●ప్రశాంతంగా గ్రూప్– 2 మెయిన్స్ పరీక్షలు
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో జరిగిన గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–2 ఉద్యోగాల నియామకం కోసం ఆదివారం ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించిన మెయిన్స్ పరీక్షకు సంబంధించి.. జిల్లాలోని 13 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 5,825 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా ఉదయం సెషన్‌లో 5,111 మంది అభ్యర్థులతో హాజరు 87.74 శాతంగా, మధ్యాహ్నం సెషన్‌లో 5,825 మందికి గాను 5,096 మంది పరీక్షకు హాజరై అభ్యర్థుల హాజరు 87.48 శాతంగా నమోదైందన్నారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు పోలీసు అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు పర్యవేక్షించాయన్నారు.
●ప్రశాంతంగా గ్రూప్– 2 మెయిన్స్ పరీక్షలు
●ప్రశాంతంగా గ్రూప్– 2 మెయిన్స్ పరీక్షలు
●ప్రశాంతంగా గ్రూప్– 2 మెయిన్స్ పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment