‘ల్యాండ్ పూలింగ్’కు చిక్కులు!
దండుమల్కాపురంలో లేఅవుట్ ఏర్పాటుకు హెచ్‌ఎండీఏ కసరత్తు
ఫ 355 ఎకరాల భూ సేకరణకు
ఏడాది క్రితమే నోటిషికేషన్
ఫ భూములిచ్చేందుకు అంగీకరించిన రైతులు
ఫ కబ్జా, పట్టా సమస్యలతో అడ్డంకులు
ఫ చిక్కులు వీడితోనే ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ముందుకు
ఈ భూములనే తీసుకుంటారు
● ల్యాండ్‌పూలింగ్ కోసం రైతులిచ్చే
భూములపై యాజమాన్య హక్కులు
కలిగి ఉండాలి.
● పట్టా కలిగిఉన్న రైతులు తప్పనిసరిగా
కబ్జాలో ఉండాలి.
● భూములకు సంబంధించి ఎలాంటి
వివాదాలు, కోర్టు కేసులు ఉండకూడదు.
● బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న
భూములకు అనుమతించరు.
● 111జీఓ పరిధిలోని భూములను కూడా
అనుమతించరు.
చౌటుప్పల్ రూరల్: ఆదాయ వనరులు సమకూర్చుకోవడంపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం.. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా హెచ్‌ఎండీఏ(హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ) పరిధిలోని భూములను సేకరించి వాటిని అభివృద్ధి చేసి వెంచర్లుగా మార్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూర్, ఇమ్యూనల్‌నార్వె, ఘట్‌కేసర్ మండలం బోగారం, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం రెవెన్యూ పరిధిలో ల్యాండ్ పూలింగ్ చేయడానికి ఏడాది క్రితమే నోటిఫికేషన్ విడుదల చేసినా ముందుకు సాగడం లేదు.
అడ్డంకులు ఇవీ..
చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 618 నుంచి 639 వరకు సూమారు 355 ఎకరాల భూమి రైతులనుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించడానికి గత ఏడాది హెచ్‌ఎండీఏ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. భూములు ఇచ్చేందుకు రైతులు కూడా అంగీకరించారు. కానీ, ఆయా సర్వే నంబర్లలో పట్టాలు ఉన్న రైతులు కబ్జాలో లేకపోవడం, కబ్జాలో ఉన్న రైతులకు పట్టా లేకపోవడం, వైవాట్ కబ్జాలు ఉండడంతో హెచ్‌ఎండీఏ ప్లాన్‌కు ఆదిలోనే ఆటకం కలిగింది. వీటికి పరిష్కారం లభిస్తే తప్ప.. దండుమల్కాపురం గ్రామ పరిధిలో ల్యాండ్ పూలింగ్ ముందుకు సాగే పరిస్థితులు కనిపించడం లేదు.
పట్టా మార్పిడి ఖర్చుపై సందిగ్ధం
దండుమల్కాపురంలో రైతుల సమ్మతి మేరకే ల్యాండ్ పూలింగ్‌కు హెచ్‌ఎండీఏ ముందుకు వచ్చింది. కానీ, రైతుల పట్టా, కబ్జా సమస్యలతో కాలయాపన జరుగుతోంది. ఒకవేళ పట్టా మార్పిడి జరిగితే అదుకు అయ్యే ఖర్చు ఎవరు భరించాలనేది సందిగ్ధత ఏర్పడింది. హెచ్‌ఎండీఏ భరించడానికి అభివృద్ధి చేసిన టౌన్‌షిప్‌లో 60 శాతం ప్లాటు రైతులకు ఇచ్చి, 40శాతం ప్లాట్లను హెచ్‌ఎండీఎ తీసుకుని విక్రయించనుంది. కాబట్టి, ఖర్చును హెచ్‌ఎండీఏ భరించే పరిస్థితి ఉండదని ల్యాండ్‌పూలింగ్ అధికారి చెబుతున్నారు. ఇక రైతులు తామెందుకు ఖర్చు భరిస్తాం, భూములు మావే కదా అంటున్నట్లు సమాచారం. ఈ చిక్కుముడి తొలిగితేనే హెచ్‌ఎండీఎ భారీ టౌన్‌షిప్ అభివృద్ధి చేయడానికి మార్గం సుగం అవుతుంది.
మౌలిక వసతుల ఖర్చు హెచ్‌ఎండీఏదే..
లేఅవుట్‌లలో రైతులకు 60 శాతం, హెచ్‌ఎండీఏ వాటా 40శాతం ఉంటుంది. మౌలిక సదుపాయాలకు అయ్యే ఖర్చంతా హెచ్‌ఎండీఎ భరిస్తుంది. మూడేళ్లలో లేఅవుట్‌ను అభివృద్ధి చేయాలనే నిబంధన ఉంది. గడువులోపు మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ఆ పై ప్రతి నెలా భూమి విలువపై 0.5 శాతం పరిహారం రైతులకు హెచ్‌ఎండీఏ చెల్లించాల్సి ఉంటుంది.
ల్యాండ్ పూలింగ్‌తో ప్రయోజనాలు
రైతులనుంచి హెచ్‌ండీఏ సేకరించిన భూములను అభివృద్ధి చేసి లేఅవుట్ చేస్తారు. అనంతరం భారీ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేస్తారు.
విశాలమైన రోడ్లు, నీటి సరాఫరా, విద్యుత్, డ్రెయినేజీ, పార్కులు, సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు తదితర అత్యున్నత ప్రమాణాలతో కూడిన మౌలిక సౌకర్యాలు కల్పిస్తారు.
లేఅవుట్‌లో వ్యాపార, వాణిజ్య సంస్థలు నెలకొల్పుతారు.
భవనాల నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. సులువుగా అనుమతులు వస్తాయి.
తక్కువ సమయంలో భూముల విలువ పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment