అవగాహనతో కుష్టు వ్యాధి నివారణ
భువనగిరి : అవగాహన పెంచుకోవడం ద్వారా కుష్టు వ్యాధిని కొంతవరకు నివారించవచ్చని లెప్రసీ ప్రోగ్రాం జిల్లా అఽధికారి సాయి శోభ పేర్కొన్నారు. జాతీయ కుష్టువ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం భువనగిరిలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యాఽధి లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. ప్రారంభంలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందన్నారు. కుష్టు నిర్మూలన దినోత్సవాన్ని పుర్కరించుకుని 21 పీహెచ్‌సీలు, 99 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వైద్యసిబ్బందితో ప్రతిజ్ఞ చేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రవికుమార్, డాక్టర్ నిరోశ, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్లు రవీందర్‌రెడ్డి, రాములు, మాధవి, బస్వరాజు తదితరులు పాల్గొన్నారు.
ఫ లెప్రసీ ప్రోగ్రాం జిల్లా అధికారి సాయిశోభ
Comments
Please login to add a commentAdd a comment