దుకాణాల దగ్ధంపై పోలీసులు విచారించాలి
ప్రొద్దుటూరు : స్థానిక పాత బస్టాండ్‌లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కొండారెడ్డి, సుధాకర్ దుకాణాల దగ్ధంపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి కోరారు. ఇటీవల దగ్ధమైన రెండు షాపులను గురువారం ఆయన పరిశీలించి బాధితులను పరామర్శించారు. రాచమల్లు మాట్లాడుతూ విద్యుత్తు మీటర్‌కు సంబంధించిన బాక్స్ యథాస్థితిలో ఉండగా, షార్ట్ సర్క్యూట్ ఎలా జరుగుతుందని అన్నారు. గత పదేళ్లుగా కొండారెడ్డి, సుధాకర్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ వెంట నడుస్తున్నారని, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, తన జన్మదిన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఉద్దేశ పూర్వకంగానే ఈ షాపులకు నిప్పు అంటించారనే అనుమానంపై పోలీసులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో ఈ టి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. తన శ్వాస ఉన్నంత వరకు పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తానన్నారు. అనంతరం దుకాణాలు కాలిపోయి నష్టపోయిన కొండా రెడ్డికి రూ.2లక్షలు, సుధాకర్‌కు రూ.30వేల సాయం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి, వరికూటి ఓబుళరెడ్డి, గరిశపాటి లక్ష్మీదేవి, సత్యం, రాగుల శాంతి, డీలర్ అంజి, తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment