
సీపీఎస్ విధానం రద్దుకు కృషిచేస్తా
సూర్యాపేట: ఉపాధ్యాయ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సీపీఎస్ రద్దు చేసేందుకు కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట మండలం పిల్లలమర్రి శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేశారని, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు, పీఆర్సీ అమలుచేసే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని కృషిచేస్తానన్నారు. ఈ ఎండాకాలం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. తన గెలుపు కోసం కృషిచేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. పీఆర్‌టీయూ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కృషిచేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తంగేళ్ల జితేందర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తీగల నరేష్, మాజీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొలికొండ కోటయ్య, పప్పుల వీరబాబు, రాష్ట్ర నాయకులు కందుకూరి శివశంకర్, గుగులోతు తావూరియా, కట్కూరు మధుసూదన్ రెడ్డి, గోదాసు దయాకర్, మేకల రాజశేఖర్, అల్లాడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పింగిలి శ్రీపాల్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment