పరిసరాల శుభ్రతతో ఆరోగ్యం
కడప అర్బన్: ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం సామాజిక బాధ్యత అని, పరిసరాల శుభ్రతతో ఆరోగ్యంగా ఉంటూ దైనందిన విధులను మరింత సమర్థవంతంగా నిర్వర్తించవచ్చని ఎస్పీ ఈ.జీ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడో శనివారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఉన్న స్టేడియం పరిసరాలను ఎస్పీ పాల్గొని పారలు, గునపం చేతబట్టి స్వయంగా శుభ్రపరిచారు. అనంతరం మొక్క నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు క్రమశిక్షణతో ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా అందరికి స్పూర్తి కలిగిస్తుందనీ, సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఏ.ఆర్. అదనపు ఎస్పీ బి. రమణయ్య, ఏ.ఆర్. డిఎస్పీ కె. శ్రీనివాసరావు, ఆర్‌ఐలు ఆనంద్, టైటస్, శివరాముడు, శ్రీశైలరెడ్డి, వీరేష్, ఆర్.ఎస్.ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ ఈ.జీ అశోక్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment