
29 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు
ఫ హాజరుకానున్న
12,558 మంది విద్యార్థులు
ఫ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ప్రశాంత వాతావరణంలో
పరీక్షలు రాయాలి
ఇంటర్ పరీక్షలు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో రాయాలి. పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలి. పరీక్షల సమయంలో జీరాక్స్ సెంటర్లు మూసివేయబడుతాయి. పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తాం.
– రమణి, డీఐఈఓ
భువనగిరి: ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 22వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. జనరల్ పరీక్షలు మాత్రం 20వ తేదీన ముగియనున్నాయి. పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 29 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పరీక్షలకు మొత్తం 12,558 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రథమ సంవత్సరంలో జనరల్ 4,636 మంది విద్యార్థులు ఉండగా ఒకేషనల్ విద్యార్థులు 1,372 మంది ఉన్నారు. ద్వితీయ సంవత్సరంలో జనరల్ 4,873 మంది ఉండగా ఒకేషనల్ 1,477 మంది విద్యార్థులు ఉన్నారు.
నిఘా నీడలో పరీక్షలు
అన్ని కేంద్రాలను సీసీ కెమెరాలు పరిధిలోకి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు ఆధ్వర్యంలో ప్రతి కేంద్రంలో 5 సీసీ కెమెరాల చొప్పున బిగించారు. నేరుగా ఇంటర్ బోర్డుకు అనుసంధానం చేసిన సీసీ కెమెరాల ద్వారా పరీక్షల నిర్వహణ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. వీటితో పాటు ఈ సారి హాల్‌టికెట్‌పై పరీక్ష కేంద్రం సులువుగా తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. ఎలాంటి సమస్యలు, సందేహాలు వచ్చినా వాటిని తెలియజేసేందుకు హాల్ టికెట్ పైనే టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా ముద్రించారు. అదేవిధంగా ప్రశ్నపత్రం పై యూనిక్ సీరియల్ పేపర్ ఎవరిదో తేలికగా గుర్తించనున్నారు. పరీక్షలు రాసేటప్పుడు ఒత్తిడికి గురైతే 14416 నంబర్‌కు ఫోన్ చేసి టీ మానస్‌ను సహాయం తీసుకునే అవకాశం కల్పించారు.
కేంద్రాల్లో వసతుల కల్పన
పరీక్షల నిర్వహణ కోసం 29 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 29 మంది డిపార్లమెంటల్ ఆఫీసర్లను నియమించారు. వీరితో పాటు ముగ్గురు సభ్యులతో కూడిన ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు డీఈసీ సభ్యులను నియమించారు. జిల్లా కన్వీనర్‌గా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి ఉండనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షణ అమల్లో ఉండనుంది. ఎండలను దృష్టిలో పెట్టుకుని పరీక్ష కేంద్రంలో వైద్య సిబ్బందితో పాటు నీటి వసతి, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు.
ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
భువనగిరి: ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. పరీక్షల నేపథ్యంలో మంగళవారం సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్సు సమయానుకూలంగా వచ్చే విధంగా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో వైద్య సిబ్బందితో పాటు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 29 కేంద్రాలు ఏర్పాటు చేయగా 12,558 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఐఈఓ రమణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment