయిన వారికి మాత్రమే ప్రభుత్వం స్పౌజ్ ఆప్షన్ ఓపెన్ చేసినట్టు చెప్పారు.
నవంబరు నుంచి మాత్రమే కొత్తవి మంజూరు
అంతకు ముందు చనిపోయిన వారి భార్యలకు చేకూరని లబ్ధి
పింఛన్ తీసుకుంటూ ఏడాదిలో చనిపోయిన వారు సుమారు 9,842 మంది
కేవలం 607 మందికి మాత్రమే స్పౌజ్ కేటగిరీలో మంజూరు
కొత్త పింఛన్ల కోసం పెండింగ్‌లో 20 వేలకు పైగా దరఖాస్తులు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏటా జనవరి, జూలైల్లో కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే రాజకీయాలు, కులమత వర్గాలకు అతీతంగా అర్హులను ఎంపిక చేసేవారు. 2023 జూలై నుంచి డిసెంబరు వరకు వచ్చిన దరఖాస్తుల మేరకు గతేడాది జనవరిలో జిల్లాలో 4,274 కొత్త పింఛన్లు మంజూరు చేశారు. మరలా జూలైలో కొత్త మంజూరు రావాల్సి ఉంది. జూన్‌లో కూటమి ప్రభు త్వం ఏర్పడగా ఇప్పటికీ పది నెలలు కావస్తున్నా కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛన్లు కోరుతూ దాదాపు 20 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నా యి. అర్హత ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యంతో పింఛన్ లబ్ధి పొందలేకపోతున్నారు. పింఛన్ వస్తే తమ జీ వనానికి ఆసరా అవుతుందని, ప్రభుత్వం చొరవ చూపాలని పేదలు కోరుతున్నారు.

స్పౌజ్ పింఛన్లకు కొర్రీ

స్పౌజ్ పింఛన్లకు కొర్రీ
Comments
Please login to add a commentAdd a comment