Antigen
-
ఎవరివైనా.. ఎవరికైనా.. అవయవాలు అందరికీ..
సాక్షి సెంట్రల్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వివిధ కారణాలతో అవయవాలు దెబ్బతిని దాతల కోసం ఎదురుచూస్తున్నారు. తమ శరీరంతో మ్యాచ్ అయ్యే అవయవం ఎప్పుడు దొరుకుతుందా అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకీడుస్తున్నారు. మనుషుల్లో వేర్వేరు గ్రూపుల రక్తం ఉండటం, ఆ రక్తానికి అనుగుణంగానే అవయవాలన్నీ అభివృద్ధి చెంది ఉండటమే దీనికి కారణం. అదే ఎవరి అవయవమైనా, ఎవరికైనా అమర్చగలిగితే.. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలను కాపాడొచ్చు. ఈ అద్భుతాన్ని సాకారం చేసేదిశగా అడుగులు పడుతున్నాయ్. ఆ వివరాలేమిటో తెలుసుకుందాం.. చదవండి: ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ హాయిగా బరువు తగ్గండి.. అవయవాలు ఉన్నా.. అమర్చలేక.. ఏదైనా ప్రమాదంలోనో, బ్రెయిన్‌డెడ్ వంటి కారణాలతోనో చనిపోతున్నవారి అవయవాలను అవసరమైన వారికి అమర్చలేని పరిస్థితి అన్నిచోట్లా ఉంది. అవయవాలు ఎక్కువసేపు జీవంతో ఉండకపోవడం, వాటి పరిమాణం కూడా ఎక్కువ తక్కువగా ఉండటం, తగిన స్వీకర్తలు సమీపంలో లేకపోవడం కూడా దీనికి కారణం. ఈ నేపథ్యంలోనే.. ఏ గ్రూపు రక్తం వారి అవయవాన్ని అయినా.. మరే గ్రూపువారికైనా అమర్చగలిగే విధానంపై అమెరికాలోని టొరొంటో యూనివర్సిటీ అజ్మెరా ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. పలువురు దాతల నుంచి సేకరించిన ఊపిరితిత్తులను ‘యూనివర్సల్ లంగ్స్ (ఏ రక్తం గ్రూపువారికైనా అమర్చగలిగే ఊపిరితిత్తులు)’గా మార్చగలిగారు. ఏ రక్తం వారికి.. ఎలా? సాధారణంగా మన ఎర్రరక్త కణాలపై, రక్తనాళాల లోపలి పొరలపై.. ఏ, బీ అనే రెండు రకాల యాంటీజెన్లు ఉంటాయి. ఇందులో ‘ఏ యాంటీజెన్’ ఉన్న రక్తాన్ని ‘ఏ’ గ్రూప్‌గా.. ‘బీ యాంటీజెన్’ ఉన్న రక్తాన్ని ‘బీ’ గ్రూప్‌గా.. రెండు యాంటీజెన్లు ఉన్న రక్తాన్ని ‘ఏబీ’ గ్రూపుగా.. అసలు యాంటీజెన్లు లేని రక్తాన్ని ‘ఓ’ గ్రూప్‌గా వర్గీకరించారు. ►మరోవైపు మన శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మజీవులు, ఇతర జీవకణాలను నాశనం చేసే యాంటీబాడీలు కూడా రక్తంలో ఉంటాయి. ఇవి రక్తం, ఇతర కణాలపై ఉండే యాంటీజెన్లను గుర్తించి.. అవి మన శరీరానివి కాకుండా, వేరే విధంగా ఉంటే దాడి చేస్తాయి. ►ఉదాహరణకు.. రాజు రక్తం ‘ఏ’ గ్రూప్‌కు చెందినది. ఆయనకు ‘బీ’ గ్రూప్ రక్తం ఎక్కిస్తే.. ఈ రక్తంలోని ‘బీ’ యాంటీజెన్పై రాజు శరీరంలోని యాంటీబాడీలు దాడి చేస్తాయి. దీనితో రక్తం గడ్డ కట్టి మరణించే ప్రమాదం ఉంటుంది. కృత్రిమ పరికరంలో అమర్చి.. సాధారణంగా దాతల నుంచి సేకరించిన ఊపిరితిత్తులను కొంత సమయం పాటు సజీవంగా ఉంచడానికి ‘ఎక్స్ వివో లంగ్ పర్ఫ్యూజన్ (ఈవీఎల్పీ)’ అనే పరికరాన్ని వినియోగిస్తారు. దాని ద్వారా పోషకాలను, నీటిని ఊపిరితిత్తులకు అందజేస్తారు. టొరొంటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా ఈ పరికరంలో ఊపిరితిత్తులను ఉంచి ప్రయోగం చేశారు. మన జీర్ణవ్యవస్థలోని బ్యాక్టీరియాలతో.. ‘ఏ, బీ, ఏబీ’ గ్రూపుల రక్త కణాలపై ఉండే యాంటీజెన్‌ను తొలగించి.. ‘ఓ’ గ్రూపుగా మార్చడంపై ఇప్పటికే బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా మార్చితే.. సదరు రక్తాన్ని ఎవరికైనా ఎక్కించేందుకు వీలవుతుంది. ఈ క్రమంలో మన జీర్ణవ్యవస్థ, పేగుల్లో ఉండే ఒక రకం బ్యాక్టీరియా విడుదల చేసే రెండు ఎంజైమ్‌లు (ఎఫ్పీగాలెనేస్ డీసెటైలేజ్, ఎఫ్పీగలాక్టోసమినిడేజ్) దీనికి తోడ్పడతాయని గుర్తించారు. ఆ పరిశోధనను టొరొంటో శాస్త్రవేత్తలు పరిగణనలోకి తీసుకున్నారు. ►సదరు బ్యాక్టీరియా ఎంజైమ్‌లను సేకరించారు. ఈవీఎల్పీ పరికరంలో ఊపిరితిత్తులకు పంపే పోషకాలతో పాటు ఆ ఎంజైమ్‌లను కూడా పంపారు. ►ఈ ఎంజైమ్‌లు ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల ద్వారా ప్రయాణిస్తూ.. వాటిలో ఉన్న ‘ఏ, బీ యాంటీజెన్’లను నిర్వీర్యం చేశాయి. దీనితో సదరు ఊపిరితిత్తులు ‘ఓ’ గ్రూపు కిందకి మారాయి. అంతేకాదు ఈ ప్రక్రియలో సదరు ఊపిరితిత్తులకు ఎటువంటి హాని జరగలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే అవయవం కోసం ఎదురుచూస్తున్న ఎవరికైనా ఈ ఊపిరితిత్తులను అమర్చేందుకు వీలైనట్టే. ‘ఓ’ గ్రూపు వారికి ఎక్కువగా.. ఓ గ్రూప్ రక్తం ఉన్న వారి అవయవాలను అందరికీ అమర్చవచ్చు. దీంతో ఈ గ్రూప్ అవయవాలకు డిమాండ్ పెరిగింది. మరోవైపు ఓ గ్రూప్ వాళ్లకు అదే గ్రూప్ వాళ్ల అవయవాలే సరిపోతాయి. డిమాండ్ పెరగడంతో సొంత ఓ గ్రూప్ వాళ్లకే ఆర్గాన్స్ దొరకని పరిస్థితి ఏర్ప డింది. అవయవ మార్పిడి కోసం ఈ గ్రూప్ వాళ్లు ఎదురుచూస్తూ చూస్తూ మరణిస్తున్నారు. ఏడాదిన్నరలో మనుషులపై.. యూనివర్సల్ లంగ్స్‌కు సంబంధించి మరింత పరిశోధన చేసి, భద్రతపై పూర్తిస్థాయి స్పష్టతకు వస్తామని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ మార్సెలో సైపెల్ తెలిపారు. ఏడాదిన్నరలో మనుషులపై పూర్తిస్థాయి క్లినికల్ ట్రయల్స్ చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఇది విజయవంతమైతే.. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు. రక్తం కొరత ఉండనట్టే.. రక్తం నుంచి యాంటీజెన్లను తొలగించేందుకు చేపట్టిన పరిశోధన దాదాపు కొలిక్కి వచ్చినట్టు బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. యాంటీజెన్లను నిర్వీర్యం చేసే ఎంజైమ్‌లను కృత్రిమంగా ఉత్పత్తి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఏ రక్తాన్ని ఎవరికైనా ఎక్కించవచ్చని, రక్తం కొరత అనేదే ఉండకపోవచ్చని స్పష్టం చేస్తున్నారు. -
