జిల్లా సీనియర్ హాకీ పురుషుల జట్టు ఎంపిక
పులివెందుల టౌన్: పులివెందుల పట్టణంలోని వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమి క్రీడా మైదానంలో ఆదివారం వైఎస్సార్ జిల్లా సీనియర్ హాకీ జట్టు ఎంపికలు చేసినట్లు జిల్లా సెక్రటరీ శేఖర్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. వారిలో ప్రతిభ గల క్రీడారులను జిల్లా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిందన్నారు. జిల్లా ప్రెసిడెంట్ రవి చంద్ర, జనరల్ సెక్రటరీ ఎం.శేఖర్, సెలక్షన్ కమిటీ సభ్యులు డేవిడ్, సౌరీ కుమార్, సందీప్ రాజులు ఈ ఎంపికలు నిర్వహించారన్నారు. ఎంపికై న క్రీడాకారులు వచ్చే నెల 6 నుంచి 8 వరకు గుంటూరులో జరిగే 15వ రాష్ట్ర హాకీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment