వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరం
కడప కార్పొరేషన్: వినియోగదారులు తమ హక్కులపై అవగాహన ఏర్పరుచుకోవాలని ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ నేషనల్ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్ అన్నారు. శనివారం ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా కడప నగర శివార్లలోని ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజీ ఎదురుగా ఉన్న పాస్టర్స్ సెంటర్ ఆడిటోరియంలో ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ స్టేట్ కో–ఆర్డినేటర్ మద్దెల సురేష్ బాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి రమేష్ మాట్లాడుతూ వినియోగదారుల అవగాహనకు ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ద్వారా ప్రతి జిల్లాలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. వినియోగదారులు మోసపోకుండా ఉండడానికి తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. వినియోగదారుడు కొనే ప్రతి వస్తువు పైన కొన్ని హక్కులు ఉంటాయని, ఆ విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన న్యాయమైన, స్థిరమైన జీవితం వైపు ముందడుగు వేయాలన్నారు. మోసపూరిత చర్యలు లేకుండా ముందుకు సాగాలని, సైబర్ క్రైమ్ కు దూరంగా ఉండాలని వివరించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారాం మాట్లాడుతూ ఇటీవల పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజల అప్రమత్తం కావాలన్నారు. సైబర్ క్రైమ్ వలలో చిక్కకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఏపీ స్టేట్ చైర్మన్ శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ కొనే ప్రతి వస్తువుపై బిల్లు తీసుకోవాలని వినియోగదారుల్లో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా దీని నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ని సంప్రదిస్తే తమ వంతు సహాయం చేస్తామన్నారు. స్టేట్ వైస్ చైర్మన్ మత్సు విశ్వనాథం, డాక్టర్ నల్లమిల్లి ఆది రెడ్డి, తెలంగాణ స్టేట్ వైస్ చైర్మన్ మెరుగు రాధాక్రిష్ణ గౌడ్, అనకాపల్లి జిల్లా చైర్మన్ హేమంత్ చరపాక, కడప జిల్లా చైర్మన్ కిషోర్, చైర్మన్ అడ్మిన్ చైతన్య, కడప జిల్లా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ నేషనల్ చైర్మన్ సాయి రమేష్
Comments
Please login to add a commentAdd a comment