
రైలు కింద పడి ఆత్మహత్య
నల్లగొండ, తిప్పర్తి: ఆర్థిక ఇబ్బందులో మనస్థాపానికి గురైన వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తిప్పర్తి మండలం రాయినిగూడెం సమీ పంలో సోమవారం రాత్రి జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కనగల్ మండలం చిన్నమాదారం గ్రామానికి చెందిన వట్టికోట ఎల్లేష్(37) నల్ల గొండ పట్టణంలోని ఓ రెస్టారెంట్‌లో సప్లయర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య శ్రీలత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఎల్లేష్ మనస్థాపానికి గురై సోమవారం రాత్రి తిప్పర్తి మండలం రాయినిగూడెం గ్రామ సమీపంలో రైలు పట్టాలపై సికింద్రాబాద్ వైపు వెళ్తున్న వందేభారత్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం నల్లగొండ రైల్వే స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.
కుటుంబ సమస్యలతో
బంగారం వ్యాపారి..
నకిరేకల్: కుటుంబ సమస్యలతో బంగారం వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నకిరేకల్ పట్టణంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణానికి చెందిన షేక్ అబ్బాస్ తన కూమారుడు శంషుద్దీన్(39)తో కలిసి స్థానిక మసీదు సమీపంలో బంగారం దుకాణం నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి షాపు మూసివేసి ఇంటికి వెళ్లారు. ఇంట్లో కుటుంబ సమస్యలతో శంషుద్దీన్ గొడవపడి తిరిగి షాపు వద్దకు వచ్చాడు. రాత్రి 12.30 గంటల సమయంలో శంషుద్దీన్ షాపులో బంగారం పాలిష్ చేసే లిక్విడ్ తాగాడు. కూమారుడు ఇంటికి రాలేదని తండ్రి అబ్బాస్ షాపు వద్దకు వచ్చి చూసేసరికి శంషుద్దీన్ అపస్మాకర స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే అతడిని నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. మంగళవారం మృతుడి తండ్రి అబ్బాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లచ్చిరెడ్డి తెలిపారు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
మునుగోడు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మునుగోడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు మండలం ఊకొండి గ్రామానికి చెందిన బోయపల్లి రామచంద్రం(58) సోమవారం సాయంత్రం స్వగ్రామం నుంచి బైక్‌పై మునుగోడుకు వచ్చి తిరిగి వెళ్తుండగా మార్గమధ్యలో మునుగోడు మండల కేంద్రం శివారులోని మంగళ్లదొడ్లగూడెం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతడిని 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రైలు కింద పడి ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment