
పోచంపల్లిని సందర్శించిన ఛత్తీస్‌గఢ్ విద్యార్థులు
భూదాన్‌పోచంపల్లి: ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో గల అమిటీ యూనివర్సిటీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు అభ్యసిస్తున్న 15మంది విద్యార్థులు మంగళవారం భూదాన్‌పోచంపల్లిని సందర్శించారు. మాస్టర్ వీవర్ అంకం మురళి, కళాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్‌ను సందర్శించి అక్కడ దారం నుంచి వస్త్రం తయారయ్యే ప్రక్రియలన్నింటినీ ప్రత్యక్షంగా పరిశీలించారు. నూలు ఎక్కడ నుంచి దిగుమతి చేసుకుంటారని, ఏ రకమైన రంగులు, రసాయనాలను వినియోగిస్తారని, టై అండ్ డై విధానం, సాంప్రదాయ డిజైన్లు, మగ్గాలపై నేస్తున్న ఇక్కత్ వస్త్రాలు, మార్కెటింగ్, చేనేత కళాకారులకు లభిస్తున్న ఉపాధి తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. కళాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్‌లో కోకూన్ నుంచి దారం తీసే విధానం, ట్విస్టింగ్ యూనిట్, మగ్గాలను పరిశీలించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ దీక్షిక మాట్లాడుతూ.. తమ యూనివర్సిటీలోని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు సిలబస్‌లో పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల ప్రాముఖ్యత గురించి ఉందని పేర్కొన్నారు. అందులో భాగంగానే ప్రాక్టికల్ ఎక్స్‌ప్లోరల్ విజిట్‌లో భాగంగా ఇక్కడికి వచ్చామని తెలిపారు. ఇక్కడ సంప్రదాయ వస్త్రాలు, ఇక్కత్ డిజైన్లు చూసి విద్యార్థులంతా మురిసిపోయారని అన్నారు. పోచంపల్లి పర్యటనతో మంచి ప్రాక్టికల్ అనుభవం లభించిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. వీరి వెంట గైడ్ పాంటా, రచ్చ సురేశ్ తదితరులు ఉన్నారు.

పోచంపల్లిని సందర్శించిన ఛత్తీస్‌గఢ్ విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment