స్మశాన భూమి ఆక్రమణలు తొలగించాలి
బ్రహ్మంగారిమఠం మండలం కందిమల్లాయపల్లె గ్రామ సర్వే నెంబరు 464లో ప్రభుత్వం 1976లో 10.05 ఎకరాల భూమిని స్మశాన వాటిక కోసం కేటాయించింది. అందులో ఎనిమిది ఎకరాలు పైబడి భూమిని కొంతమంది దురాక్రమించారు. దురాక్రమణల నుంచి స్మశాన భూమిని విడిపించాలంటూ 2017లో లోకాయుక్త కలెక్టర్‌కు ఆదేశాలు పంపింది. కానీ, రెవెన్యూశాఖ ఏడేళ్లుగా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. – బాలనాయుడు, కందిమల్లాయపల్లె, బి.మఠం
రహదారి సౌకర్యం కల్పించాలి
మాది తెలుగుగంగ పునరావాస గ్రామం. మా గ్రామంలోకి రావాలంటే కందిమల్లాయపల్లె, సోమిరెడ్డిపల్లె గ్రామ పొలాల సర్వే నెంబరు 309, 310 నుంచి రావాలి. ఇరుకు రహదారి వల్ల రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్డు నిర్మాణంతోపాటు దాని వెంట విద్యుత్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలి. – ఆదినారాయణరెడ్డి, బి.మఠం
Comments
Please login to add a commentAdd a comment