తెలంగాణలో 80% యాంటిజెన్ పరీక్షలే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలో కాస్త నిర్లక్ష్యం కనిపిస్తోంది. యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ వచ్చి, కరోనా లక్షణాలు ఉన్నవారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయాలన్న నిబంధనను వైద్య ఆరోగ్య అధికారులు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు చేసిన వాటిలో 80 శాతంపైగా యాంటిజెన్ పరీక్షలే. కేవలం 17.51 శాతానికే ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు పరిమితమైనట్లు ఇటీవల విడుదల చేసిన నివేదికలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,35,67,447 యాంటిజెన్ పరీక్షలు చేయగా, ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్య 23,76,131కు మాత్రమే పరిమితమైంది. ప్రస్తుత ఆగస్టులో 10 శాతంలోపే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసినట్లు కేంద్రం పేర్కొంది. కొన్ని జిల్లాల్లో మరీ ఘోరంగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు అత్యంత తక్కువగా చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాల లెక్కల ప్రకారం.. గత నెల 4 నుంచి ఈ నెల 8 వరకు నిర్వహించిన పరీక్షల్లో కొన్ని జిల్లాల్లో అత్యంత తక్కువగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ఈ కాలంలో నారాయణపేటలో 14,350 పరీక్షలు చేస్తే, అందులో కేవలం 10 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. మిగిలివన్నీ యాంటిజెన్ పరీక్షలే. అలాగే నిజామాబాద్ జిల్లాలో ఇదే కాలంలో 38,249 పరీక్షలు చేస్తే, అందులో 61 మాత్రమే ఆర్టీపీసీఆర్ పరీక్షలు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,35,305 పరీక్షలు చేస్తే, అందులో కేవలం 352 మాత్రమే ఆర్టీపీసీఆర్ పరీక్షలు. అదనంగా ఆర్టీపీసీఆర్ కేంద్రాలు పెట్టినా రాష్ట్రంలో నెల క్రితం అదనంగా 14 జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల ఎక్కువ మందికి ఆ టెస్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. తక్కువ సమయంలో పరీక్షా ఫలితాలు ఇవ్వడానికి వీలుంది. కొత్తవాటితో రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ కేంద్రాల సంఖ్య 31కి చేరుకుంది. కానీ చాలా జిల్లా ఆసుపత్రుల్లో వీటిని పూర్తిస్థాయిలో వినియోగించడం లేదు. యాంటిజెన్ పరీక్షలకే మొగ్గుచూపుతున్నారు. -
90% యాంటిజెన్ పరీక్షలే...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్వహిస్తున్న కరోనా నిర్ధారణ పరీక్షల్లో 90 శాతంపైగా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులేనని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షలపై వైద్య శాఖ ఒక నివేదిక తయారు చేసింది. ఈ సమయంలో మొత్తం 24,69,017 టెస్టులు చేయగా, అందులో 22,45,418 టెస్టులు (90.94%) యాంటిజెన్ పద్ధతిలో నిర్వహించినవేనని, కేవలం 9.06 శాతం మాత్రమే ఆర్టీపీసీఆర్ పద్ధతిలో చేశామని ఆ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 99.45 శాతం యాంటిజెన్ పరీక్షలే నిర్వహించారు. ఇక్కడ కేవలం 0.55 శాతమే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. దీనివల్ల చాలావరకు.. కరోనా లక్షణాలుండి యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ వచ్చినవారిలో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయకపోవడం వల్ల పాజిటివ్ కేసులు మిస్ అవుతున్నట్లు అంచనా వేశారు. వాస్తవంగా యాంటిజెన్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చి లక్షణాలుంటే, వారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయాలన్నది నిబంధన. కానీ చాలామంది నెగెటివ్ రిపోర్ట్ రాగానే తమకు కరోనా లేదని సాధారణంగా తిరుగుతున్నారు. అటువంటి వారిలో కొందరికి సీరియస్ అవుతున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. కొన్నిచోట్ల ఆర్టీపీసీఆర్ పరీక్ష అందుబాటులో లేకపోవడం, మరికొన్నిచోట్ల దాని ఫలితం ఆలస్యం కారణంగా అనేకమంది ఈ పరీక్షలను చేయించుకోవడంలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా త్వరలో కొత్తగా మరో 14 ఆర్టీపీసీఆర్ లేబొరేటరీలు అందుబాటులోకి రానుండటంతో ఈ పరీక్షల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు. కాగా, తమిళనాడు రాష్ట్రంలో నూరు శాతం ఆర్టీపీసీఆర్ పరీక్షలే చేస్తున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించింది. ఆదిలాబాద్ జిల్లాలో తక్కువ పాజిటివిటీ ఈ నెల ఒకటో తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షల్లో రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 1.46 శాతంగా నమోదైందని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. అందులో అత్యంత తక్కువగా 0.36 శాతం పాజిటివిటీ రేటు ఆదిలాబాద్ జిల్లాలో నమోదైంది. ఆ తర్వాత నిర్మల్ జిల్లాలో 0.40 శాతం, నాగర్‌కర్నూలు జిల్లాలో 0.66 శాతం, నిజామాబాద్ జిల్లాలో 0.69 శాతం పాజిటివిటీ నమోదైంది. కాగా, అత్యధికంగా వరంగల్ రూరల్ జిల్లాలో 2.38 శాతం, ఖమ్మం జిల్లాలో 2.07 శాతం, రంగారెడ్డి జిల్లాలో రెండు శాతం పాజిటివిటీ నమోదైంది. -
విమానం ఎక్కాలంటే ‘యాంటిజెన్’ మస్ట్
సాక్షి, హైదరాబాద్: ఇకపై విమాన ప్రయాణం చేయాలంటే యాంటిజెన్ పరీక్ష తప్పనిసరి. కరోనా లక్షణాలు లేనివారినే విమానంలోకి అనుమతిం చాలని భావిస్తున్న పౌర విమానయాన సంస్థ ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిసింది. ఒకవేళ అందు లో పాజిటివ్‌గా తేలితే ప్రయాణాలను రద్దు చేసేలా ఆంక్షలు విధించేటట్లు ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం. లాక్డౌన్ తర్వాత అంతర్జాతీయ ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ తప్పనిసరి చేసినట్లుగానే దేశీయ ప్రయాణాల్లో ‘యాంటిజెన్ ’ను తప్పనిసరి చేయాలని భావిస్తున్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. సెకండ్ వేవ్ ఉధృతి దృష్ట్యా ఇప్పటికే వందల విమానాలు రద్దయ్యాయి. కొందరు ప్రయాణికులు స్వచ్ఛందంగానే తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న లాక్డౌన్ నిబంధనలు, కర్ఫ్యూల వంటి వాటితో కూడా రాకపోక లు స్తంభించాయి. ఈ క్రమంలోనే విమానం బయలుదేరడానికి ముందు యాంటిజెన్ పరీక్ష చేసుకుంటే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ‘మ్యాప్ మై జీనోమ్’ ల్యాబొరేటరీలో పరీక్షలు నిర్వహించనున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ వంటివి అమలు చేస్తున్నట్లుగానే ఇక నుంచి ‘యాంటిజెన్ ’కూడా తప్పనిసరి చేయనున్నారు. విదేశీ ప్రయాణాలకు మాత్రం 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకోవాలనే నిబంధన ఉంది. ప్రామాణికమైన ల్యాబొరేటరీల్లో చేసే పరీక్షలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. 200 విమానాలు రద్దు... కోవిడ్ సెకండ్ వేవ్‌తో విమానాల రాకపోకలు స్తం భించాయి. హైదరాబాద్ నుంచి వివిధ నగరాలకు రాకపోకలు సాగించే విమానాలు ప్రయాణికులు లేక వెలవెలబోతున్నాయి. రోజుకు 30 నుంచి 40 విమానాల వరకు రద్దవుతున్నట్లు అధికారులు తెలిపారు. వారంలో సుమారు 200లకు పైగా డొమెస్టిక్ విమానాలు రద్దయ్యాయి. సెకండ్ వేవ్‌కు ముందు దేశవ్యాప్తంగా 70 నగరాలకు హైద రాబాద్ నుంచి ప్రతి రోజు 330 విమానాలు రాకపోకలు సాగించేవి. ఇప్పుడు వీటి సంఖ్య 250కి తగ్గింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో నెలకు లక్ష మంది ప్రయాణించారు. మార్చి నుంచి క్రమంగా రద్దీ తగ్గుతూ.. ఏప్రిల్‌లో బాగా పడిపోయింది. గత నెల 40 నుంచి 50 వేల మంది ప్రయాణించి ఉండవచ్చునని అంచనా. మే నెల ఆరంభం నుంచి రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు సైతం ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. తప్పనిసరిగా వెళ్లవలసిన వాళ్లు ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపారాల దృష్ట్యా రాకపోకలు సాగించేవాళ్లే ఎక్కువగా ఉన్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ‘సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టి, వివిధ రాష్ట్రాల్లో ఆంక్షలను సడలిస్తే రాకపోకలు తిరిగి సాధారణ స్థాయికి చేరుకోవచ్చు. కానీ, ప్రయాణికుల భద్రత దృష్ట్యా యాంటిజెన్ టెస్ట్ తప్పనిసరిగా ఉంటుంది’ అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. చదవండి: కరోనా: ఐవర్‌మెక్టిన్‌తో తగ్గుతున్న మరణాల ముప్పు! -
యాంటిజెన్ టెస్టుల్లో తెలంగాణ టాప్
హైదరాబాద్: ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల్లో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో యాంటిజెన్ పరీక్షల శాతం 84.24 శాతం ఉండటం గమనార్హం. ఆర్టీపీసీఆర్ పరీక్షలు 15.52, సీబీనాట్ పద్ధతిలో 0.24 శాతం కరోనా పరీక్షలు నిర్వహించారు. తమిళనాడులో 0.13 శాతం యాంటిజెన్, 98.61 శాతం ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. రాజస్తాన్‌లో 0.29 శాతం యాంటిజెన్, 98.05 శాతం ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే కింది నుంచి మూడో స్థానంలో తెలంగాణ నిలిచిందని కేంద్రం ఇటీవల విడుదల చేసిన నివేదికలో తెలిపింది. కరోనా విజృంభణ సమయంలో ర్యాపిడ్ టెస్టుల వల్ల వేలాది మందికి వేగంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగలిగారు. ఆర్టీపీసీఆర్ పద్ధతిలో పరీక్షలు చేయించుకునేవారు శాంపిళ్లను నిర్ణీత ఆసుపత్రి లేదా డయాగ్నస్టిక్ సెంటర్‌కు వెళ్లి ఇస్తే దాని ఫలితం మరింత ఆలస్యమయ్యేది. ఒక్కోసారి రెండుమూడ్రోజులు పట్టేది. కొన్నిసార్లు వారం కూడా అయ్యేది. ర్యాపిడ్ టెస్టుల్లో అక్కడికక్కడే 20 నిమిషాల్లోనే పాజిటివా లేదా నెగెటివా అనేది తెలుస్తుంది. దీంతో యాంటిజెన్ పరీక్షలకే రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. లక్షణాలున్నవారికి ఆర్టీపీసీఆర్ తప్పనిసరి... కానీ, ర్యాపిడ్ టెస్టుల్లో పాజిటివ్ వస్తే దాని కచ్చితత్వంపై ఎలాంటి సందేహాలు అవసరంలేదు. కానీ, లక్షణాలుండి ర్యాపిడ్ టెస్ట్‌లో నెగెటివ్ వస్తే మాత్రం ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేయాలని కేంద్రం తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. రాష్ట్రంలో 1,076 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలను 20 ప్రభుత్వ ఆసుపత్రులు, 60 ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లలో నిర్వహిస్తున్నారు. ర్యాపిడ్ టెస్టులు చేసే సెంటర్లలోనే నెగెటివ్ వచ్చినవారికి లక్షణాలుంటే, వారి నుంచి తక్షణమే శాంపిళ్లను సేకరించి ఆర్టీపీసీఆర్ పరీక్షకు పంపించాలన్న ఉద్దేశం చాలాచోట్ల అమలు కాలేదు. ఈ విషయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు నిర్లక్ష్యం ప్రదర్శించాయన్న ఆరోపణలు ఉన్నాయి. చాలాచోట్ల ఆర్టీపీసీఆర్ కోసం శాంపిళ్లు తీసుకోవడానికి కూడా వైద్య సిబ్బంది నిరాకరించారు. తమ వద్ద అటువంటి వసతి లేదని బాధితులను తిప్పిపంపారు. దీంతో అనేక పాజిటివ్ కేసులు వెలుగుచూడలేదని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్టీపీసీఆర్ పరీక్షలను మరింతగా పెంచాలని సూచించారు. దానివల్లే లక్షణాలున్నవారిని కచ్చితంగా పట్టుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఆర్టీపీసీఆర్ పరీక్షలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ర్యాపిడ్‌లో నెగెటివ్ అని తేలినా లక్షణాలున్నవారి శాంపిళ్లను అక్కడికక్కడే తీసుకొని టెస్టింగ్ కేంద్రాలకు పంపాలని అధికారులను ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ టెస్టులను 40 శాతం నుంచి 50 శాతం వరకు పెంచనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. -
కరోనా నిర్ధారణలో ‘ర్యాపిడ్’ విప్లవం
సాక్షి, అమరావతి: కోవిడ్ నియంత్రణలో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్లు కీలక భాగస్వామ్యం నెలకొల్పాయి. కొత్త వైరస్ కావడానికి తోడు, వ్యాప్తి అత్యంత వేగంగా ఉండటం వల్ల అపార నష్టం సంభవించింది. ఇలాంటి పరిస్థితుల్లో వైరస్ నుంచి తక్షణమే బయట పడేందుకు ర్యాపిడ్ కిట్లు ఉపయోగపడిన తీరు అమోఘమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు డెంగీ జ్వరాలకు మాత్రమే ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వాడారు. ఇది పూర్తిగా దోమకాటు జ్వరాలకు వాడేది. కోవిడ్ సోకిన తొలి రోజుల్లో ర్యాపిడ్ కిట్లు అందుబాటులో లేవు. ఇవి బాగా అందుబాటులోకి వచ్చింది 2020 ఆగస్ట్ నుంచే. ఆ తర్వాతే కరోనా వ్యాప్తి తగ్గినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: వాటికి తొలి ప్రాధాన్యత: సీఎం జగన్) తక్కువ సమయంలో ఫలితం ♦కోవిడ్ వైరస్‌ను కనుగొనడంలో ఆర్టీపీసీఆర్ టెస్టును గోల్డెన్ స్టాండర్డ్ అని చెబుతారు. అయితే ఈ టెస్టు ఫలితం కనీసం 6 గంటల నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లోకి వచ్చిన ర్యాపిడ్ టెస్ట్ కిట్లు 10 నిమిషాల్లో అక్కడికక్కడే ఫలితం ఇచ్చాయి. పైగా సేకరించిన నమూనాలను ల్యాబ్‌లకు పంపాల్సిన అవసరం ఉండదు. పెద్దగా నైపుణ్యం కూడా అక్కర్లేదు. ♦ఇంటి వద్దకే వెళ్లి పరీక్ష చేసే అవకాశం ఉండటం వల్ల మొత్తం టెస్టుల్లో 38 శాతం ర్యాపిడ్ టెస్టులే ఉన్నాయి. ఇంటివద్దకే వెళ్లి టెస్టులు చేయడంలో ఏపీలో అద్భుత ఫలితాలు వచ్చాయి. (చదవండి: విజృంభిస్తున్న కరోనా : రికార్డు పెళ్ళిళ్లు) వీలైనంత త్వరగా అప్రమత్తం ♦ఫలితం వెంటనే తేలడంతో కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడే వీలు కలిగింది. సత్వరమే హోం ఐసొలేషన్, లేదా ఆస్పత్రిలో ఉంచి వైద్యం అందించడానికి సాధ్యమైంది. ♦హై రిస్క్ ప్రాంతాలు లేదా హైరిస్క్ గ్రూపులో ఉన్న వారిని గుర్తించడంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కీలక పాత్ర వహించాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లలో తక్షణమే టెస్టులు చేసి పాజిటివ్ వ్యక్తులను గుర్తించే వీలు కలిగింది. ♦వాస్తవానికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ కంటే ర్యాపిడ్ యాంటీజెన్ ఎక్కువ ఖరీదు అయినప్పటికీ, సత్వర ఫలితం వస్తుండటంతో దీనికి ప్రాధాన్యమిస్తున్నారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్లలో సత్ఫలితాలు ఓవైపు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తూనే మరో వైపు ర్యాపిడ్ టెస్ట్ కిట్లతోనూ పరీక్షలు చేస్తూ వచ్చాం. ర్యాపిడ్ టెస్ట్ కిట్లతో సత్వర ఫలితాలు రావడం వల్ల బాధితులను వెంటనే ఐసొలేషన్ (ఇంట్లో లేదా ఆస్పత్రిలో) చేయగలిగాం. దీనివల్ల వైరస్ వ్యాప్తి పెరగకుండా చూశాం. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి పరీక్ష చేయగలగడం వల్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోగలిగాం. - కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ ఈ నెల 22 నాటికి మొత్తం టెస్టులు 96,62,220 మొత్తం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు 35,66,496 వీటిలో పాజిటివ్‌గా వచ్చినవి 4,08,668 నెగిటివ్‌గా వచ్చినవి 31,55,092 వెయిటింగ్లో ఉన్నవి 472 ఆగస్ట్‌లో ర్యాపిడ్ టెస్ట్ కిట్ ధర రూ.410 నవంబర్‌లో ర్యాపిడ్ టెస్ట్ కిట్ ధర రూ.272 -
అంతరిక్ష అధిపతికి కరోనా..!
వాష్టింగన్ : ఏ విషయమైనా తన దైన శైలిలో విమర్శిస్తూ ట్వీట్ చేసే వ్యక్తుల్లో ఎలెన్ మస్క్ ఒకరు. అయితే కరోనా విషయంలో తాను చేసిన కొన్ని ట్వీట్లు వివాదాస్పదం అయ్యాయి. ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో స్పేస్ ఎక్స్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు కరోనా టెస్ట్ ఫలితాలలో కచ్ఛితత్వం లేదంటూ విమర్శించారు. ఒకే రోజలో 4 సార్లు ర్యాపిడ్ ఆంటిజెన్ టెస్ట్ చేయించుకుంటే, రెండు సార్లు పాజిటివ్, మరో రెండు సార్లు నెగెటివ్ వచ్చిందంటూ స్వీయ అనుభవాన్ని వివరించారు.. ఆంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ లు అంతా బోగస్ అంటూ ట్విటర్ లో టెస్ట్ కిట్ల తయారీ కంపెనీకి ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ప్రసుతం మస్క్ ఆసాధారణ జలుబుతో బాధపడుతూ, పీసీఆర్ టెస్ట్ ఫలితాల కోసం ఎదురుచూస్తునన్నారు.(చదవండి: ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు) అయితే ఇంతక ముందు కరోనా విషయంలో ప్రభుత్వాలు అనవసరంగా లాక్డౌన్ విధించాయని విమర్శిస్తూ పలు ట్వీట్లు చేశారు. రోడ్డు ప్రమాదాలలో చనిపోయే వ్యక్తుల కన్నా కరోనాతో మరణించే వారి సంఖ్య తక్కువేనన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా తాను దాన్ని తీసుకునే రిస్క్ చేయనన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఎలెన్ మస్క్ మాట్లాడుతూ.. తనకు, తన పిల్లలకు కరోనా వైరస్ నుంచి ఎలాంటి ప్రమాదం లేనందున వ్యాక్సిన్ తీసుకునే ఆలోచన లేదన్నా మస్క్ ప్రస్తుతం కరోనా బారిన పడటం తో నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు..(చదవండి: నాకు బిల్‌గేట్స్‌తో ఎలాంటి ఎఫైర్ లేదు) -
15 నిమిషాల్లోనే ఫలితం : యాంటీజెన్ టెస్ట్‌కు గ్రీన్‌సిగ్నల్
లండన్ : కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విస్తృతంగా పరీక్షలు చేపట్టేందుకు పలు దేశాలు కసరత్తు ముమ్మరం చేశాయి. పెద్దసంఖ్యలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు అనుకూలంగా 15 నిమిషాల్లోనే కోవిడ్-19 ఫలితాన్ని రాబట్టే పద్ధతికి ఐరోపా మార్కెట్లో అనుమతి లభించింది. బెక్టాన్ డికిన్సన్ అండ్ కో అభివృద్ధి చేసిన కరోనా వైరస్ పరీక్ష సార్స్-కోవ్-2 ఉపరితలంపై యాంటీబాడీల ఉనికిని ఇట్టే గుర్తిస్తుంది. చిన్న పరికరంతో నిర్వహించే ఈ యాంటీజెన్ పరీక్షకు లేబొరేటరీ అవసరం లేదు. ఈ తరహా కరోనా వైరస్ పరీక్షకు అమెరికన్ ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అత్యవసర వాడకానికి జులైలోనే అనుమతించింది. ఇక అక్టోబర్ మాసాంతానికి ఐరోపా మార్కెట్లనూ టెస్టింగ్ కిట్ల విక్రయాన్ని ప్రారంభించేందుకు బెక్టాన్ డికన్సన్ సన్నాహాలు చేపట్టింది. ఆస్పత్రుల్లోని ఎమర్జెన్సీ విభాగాల్లో, సాధారణ వైద్యులూ ఈ ర్యాపిడ్ కరోనా వైరస్ టెస్ట్‌ను ఈ పరికరం ద్వారా నిర్వహిస్తారు. కరోనా వైరస్ నియంత్రణలో తాము అభివృద్ధి చేసిన నూతన కోవిడ్-19 పరీక్ష గేమ్ ఛేంజర్ కానుందని బెక్టాన్ డికన్సన్ డయాగ్నస్టిక్స్ అధిపతి పేర్కొన్నారు. యూరప్‌లో రానున్న రోజుల్లో మరో విడత కరోనా వైరస్ కేసులు పెరిగే ప్రమాదం పొంచిఉండటంతో ఈ పరీక్షలకు డిమాండ్ అధికంగా ఉంటుందని చెప్పారు. కోవిడ్-19 వ్యాపించిన తొలినాళ్లలో చైనా తర్వాత ఇటలీ, స్పెయిన్లలో వేగంగా వ్యాధి విస్తరించడంతో యూరప్ కూడా కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. కాగా పీసీఆర్ పరీక్షలతో పోలిస్తే యాంటీజెన్ పరీక్షల కచ్చితత్వంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తమ యాంటీజెన్ టెస్ట్ 99.3 శాతం కచ్చితత్వంతో కూడినదని బెక్టాన్ డికిన్సన్ పేర్కొన్నట్టు బ్లూమ్‌బర్గ్ కథనం వెల్లడించింది. చదవండి : వ్యాక్సిన్ కహానీ: అందుబాటులోకి వచ్చేదెలా? -
కిట్..హాంఫట్..!
రాష్ట్రంలో ఓ కీలక నేతకు చెందిన మెడికల్ కాలేజీ, దాని అనుబంధ ఆసుపత్రిలో కరోనా చికిత్సలు జరుగుతున్నాయి. తనకున్న పలుకుబడితో ఆయన ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ఆర్టీ–పీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను బెదిరించి తీసుకెళ్తున్నాడు. అలా ఉచితంగా తీసుకెళ్లిన కిట్లతో పరీక్షలు చేస్తూ రూ. 3,500 చొప్పున వసూలు చేస్తున్నాడు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కిట్లకు కొరత ఏర్పడింది. ఉన్నతస్థాయిలో ఫిర్యాదు చేయాలంటే ఆసుపత్రి వర్గాలు భయపడుతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలోని ఓ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో రోజుకు కనీసం 50 ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తుంటారు. కానీ ఒక్కోసారి 30 పరీక్షలు మాత్రమే చేసి మిగిలిన కిట్లను అక్కడి డాక్టర్ సొంత క్లినిక్‌కు తీసుకెళ్తున్నాడు. టెస్టుల కోసం వచ్చే బాధితులకేమో ఆ రోజు కోటా అయిపోయిందని చెబుతూ రికార్డుల్లో మాత్రం 50 టెస్ట్‌లు చేసినట్లు చూపుతున్నాడు. అలా మిగిలిన 20 కిట్లను తన క్లినిక్‌కు తీసుకెళ్లి ఒక పరీక్షకు రూ. 3 వేల చొప్పున వసూలు చేస్తున్నాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విరివిగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన లక్షల ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను కొందరు డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు పక్కదారి పట్టిస్తున్నాయి. సాధారణంగా యాంటిజెన్ కిట్ ధర రూ.500 మాత్రమే ఉంటే, వాటిని తమ సొంత క్లినిక్‌లలో వాడుతూ రూ.3,000–3,500 వసూలు చేస్తూ పరీక్షలు చేస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి తన బోధనాసుపత్రిలో టెస్టులు చేసేందుకు బలవంతంగా ఒక జిల్లా ఆసుపత్రి నుంచి యాంటిజెన్ సహా ఆర్టీ–పీసీఆర్, యాంటి జెన్ కిట్లను తీసుకెళ్తుండటంపై ఆ జిల్లాలో దుమారం నెలకొంది. ఆ జిల్లా ఆసుపత్రిలో టెస్టులు చేయించుకోవాలంటే పలుకుబడి కలిగిన వారితో పైరవీలు చేయించుకోవాల్సిందేనన్న ఫిర్యాదులున్నాయి. ఇళ్లకు తీసుకుపోతున్న వీఐపీలు కరోనా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలను కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే 1,076 ప్రభుత్వాసుపత్రులు, కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు, డయాగ్నోస్టిక్ సెంటర్లకు ప్రభుత్వం ర్యాపిడ్ టెస్టులకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు, లేబొరేటరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కిట్లను అక్కడి సిబ్బందిని ప్రలోభపెట్టి కాజేస్తున్నాయి. ఇక ఆయా ఆసుపత్రుల్లో పనిచేసే కొందరు డాక్టర్లు కూడా వాటిని పక్కదారి పట్టిస్తున్నారు. ఇక కొందరు వీఐపీలు, నేతల ఇళ్లలోనూ కిట్లు కనిపిస్తున్నాయి. వారు టెక్నీషియన్లను పిలిపించుకొని టెస్టులు చేయించుకుంటున్నారు. ర్యాపిడ్ పరీక్ష అక్కడికక్కడే చేయడానికి వీలుండటంతో ఇలా ఎవరికివారు యాంటిజెన్ కిట్లను పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దొంగ ఓటీపీలు.. దొంగ రిజిస్ట్రేషన్లు ఒక యాంటిజెన్ పరీక్ష చేయాలంటే.. పరీక్షకు వచ్చిన బాధితుడి ఫోన్ నంబర్‌ను సంబంధిత ప్రభుత్వ వెబ్సైట్లో నమోదు చేయాలి. ఆపై ఆ నంబర్‌కు వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. దాన్ని మళ్లీ ఎంటర్ చేశాకే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది. అప్పుడు మాత్రమే బాధితుడికి టెస్టు చేయాలి. ఇంత పకడ్బందీ వ్యవస్థను కూడా కొందరు వైద్య సిబ్బంది ధ్వంసం చేస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. ఉదాహరణకు ఎలాంటి సెల్‌ఫోన్ లేని సాధారణ వ్యక్తి వచ్చి టెస్ట్ చేయమంటే, అప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం స్థానికంగా ఉండే ఆరోగ్య కార్యకర్త ఫోన్ నంబర్ ఇచ్చే వెసులుబాటు ఉంది. ఈ పరిస్థితిని కిట్లను కొట్టేసేందుకు కొందరు వైద్య సిబ్బంది తెలివిగా ఉపయోగించుకుంటున్నారు. తద్వారా రికార్డుల్లో అన్ని పరీక్షలు చేసినట్లుగానే ఉంటుంది కానీ కిట్లు మాయమైపోతున్నాయి. -
ఇమ్యూనిటీ బూస్టర్: వాస్తవమెంత?
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బతో అన్ని దేశాలు అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను నియంత్రించేందుకు రోగనిరోధక శక్తి(ఇమ్యూనిటీ)పెంచుకోవడమే ఏకైక మార్గమని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇమ్యునాలజీ నిపుణులు రోగనిరోధక శక్తిపై ప్రజలకు అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. ప్రజలు రోగనిరోధకశక్తిను పెంచుకునేందుకు మార్కెట్లలో రకరకాల పండ్ల జ్యూస్‌లు, విటమిన్ ట్యాబ్లెట్లు వాడుతున్నారు. నిజంగా ఆహారపు అలవాట్లు, విటమిన్ ట్యాబ్లెట్లతో కరోనాను నివారించవచ్చా తెలుసుకుందాం. రోగనిరోధక శక్తి అనేది సంక్లిష్టమైన అంశమని, ప్రజలకు ఇంకా పూర్తిగా ఈ అంశంపై అవగాహన రాలేదని సీఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) మాజీ డైరెక్టర్, ఇమ్యునాలజీ నిపుణులు రామ్ విశ్వకర్మ తెలిపారు. ఆయన స్పందిస్తు.. ముఖ్యంగా మనిషి తీవ్రంగా రోగగ్రస్తులను చేసే యాంటిజన్స్(వ్యాధి కారకం)ను ఎదుర్కొనేందుకు సహజసిద్దంగా శరీరంలో యాంటిబాడీస్(యాంటీజన్స్‌ను ఎదుర్కొనేవి) ఉంటాయి. మరోవైపు సహజ రోగనిరోధక శక్తి (ఇన్నేట్ ఇమ్యున్ రెస్పాన్స్) మానవుని నిరంతరం కాపాడుతూ ఉంటుంది. సహజ రోగనిరోధక శక్తిలో తెల్లరక్తకణాల, న్యూట్రోఫిల్స్, టీసెల్స్(కణాలు), బీసెల్స్(కణాలు), యాంటిబాడీస్‌లతో కూడిన రక్షణాత్మక వ్యవస్థ కాపాడుతూ ఉంటుంది. కాగా ఈ కణాలను సైటోకైన్స్ ఉత్పత్తి చేస్తాయి. సైటోకైన్స్ అనేది ప్రొటీన్ ఇమ్యూన్ కణాలకు సిగ్నలింగ్ వ్యవస్థ లాంటిది. ఆహారపు అలవాట్ల ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోలేమని అన్నారు. సాధారణంగా కొందరు తమకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని చెబుతుంటారు. వారికి ఎక్కువగా వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. విటమిన్ సీ, జింక్ ట్యాబ్లెట్లతో రోగనిరోధకశక్తి పెంచుకోవచ్చనే అపోహలు ఉన్నాయి. మరోవైపు ఈ ట్యాబ్లెట్ల ద్వారా కిడ్నీ, లివర్ తదితర వ్యాధులతో చాలా మంది సతమతమవుతున్నారని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే మేలైన మార్గమని రామ్ విశ్వకర్మ పేర్కొన్నారు. 1962లో నోబెల్ బహుమతి పొందిన పాలింగ్ కూడా విటమిన్ సీ, జింక్ ట్యాబ్లెట్లు ఏ మాత్రం ప్రభావం చూపవని తెలిపారు. కానీ ఆహారం ద్వారానే రోగనిరోధక శక్తి లభిస్తుందని ప్రకృతి, ఆయుర్వేద నిపుణులు గట్టిగా చెబుతున్నారు. కానీ అందరు ఏకీభవించేది మాత్రం వ్యాయామం. జీవనశైలి మార్పులతో ఇమ్యూనిటీ పెంచుకోవచ్చని అందరు ఏకీభవీస్తున్నారు. మానవ శరీరంలో రక్షణాత్మక వ్యవస్థను బలంగా ఉంచే సైటోకైన్స్, న్యూట్రోఫిల్స్, టీకణాలు, బీకణాలు వ్యాయామంతో బలోపేతమవుతాయని అల్లోపతి, ఆయుర్వేద, అన్ని రంగాల నిపుణులు ఏకీభవిస్తున్నారు. రోజుకు ఒక గంట వ్యాయామంతో రక్షణాత్మక వ్యవస్థను బలోపేతం చేసే అన్ని కణాలు ఉత్తేజితమవుతాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. -
ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించుకోవాలి
-
అనుమానితుల కోసం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు..
సాక్షి, అమరావతి: ఆస్పత్రుల్లో అడ్మిషన్ల సమయంలో కరోనా అనుమానితుల పరీక్షల కోసం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాకు 20 వేల చొప్పున ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు కిట్లు ప్రభుత్వం పంపించిందని, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో పాజిటివ్ తేలితే తక్షణం చికిత్స ప్రారంభించి కరోనా రోగిని ఐసోలేట్ చేయాలని జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్ఓలకు వైద్యారోగ్యశాఖ సూచించింది.(ఏపీలో మరో 1919 కరోనా కేసులు) కరోనా లక్షణాలు కలిగి యాంటీజెన్ టెస్టులో నెగిటివ్ వస్తే..అలాంటి వారికి మరోసారి రియల్ టైమ్‌లో ఆర్టీపీసీఆర్ చేయాలని, హైరిస్క్ కేసులున్న ప్రాంతాలు, కంటైన్మెంట్ జోన్లలో వ్యాధి లక్షణాలు కలిగి కరోనా నెగిటివ్ ఫలితాలు వచ్చిన వారిని కూడా పరీక్షించాల్సిందిగా ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ఆస్పత్రుల్లో గర్భిణులు, శస్త్ర చికిత్స చేయాల్సిన రోగులను పరీక్షించేందుకు కూడా ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించాలని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. క్వారంటైన్ కేంద్రాల్లో 10 రోజుల అనంతరం డిశ్చార్జి అవుతున్నవారిని పరీక్షించవచ్చని, కరోనా లక్షణాలు కలిగి ఉన్న రోగులందరికీ డిశ్చార్జి చేసేందుకు ట్రూనాట్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. -
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
-
ర్యాపిడ్ టెస్టులకు ఓకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో టెస్టులను కూడా అంతే వేగంగా నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులకు కేవలం 15 నిమిషాల్లోనే వైరస్ ఉందో లేదో నిర్ధారించే యాంటీజెన్ పరీక్షను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ర్యాపిడ్ యాంటీజెన్ డిటెక్షన్ టెస్ట్ ద్వారా గరిష్టంగా అర గంటలో ఫలితం తెలుస్తుంది. ఈ మేరకు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అనుమతి లభించింది. ఇందుకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ నుంచి కిట్లు రాష్ట్రానికి రానున్నాయి. అనంతరం వాటిని ఉపయోగించి వైద్య సిబ్బంది విరివిగా పరీక్షలు చేయనున్నారు. వైరస్ తీవ్రత ఉన్న ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటిని నిర్వహిస్తారు. అప్పటికప్పుడే ఫలితం ప్రకటిస్తారు. పాజిటివ్ వచ్చిన వారిని తక్షణమే హోం ఐసోలేషన్ లేదా అవసరాన్ని బట్టి ఆసుపత్రికి తరలిస్తారు. ముందుగా 50 వేల కిట్లు తెప్పించి పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రైవేటు లేబొరేటరీలకు కూడా యాంటీజెన్ టెస్టులకు అనుమతి ఇస్తారు. తద్వారా ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఆర్టీ–పీసీఆర్ పరీక్షకు ప్రైవేటు లేబొరేటరీల్లో రూ. 2,200 వరకు ఖర్చవుతుంది. ప్రభుత్వ పరిధిలోనూ అదే స్థాయిలో ఖర్చు అవుతుంది. కానీ యాంటీజెన్ పరీక్షకు మాత్రం రూ. 500 మాత్రమే ఖర్చు కానుంది. ముందుగా జీహెచ్ఎంసీ సహా వివిధ జిల్లాల్లోని ప్రభావిత ప్రాంతాల్లో యాంటీజెన్ పరీక్షలు చేస్తారు. నమూనాలు సేకరించిన గంటలో పరీక్ష చేయాల్సిందే...రాష్ట్రంలో కరోనా వైరస్ నమూనాలు సామర్థ్యానికి మించి వస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు లేబొరేటరీలపై తీవ్ర భారం పడుతోంది. దీంతో శాంపిళ్లు ఇచ్చిన తర్వాత ఒక్కోసారి 4–5 రోజుల వరకు కూడా ఫలితం రావడంలేదు. దీంతో తీవ్రమైన లక్షణాలున్న వారు మరింత అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయడానికి ఎక్కువ సమయం పడుతోంది. ఎక్కువ శాంపిళ్లు పేరుకుపోవడం, శాంపిళ్ల సేకరణ అనంతరం వాటిని లేబొరేటరీకి తరలించడం వల్ల సమయం వృథా అవుతోంది. దీంతో పరీక్షల నిర్వహణపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యాంటీజెన్ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో కరోనా నిర్ధారణ కోసం ఆర్టీ–పీసీఆర్, ట్రూనాట్, సీబీనాట్‌లను ఉపయోగిస్తున్నారు. వీటన్నింటికీ పరికరాలు, జీవ భద్రత, బయో సెక్యూరిటీపరంగా ప్రత్యేకమైన లేబొరేటరీల్లో సౌకర్యాలు అవసరం. నమూనాల సేకరణ, తదనంతరం వాటి రవాణాకు ఆయా ప్రాంతాలను బట్టి కనీసం రెండు నుంచి ఐదు గంటల వరకు పడుతుంది. దీంతో ఎక్కువ పరీక్షలు చేయడానికి ఇవి ఆటంకంగా మారుతున్నాయి. అందుకే యాంటీజెన్ పరీక్షలపై సర్కారు దృష్టి సారించింది. పైగా యాంటీజెన్ పరీక్షకు నమూనా సేకరించిన తర్వాత తప్పనిసరిగా గంటలోనే పరీక్ష చేయాలి. లేకుంటే నమూనా వృథా అయిపోతుంది. లేబొరేటరీలకు నమూనాలను రవాణా చేసే పరిస్థితి ఉండదు. అందువల్ల శాంపిళ్లు సేకరించిన ఆరోగ్య కేంద్రంలోనే అప్పటికప్పడు పరీక్షలు నిర్వహించాలి. దీనికోసం ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. సాధారణ లేబొరేటరీ సౌకర్యం ఉంటే చాలు. నెగెటివ్ వస్తే ఆర్టీ–పీసీఆర్ పరీక్ష తప్పనిసరి... కరోనా వైరస్‌ను వేగంగా గుర్తించడానికి ర్యాపిడ్ యాంటీజెన్ డిటెక్షన్ పరీక్ష కీలకమైంది. కరోనా పాజిటివ్ రోగులను వేగంగా గుర్తించడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. వేగంగా పరీక్షించడానికి, ట్రాక్ చేయడానికి, చికిత్స చేయడానికి దీనివల్ల వీలు కలుగుతుంది. ఈ పరీక్ష కచ్చితత్వం 99.3 నుంచి 100 శాతం ఉంటుందని ఐసీఎంఆర్ తెలిపింది. అయితే ఈ పరీక్షకు ఉన్న ప్రధాన లోపం ఏమిటంటే అనుమానిత వ్యక్తి నమూనాలను పరీక్షించాక ఫలితం పాజిటివ్ వస్తే పాజిటివ్‌గానే పరిగణిస్తారు. కానీ ఒకవేళ నెగెటివ్ వస్తే మాత్రం ఆర్టీ–పీసీఆర్ పద్ధతిలో మరోసారి పరీక్ష చేసి సరిచూసుకోవాల్సి ఉంటుందని ఐసీఎంఆర్ తెలిపింది. అయితే తీవ్ర లక్షణాలున్న వారికి, కేసులు అధికంగా నమోదవుతున్న చోట యాంటీజెన్ టెస్టులు మరింత ఉపయోగపడతాయని ఐసీఎంఆర్ తెలిపింది. కంటైన్మెంట్ జోన్లు, తీవ్ర వైరస్ లక్షణాలున్న వారు, ఊపిరితిత్తుల వ్యాధి, గుండె జబ్బులు, కాలేయ వ్యాధి, మూత్రపిండాల వ్యాధి, మధుమేహం, నాడీ సంబంధిత రుగ్మతలు తదితర అనారోగ్య లక్షణాలున్న వారికి ఈ యాంటీజెన్ పరీక్షల వల్ల వేగంగా కరోనా వైరస్ నిర్ధారణ చేయడానికి వీలు కలుగుతుంది. 65 ఏళ్లు పైబడినవారు, తీవ్ర శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్న వారు, 100.4 డిగ్రీలకు పైబడి జ్వరం, దగ్గుతో తీవ్ర శ్వాసకోశ సంక్రమణ వ్యాధులు ఉన్నవారికి దీనిద్వారా పరీక్షించాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
హెల్త్ క్విజ్
1. జలుబులో ఎన్ని రకాలు ఉంటాయి? 2. సమలక్షణాలను గుర్తించి వర్గీకరిస్తే వాటిని స్థూలంగా ఎన్ని గ్రూపులు చేయవచ్చు? అవి ఏవి? 3. జలుబు వైరస్‌ను ఎందుకు నిర్దిష్టంగా గుర్తుపట్టలేం? 4. జలుబు సమయంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి? జవాబులు: 1. దాదాపు 200 రకాలు. 2. ఆరు అవి... ఇన్ఫ్లుయెంజా, పారాఇన్‌ఫ్లుయెంజా, రైనోవైరస్, కరోనా వైరస్, ఎడినో వైరస్, హ్యూమన్ రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్. 3. కొన్నేళ్లకోమారు తన జన్యు (యాంటీజెన్) స్వరూపాన్ని మార్చుకుంటుంది కాబట్టి 4. విచక్షణరహితంగా యాంటీబయాటిక్స్ వాడకూడదని.