ప్రగతి పథమే మహిళా శక్తికి నిదర్శనం
కలెక్టర్ నాగరాణి
భీమవరం(ప్రకాశం చౌక్): అన్ని రంగాల్లో మహిళలు ప్రగతి పథంలో పయనించడమే మహిళా శక్తికి నిదర్శనమని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శనివారం భీమవరం కాస్మోపాలిటిన్ క్లబ్ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళ విద్యావంతురాలు అయితే ఆ కుటుంబంతో పాటు సమాజం, దేశం అభివృద్ధి చెందుతాయ న్నారు. ప్రతిఒక్కరి విజయం వెనుక సీ్త్ర శక్తి ఉంటుందన్నారు. మహిళా దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. భారతీయ విద్యాభవన్స్, విష్ణు కళాశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. డీఆర్డ్డీఏ, మెప్మా, ఐసీడీఎస్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ స్టాల్స్ ప్రదర్శనను కలెక్టర్ పరిశీలించి అభినందించారు. భీమవరం ఎమ్మెల్యే, పీఏసీ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఏఎస్‌సీపీసీ చైర్మన్ పీతల సుజాత, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుణకుమారి, ట్రైనీ డీఎస్పీకె.మానస, డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment