
రెడ్‌బుక్ పాలనతో ప్రజాజీవనం అస్తవ్యస్తం
తాడేపల్లిగూడెం అర్బన్: కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ పాలన అవలంబించడంతో రాష్ట్రంలో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారిందని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం తాడేపల్లిగూడెంలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్‌సీసీ ప్రభుత్వానికి మించి సంక్షేమం అందిస్తామని, సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రజలను నమ్మించి మరోసారి మోసగించి అధికారంలోకి వ చ్చిన నయవంచకుడు చంద్రబాబు అని విమర్శించారు. వలంటీర్లకు నెలకు జీతం రూ.10 వేలు ఇవ్వాలని చెప్పిన కూటమి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్కడా కానరావడం లేదన్నారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితమని చెప్పి కొందరికే పథకాన్ని అమలు చేయడం వారి అసమర్థతకు నిదర్శనమన్నారు. తల్లికి వందనం పథకానికి రూ.12 వే ల కోట్లు అవసరం కాగా బడ్జెట్‌లో రూ.8,500 కోట్లు కేటాయించడం ద్వారా పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేమని కూటమి ప్రభుత్వం తేటతెల్లం చేసిందన్నారు. మహిళలకు నెలకు రూ.1,500, నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామన్న హామీల అమలుకు బడ్జెట్‌లో కేటాయింపులు లేవ న్నారు. రాష్ట్రానికి వస్తున్న కోట్ల రూపాయల ఆదా యాన్ని ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గత ఐదేళ్లలో జగన్ ఇచ్చిన హామీలను సమర్థవంతంగా అమలు చేసినప్పుడు ఇదే బడ్జెట్ కదా.. మరి మీరు ఎందుకు అమలు చేయట్లేదంటూ కూటమి ప్రభుత్వాన్ని కొట్టు ప్రశ్నించారు.
ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ భారాలు
విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పి రూ.15 వేల కోట్ల అధిక భారాన్ని ప్రజల నెత్తిపై చంద్రబాబు రు ద్దారని మండిపడ్డారు. నేరుగా దాబాల్లోనే మద్యం అమ్మేస్తూ, ఎక్కడికక్కడ విచ్చలవిడిగా మద్యం అందిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వమే వీధివీధికీ బెల్టు షాపులు ఏర్పాటు చేసి రూ.10 ఎక్కువ ధరకు అ మ్ముతోందన్నారు. మందుబాబుల నుంచి కోట్లు దోచేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అవినీ తి పాలనకు పవన్ కల్యాణ్ తాళం వేస్తున్నారని దుయ్యబట్టారు.
పోలీసు వ్యవస్థ నీరుగారిపోయింది
న్యాయం కోసం పోలీసులను ప్రజలు ఆశ్రయిస్తే వా రు కిమ్మనకుండా ఉండటం దారుణమన్నారు. రా ష్ట్రంలో పోలీసు వ్యవస్థ నీరుగారిపోయినట్టుగా ఉందన్నారు. టీడీపీకి తాను ప్రాణం పోసినట్టు చెబుతు న్న పవన్ కల్యాణ్ ప్రభుత్వంలో జరిగే వైఫల్యాలకు ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రోజుకో వేషం, రోజుకో నాటకం పవన్ కల్యాణ్ తీరని మాజీ మంత్రి కొట్టు విమర్శించారు.
మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