భక్తులకు సౌకర్యాలు కల్పించాలి
సిద్దవటం: మహా శివరాత్రి ఉత్సవాల్లో శ్రీ నిత్యపూజ స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కడప ఆర్డీఓ జాన్‌ఇర్విన్ పేర్కొన్నారు.సిద్దవటం మండలం వంతాటిపల్లె గ్రామ సమీంలో వెలసిన నిత్యపూజ స్వామి మహాశివరాత్రి ఉత్సవాలపై శనివారం పంచలింగాల వద్ద అధికారులతో ఆర్డీఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచలింగాల వద్ద, కాలినడక మార్గంలో, ఆలయం వద్ద మొత్తం మూడు వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని వైద్యసిబ్బందికి సూచించారు. శానిటేషన్‌పై దృష్టి పెట్టాలన్నారు. విద్యుత్ సమస్య లేకుండా చూడాలని, పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలు నలిపేలా చూడాలని తెలిపారు. భక్తులకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని దేవదాయశాఖ అధికారులకు సూచించామన్నారు. 108, 104 వాహనాలను పంచలింగాల వద్ద అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఒంటిమిట్ట సీఐ బాబు మాట్లాడుతూ 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు.పంచలింగాల వద్ద, ఆలయం ఆవరణలో రెండు వైర్‌లెస్ సెట్లను అమరుస్తామని చెప్పారు. కార్యక్రమంలో దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున, ఆర్డీ ఏఓ శంకర్‌రావు, రేంజర్ కళావతి, వీఆర్‌వో ప్రభాకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సంధ్య, సర్పంచ్ ప్రతినిధి లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్
Comments
Please login to add a commentAdd a comment