రూటే..సప‘రేటు’పై కలెక్టర్ స్పందన
● డీఎంహెచ్‌ఓ ఏఓను డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు సరెండర్ చేస్తూ ఆదేశం
కడప రూరల్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన అవినీతి ఆరోపణలపై ఈ నెల 7న సాక్షిలో ప్రచురితమైన రూటే..సప‘రేటు’అనే కథనంపై కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి స్పందించారు. అధికారులను పిలిపించుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి విచారణ అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఏఓ శ్రీదేవిని డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు సరెండర్ చేశారు. అలాగే ఇందుకు సంబంధించి లోతుగా విచారించాలని ఒక అధికారిని నియమించారు. కాగా ఈ వ్యవహరానికి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ పద్మావతి సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది.
కోట్ల స్వాహాపై విచారణ
కడప రూరల్: జిల్లా క్షయ నియంత్రణ విభాగంలో జరిగిన అవినీతిపై ఈ నెల 16న సాక్షిలో ప్ర చురితమై ‘క్షయ నియంత్రణ పేరుతో కోట్లు మింగేశారు’కథనం ఆ శాఖలో ప్రకంపనలు పుట్టించింది. ఈ అంశంపై ఉన్నతాధికారులు సైతం స్పందించారు. విచారణకు ఆదేశించారు.ఈ నేపధ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు ఈ నెల 18న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగే మీటింగ్‌కు క్షయ నియంత్రణ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది సంబంధిత రికార్డులతో రావాలని ఆదేశించారు. అలాగే 2023–2025 నుంచి జరిపిన బ్యాంకు లావాదేవీలపై కూడా ఆరా తీయనున్నారు.
ఘనంగా ఉరుసు
సిద్దవటం: పరకోటలో వెలసిన హజరత్ సయ్య ద్ షా బిస్మిల్లాషా ఖాద్రీ దర్గాలో ఆదివారం ఉరుసు మహోత్సవం ఘనంగా జరిగింది. శనివారం రాత్రి గంధోత్సవం సందర్భంగా ఫాతెహాను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గంధం అర్పించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment