అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
బద్వేలు అర్బన్: వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, ఎల్లవేళలా అండగా ఉంటామని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నాయకులకు, కార్యకర్తలకు భరోసా కల్పించారు. ఇటీవల ఓ భూ వివాదం కేసులో అక్రమంగా అరెస్టయి బెయిల్‌పై విడుదలైన మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామిని పరామర్శించారు.
అలాగే పట్టణంలోని 27వ వార్డు కౌన్సిలర్ రమాదేవి మామ, వైఎస్సార్‌సీపీ వార్డు ఇన్‌చార్జి శీలి చెన్నయ్యకు జీవనాధారంగా ఉన్న బంకును కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మున్సిపల్ అధికారులు తొలగించిన నేపథ్యంలో ఆదివారం వారిని కూడా ఎమ్మెల్యే డాక్టర్ సుధతో కలిసి ఎంపీ పరామర్శించి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేవలం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులకు పాల్పడటం, అక్రమ కేసులు బనాయించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. అధికారం ఎప్పటికీ ఒకరికే పరిమితం కాదని, అధికారులు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని చట్టబద్ధంగా వ్యవహరించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులపై అధికార పార్టీ నాయకులు చేస్తున్న కక్ష సాధింపు చర్యలను కలిసికట్టుగా సమర్థవంతంగా ఎదుర్కొందామని ఆయన నాయకులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు దేవసాని ఆదిత్యరెడ్డి, నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కె.రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్‌రెడ్డి, కుడా మాజీ చైర్మన్ గురుమోహన్, మున్సిపాలిటీ అధ్యక్షుడు సుందరరామిరెడ్డి, బూత్ కన్వీనర్ల విభాగం రాష్ట్ర కార్యదర్శి యద్దారెడ్డి, సగర విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బంగారు శీనయ్య, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment