ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్ తనిఖీ
భూదాన్‌పోచంపల్లి : పట్టణంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను బుధవారం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శిల్పిని తనిఖీ చేశారు. మందుల స్టాక్, రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం భూదాన్‌పోచంపల్లి, సంస్థాన్‌నారాయణపురం, తంగడపల్లి, మునిపంపుల, వర్కట్‌పల్లి పల్లెదవాఖాన, ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్ డాక్టర్లు, వైద్యసిబ్బందితో సమావేశమై వైద్యసేవలపై సమీక్షించారు. రోగులకు అందజేస్తున్న 12 రకాల వైద్యసేవల గ్రేడింగ్ గురించి తెలుసుకున్నారు. ఓపీ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్యాధికారి శ్రీవాణి, సీహెచ్‌ఓ జ్ఞానేశ్వర్, డాక్టర్లు పాల్గొన్నారు.
ఆపరేషన్లు లేకుండా కాన్పులు చేయాలి
నాగార్జునసాగర్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆపరేషన్లు లేకుండా సహజ కాన్పులు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ అతిథి గృహంలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట డీసీహెచ్‌ఎస్‌లు, ఏరియా ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో సమీక్ష నిర్వహించారు. సిజేరియన్లు తగ్గేలా చూడాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెంచాలని, ఏరియా ఆస్పత్రుల్లో సదుపాయాల కొరత ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.అంతకు ముందే నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రిని సందర్శించి వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ సమావేశంలో డీసీహెచ్‌ఎస్‌లు మాతృనాయక్, చిన్నానాయక్, వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్లు డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ భానుప్రసాద్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఏఈఓ ప్రమోషన్ రద్దు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఏఈఓ హరికిషన్ పదోన్నతిని రద్దు చేసినట్లు దేవస్థానం డీఈఓ దోర్భల భాస్కర్‌శర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపా రు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో గత ఏడాది జరిగిన బదిలీల్లో భాగంగా హరికిషన్ వేములవాడ రాజన్న ఆలయం నుంచి యాదగిరిగుట్టకు ఏఈఓగా పదోన్నతిపై వచ్చారు. నకిలీ డిగ్రీ పత్రాలు సృష్టించి ఏఈఓగా పదోన్నతి పొందారని అధికారుల విచారణలో తేలింది. దీంతో హరికిషన్ ప్రమోషన్‌ను రద్దు చేయాలని వేములవాడ రాజన్న ఆలయ ఈఓ వినోద్‌రెడ్డి కోరారు. ఈ మేరకు హరికిషన్ పదోన్నతిని రద్దు చేస్తూ గుట్ట ఆలయ ఈఓ భాస్కర్ నిర్ణయం తీసుకున్నారని డీఈఓ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment