ముగ్గురు మున్సిపల్ కమిషనర్లు బదిలీ
భువనగిరి: జిల్లాలో ముగ్గురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర పురపాలకశాఖ నుంచి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. బదిలీ అయినవారిలో భువనగిరి, భూదాన్‌పోచంపల్లి, ఆలేరు మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు.
భువనగిరి కమిషనర్‌గా రామలింగం
భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డిని జీహెచ్‌ఎంసీకి అటాచ్ చేశారు. ఆయన స్థానంలో బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ రామలింగం బదిలీపై రానున్నారు. నూతన కమిషనర్ విధుల్లో చేరేవరకు మున్సిపల్ డీఈ కొండల్‌రావుకు ఇంచార్జిగా వ్యవహరించనున్నారు.
పోచంపల్లికి అంజన్‌రెడ్డి
భూదాన్‌పోచంపల్లి : నూతన కమిషనర్‌గా అంజన్‌రెడ్డి నియమి తులయ్యారు. ఇక్కడ పనిచేసిన వెంకటేశ్వరనాయక్ మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా దుండిగల్‌కు బదిలీ అయ్యారు.అంజన్‌రెడ్డి గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు
ఆలేరుకు శ్రీనివాస్..
ఆలేరు : మున్సిపల్ కమిషనర్ లక్ష్మి స్థానంలో కొత్తగా బి.శ్రీనివాస్ నియమితులయ్యారు. నూతన కమిషనర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
జూడో పోటీల్లో
జాతీయ స్థాయికి ఎంపిక
ఆత్మకూరు(ఎం) : కరీంనగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోలీసు క్రీడోత్సవాల్లో జిల్లా పోలీసులు సత్తాచాటారు. జూడో విభాగంలో ఇబ్రహీంపట్నం మూడవ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్‌పేటకు చెందిన కమ్మంపాటి మహేందర్‌గౌడ్, అన్నెపర్తి 12వ బెటాలియన్‌లో పనిచేస్తున్న వలిగొండ మండలం దుప్పెల్లికి చెందిన తండ ప్రసాద్ గోల్డ్‌మెడల్స్ సాధించారు. యూసుఫ్‌గూడలోని ఒకటో బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న వలిగొండ మండలం వేములకొండకు చెందిన పి.సాయికిరణ్ బంగారు పతకం సాధించి జాతీయస్థాయికి ఎంపికయ్యారు. అదే విధంగా ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో ఖైరతాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్‌పేటకు చెందిన బొంగు రాజశేఖర్ రజత పతకం కై వసం చేసుకున్నారు. పతకాలు సాధించిన పోలీసులను కోచ్‌లు అన్నెపు వెంకట్, కమ్మంపాటి సోమరాజు, జిల్లా జూడో కార్యదర్శి పి.బాలరాజు అభినందించారు.
నీరా పరిశ్రమ ఏర్పాటు చేయాలి
మోత్కూరు : రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో కల్లు నీరా పరిశ్రమ ఏర్పాటు చేయాలని గీత పనివారల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బొలగాని సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోత్కూరులో గురువారం గీత పనివారల సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశం చాపల అంజయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ లక్షలాది మంది గీత కార్మికులు సంవత్సరాలుగా గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. కల్లు, నీరా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం అనేక సందర్భాల్లో ప్రకటించినా కార్యరూపం దాల్చలేదన్నారు. భువనగిరి మండలం నందనంలో ఏర్పాటు చేసిన నీరా పరిశ్రమ అర్ధాంతరంగా ఆగిపోయిందని, వెంటనే పునరుద్ధరించాలని కోరారు, గీత పరిశ్రమకు బొమ్మగాని ధర్మభిక్షం పేరు పెట్టాలని, గీత వృత్తిని ఆధునీకరించాలని, కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్లు కేటాయించాలని, గీత కార్మికులకు ఇచ్చే వృత్తి పింఛన్ పెంచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పబ్బు యాదయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు గాదెగాని మాణిక్యం, జిల్లా కౌన్సిల్ సభ్యులు పులిపలుపుల మల్లేషం, అన్నెపు వెంకట్, బత్తిని శ్రీను, ఎడ్ల నరేష్, పల్స వెంకటయ్య, బీసు సత్తయ్య, అంబాల మారయ్య, గడ్డం సోమన్న, సైదులు, మల్లేషం, వెంకటేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment