ఏప్రిల్ 2 నుంచి సీపీఎం జాతీయ మహాసభలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : సీపీఎం జాతీయ మహాసభలు ఏప్రిల్ 2 నుంచి తమిళనాడులోని మధురైలో నిర్వహించనున్నట్లు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్ తెలిపారు. ఆదివారం ఆర్‌కే నగర్‌లోని సీపీఎం కార్యాలయంలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో దేశంలో, రాష్ట్రంలో జరిగే ఎలాంటి ఎన్నికల్లోనా సీపీఎం పొత్తులు ఒకే రకంగా ఉండవని తెలిపారు. స్థానిక పరిస్థితులను బట్టి ఉంటాయన్నారు. ఏప్రిల్ 2 నుంచి 6వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో జరిగే 24వ సీపీఎం జాతీయ మహాసభల్లో స్పష్టమైన రాజకీయ విధానం రూపొందించనున్నట్లు తెలిపారు. నేడు దేశంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మత ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. దీనికి వ్యతిరేకంగా లౌకిక ప్రజాస్వామ్య శక్తులను ఐక్యం చేయడం సీపీఎం భవిష్యత్తు కార్యాచరణ అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ.రామ్మోహన్, బి.మనోహర్, వి.అన్వేష్, జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాస్ రెడ్డి, బి.దస్తగిరి రెడ్డి, పి.చాంద్ బాషా, కె.సత్యనారాయణ, గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment