మహిళల విద్యతోనే దేశాభివృద్ధి
భీమవరం(ప్రకాశం చౌక్): మహిళలు చదువుకుంటేనే దేశాభివృద్ధి సాధ్యమని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. భీమవరం అంకాల ఆర్ట్ అకాడమీలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు కోడే విజయమ్మ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ మహిళా దినోత్సవానికి శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుందని, కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్నారు. ఎక్కడ సీ్త్రలను పూజిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని అన్నారు. జిల్లా అధ్యక్షురాలు విజయమ్మ మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పి స్తే అన్ని రంగాల్లో మరింత రాణిస్తారన్నారు. మనదేశంలో మహిళలకు ఉన్న గౌరవం ప్రపంచంలో ఏ దేశంలో లేదన్నారు. అనంతరం ఐదుగురు మహిళలను సత్కరించారు. పార్టీ నేతలు కోడే యుగంధర్, కామన నాగేశ్వరరావు, గాదిరాజు రామరాజు, ఏఎస్ రాజు, చిగురుపాటి సందీప్, విప్పర్తి సత్యవేణి, చవ్వాకుల సత్యనారాయణ, బొమ్మిడి శాంతి, ఇంటి సత్యనారాయణ, డీవీడీ ప్రసాద్, పాలా రాంబాబు, సూర్యకళ తదితరులు పాల్గొన్నారు.
మండలి చైర్మన్ మోషేన్‌రాజు
Comments
Please login to add a commentAdd a comment