ప్రారంభమైన ‘పది’ పరీక్షలు
కడప ఎడ్యుకేషన్ : జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు తమ తల్లితండ్రులతో కలిసి పరీక్షా కేంద్రాలకు వచ్చారు. తొలిరోజు పరీక్ష కావడంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు ధైర్యం చెబుతూ కనిపించారు. మరికొందరు ‘ఆల్ ది బెస్ట్’ చెబుతూ కేంద్రాల్లోకి పంపారు. ఇంకొందరు దగ్గరుండి హాల్‌టికెట్లు నెంబర్లను చూడడంలో సాయపడ్డారు. దీంతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అధికారులు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్‌ను అమలు చేశారు. జిల్లావ్యాప్తంగా 161 పరీక్షా కేంద్రాలలో 27,800 మంది విద్యార్థులకుగాను 27,648 మంది హాజరుకాగా 152 మంది గైర్హాజరయ్యారు.
పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా అబ్జర్వర్..
పదో తరగతి పరీక్షల జిల్లా అబ్జర్వర్ మధుసూధన్‌రావు జిల్లాలోని ఒంటిమిట్ట మండలం ఒంటిమిట్ట జెడ్పీ హైస్కూల్‌ను, మాధవరం జెడ్పీ హైస్కూల్‌ను, కొండమాచుపల్లి జెడ్పీ హైస్కూల్స్‌ను తనిఖీ చేసి ఛీప్ సూపరెండెంటెంట్లకు, డిపార్టుమెంట్ ఆఫీసర్లకు పలు సూచనలు, సలహాలను ఇచ్చారు.
ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా చర్యలు
జిల్లావిద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ కడపలోని గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్, పవన్ స్కూల్, వికాస్ స్కూల్, గంగాభవాని హైస్కూల్, సాయిబాబా హైస్కూల్స్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
తొలి రోజు 27,800 మందికిగాను 27,648 మంది హాజరు
జిల్లాలో పలు పరీక్షా కేంద్రాలను
తనిఖీ చేసిన అబ్జర్వర్, డీఈఓ
ప్రారంభమైన ‘పది’ పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment