వాషింగ్టన్: ప్రపంచం అంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోంది. దేశాలన్ని వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో టెస్లా కంపెనీ సీఈఓ, బిలియనీర్ ఎలన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా తాను దాన్ని తీసుకునే రిస్క్ చేయనన్నారు. తానే కాక కుటుంబంలో ఎవరికి కూడా వ్యాక్సిన్ వేయించనని స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఎలెన్ మస్క్ మాట్లాడుతూ... తనకు, తన పిల్లలకు కరోనా వైరస్ నుంచి ఎలాంటి ప్రమాదం లేనందున వ్యాక్సిన్ తీసుకునే ఆలోచన లేదన్నారు. అయితే దీనికి అర్థం ఏంటో ఆయన వివరించలేదు. (చదవండి: 'నాకు బిల్‌గేట్స్‌తో ఎలాంటి ఎఫైర్ లేదు')
ఇక కోవిడ్ కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడాన్ని కూడా ఎలన్ మస్క్ తప్పు పట్టారు. ఇది సరైన నిర్ణయం కాదన్నారు. వైరస్ వల్ల ఎందరో చనిపోతున్నారు కదా అంటే.. ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరు మరణించాల్సిందే అంటూ వేదాంతం వల్లించారు. ఇక గతంలో వైరస్‌ని డంబ్ అన్న మస్క్ అది మనుషులను మానసికంగా చంపుతుంది అన్నారు. వైరస్ బారిన పడి మరణించే వారి కంటే కారు ప్రమాదానికి గురయ్యి చనిపోయే వారి సంఖ్యే అధికంగా ఉంది అంటూ తన ఉద్యోగులకు మార్చిలో లేఖ రాశారు మస్క్
Comments
Please login to add a commentAdd a comment