అంతరిక్ష అధిపతికి కరోనా..! | Something Bogus Going On : Elon Musk On Results After 4 Covid Tests | Sakshi
Sakshi News home page

అంతరిక్ష అధిపతికి కరోనా..!

Published Fri, Nov 13 2020 3:35 PM | Last Updated on Fri, Nov 13 2020 3:54 PM

Something Bogus Going On : Elon Musk On Results After 4 Covid Tests - Sakshi

వాష్టింగన్‌ : ఏ విషయమైనా తన దైన శైలిలో విమర్శిస్తూ ట్వీట్‌ చేసే వ్యక్తుల్లో ఎలెన్‌ మస్క్ ఒకరు. అయితే కరోనా విషయంలో తాను చేసిన కొన్ని ట్వీట్‌లు వివాదాస్పదం అయ్యాయి.  ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో స్పేస్‌ ఎక్స్‌, టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ మరోసారి  ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు కరోనా టెస్ట్ ఫలితాలలో కచ్ఛితత్వం లేదంటూ విమర్శించారు. ఒకే రోజలో 4 సార్లు ర్యాపిడ్‌ ఆంటిజెన్‌ టెస్ట్  చేయించుకుంటే, రెండు సార్లు పాజిటివ్‌, మరో రెండు సార్లు నెగెటివ్‌ వచ్చిందంటూ స్వీయ అనుభవాన్ని వివరించారు.. ఆంటిజెన్‌ ర్యాపిడ్‌  టెస్ట్ లు అంతా బోగస్‌ అంటూ ట్విటర్‌ లో టెస్ట్ కిట్‌ల తయారీ కంపెనీకి ట్యాగ్‌ చేశారు. ప్రస్తుతం  ప్రసుతం మస్క్ ఆసాధారణ జలుబుతో బాధపడుతూ, పీసీఆర్‌ టెస్ట్‌ ఫలితాల కోసం ఎదురుచూస్తునన్నారు.(చదవండి: ఎలన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు)

అయితే ఇంతక ముందు కరోనా విషయంలో ప్రభుత్వాలు అనవసరంగా లాక్‌డౌన్‌ విధించాయని విమర్శిస్తూ పలు ట్వీట్‌లు చేశారు. రోడ్డు ప్రమాదాలలో చనిపోయే వ్యక్తుల కన్నా కరోనాతో మరణించే వారి సంఖ్య తక్కువేనన్నారు.  కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా తాను దాన్ని తీసుకునే రిస్క్‌ చేయనన్నారు.  ఓ ఇంటర్వ్యూలో ఎలెన్‌ మస్క్‌ మాట్లాడుతూ.. తనకు, తన పిల్లలకు కరోనా వైరస్‌ నుంచి ఎలాంటి ప్రమాదం లేనందున వ్యాక్సిన్‌ తీసుకునే ఆలోచన లేదన్నా మస్క్ ప్రస్తుతం కరోనా బారిన పడటం తో నెటిజన్లు ట్రోలింగ్ ‌చేస్తున్నారు..(చదవండి: నాకు బిల్‌గేట్స్‌తో ఎలాంటి ఎఫైర్ లేదు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement