విజేతలకు బహుమతులు పంపిణీ | - | Sakshi
Sakshi News home page

విజేతలకు బహుమతులు పంపిణీ

Published Sat, Mar 22 2025 1:32 AM | Last Updated on Sat, Mar 22 2025 1:28 AM

ఒంటిమిట్ట: అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఒంటిమిట్ట ట్రైనీ ఐఎఫ్‌ఎస్‌ అధికారి శ్రీకాంత్‌ అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ సాయి భారతి ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడవులు ప్రాముఖ్యత, వాటి సంరక్షణ అవసరం, అటవీ చట్టాల పాత్ర తదితర అంశాల గురించి వివరించారు. అనంతరం శ్రీకాంత్‌ మాట్లాడుతూ అడవులు వాతావరణ సమతుల్యతను కాపాడతాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు.కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ రామ తులసీ, ఎఫ్‌ఎస్‌ఓ బ్రహ్మయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement