‘వృద్ధురాలినన్న కనికరమూ లేదు..’
చేతిలో అర్జీ పట్టుకుని కుంటుకుంటూ కలెక్టరేట్‌కు వచ్చిన ఈమె పేరు బి. చంద్రమ్మ. వయసు ఏడు పదులు పైనే. ఏమైందవ్వా అని పలకరిస్తే.. ‘గూడు’ గురించి గోడు వెల్లబోసుకుంది. ఈమెకు వల్లూరు మండలంలోని ఎన్. ఓబాయపల్లెలోని లే అవుట్‌లో ఇల్లు మంజూరైంది. తన వృద్ధాప్య పెన్షన్ డబ్బుతో పాటు అల్లుడిచ్చిన కొంచెం డబ్బులతో ఇంటిని నిర్మించుకుంది. తనకు రావాల్సిన చివరివిడత డబ్బుల కోసం అధికారు లనడిగితే ‘నాలుగు ట్రిప్పుల ఇసుక, రెండు కిటికీలు మొత్తం రూ. 10,776లు విలువ చేసే సామగ్రి తీసుకు న్నావుగా.. ఇదిగో ఆన్‌లైన్‌లో కూడా చూపిస్తోంది చూడు’ అని జవాబిచ్చారు. నోరెళ్లబెట్టడం ఆమె వంతైంది. తన సంతకం లేకుండానే కమలాపురం గోడౌనుంచి తెచ్చుకున్నట్లు చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అసలు ఆ గోడౌన్ ఎక్కడుందో కూడా తెలియదని వాపోయింది. వృద్ధురాలినన్న కనికరమూ లేకుండా పోయింది. ఇది వరకు ఓ సారి స్పందనలో ఫిర్యాదు చేస్తే.. తనకు తెలియకుండానే విచారణ చేసి ముగించారట. నాకు రావాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయండి సారూ అని వేడుకుంది.
Comments
Please login to add a commentAdd a comment