ఆస్పత్రిలో శిశువు మరణంపై వీడిన మిస్టరీ
కై కలూరు: కై కలూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) బాత్‌రూంలో ఆడ శిశువు మరణంపై మిస్టరీ శనివారం వీడింది. మృత శిశువును వదలి శుక్రవారం రాత్రి పరారైన బాలిక (17)ను పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. కై కలూరు మండలం రాచపట్నం గ్రామానికి చెందిన బాలికను లారీ డ్రైవర్ (33)గా పనిచేస్తున్న స్వయానా మేనమామ గర్భవతిని చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఈ విషయం ఎవరికై నా చెబితే చంపేస్తానని బెదిరించడం వల్ల బాత్‌రూంలో బిడ్డను ప్రసవించిన తర్వాత భయంతో బయటకు వచ్చానని పోలీసుల ఎదుట సదరు బాలిక చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతం బాలికకు కై కలూరు సీహెచ్‌సీలో చికిత్స అందిస్తున్నారు. బాలిక నర్సింగ్ కోర్సు చేసింది. ఆమె తండ్రి 15 ఏళ్ల క్రితం మరణించాడు. తల్లి పనులకు వెళుతూ ఒక్కగానొక్క బిడ్డను పెంచుతోంది. ఈ క్రమంలోనే మేనమామ ఆమైపె లైంగిక దాడి చేసినట్టు తెలుస్తోంది. అతను పోలీసులు అదుపులో ఉన్నట్టు సమాచారం. ఏలూరు డీఎస్పీ ఆదేశాలతో కై కలూరు పట్టణ సీఐ పి.కృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వైద్యాధికారుల విచారణ
ఆడ మృత శిశువు మరణంపై కలెక్టర్ ఆదేశాలతో డీసీహెచ్‌ఎస్ పాల్ సతీష్‌కుమార్ కై కలూరు సీహెచ్‌సీలో శనివారం విచారణ చేపట్టారు. రాత్రి విధుల్లో ఉన్న సిబ్బందిని ఒక్కొక్కరిని విచారించారు. ఇంత ఘటన జరిగినా ఆస్పత్రి సూపరింటెండెంట్ అల్లాడి శ్రీనివాసరావు రాకపోవడంపై మీడియా సభ్యులు ప్రశ్నిస్తే అక్కడ సిబ్బంది సెలవులో ఉన్నారని సమాధానం చెప్పారు. ప్రత్యేక అధికారితో పూర్తిస్థాయి విచారణ చేయించి ఉన్నతాధికారులకు శిశువు మరణంపై నివేదిక అందిస్తామని డీసీహెచ్‌ఎస్ చెప్పారు.
రాచపట్నానికి చెందిన బాలికగా గుర్తింపు
జిల్లా వైద్యాధికారుల విచారణ
Comments
Please login to add a commentAdd a comment