మధ్యవర్తిత్వంతో సత్వర పరిష్కారం
ఏలూరు (టూటౌన్): కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఎంతో దోహాదపడుతుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి (ఎఫ్‌ఏసీ) ఎం.సునీల్ కుమార్ అన్నారు. ఎంపిక చేసిన న్యాయవాదులకు, సోషల్ వర్కర్ల జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎం.సునీల్‌కుమార్ మాట్లాడుతూ ఐదు రోజులపాటు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో తెలుసుకున్న మెలకువలతో మరింత నైపుణ్యంతో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. మధ్యవర్తి త్వం ద్వారా ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన, చట్టపరమైన షరతులతో రాజీ చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెండో అదనపు జిల్లా జడ్జి పి.మంగకుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం తదితరులు పాల్గొన్నారు.