
బైకును ఢీకొన్న కారు
దువ్వూరు : మండలంలోని కడప–కర్నూలు జాతీయ రహదారిపై టంగుటూరు మెట్ట వద్ద ఆదివారం కారు–బైక్ ఢీకొన్న సంఘటనలో బైక్ నడుపుతున్న తలారి దానం (45) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని జిల్లెల్ల గ్రామానికి చెందిన తలారి దానం పని మీద నంద్యాల జిల్లా చాగలమర్రికి వెళుతుండగా కడప – కర్నూలు జాతీయ రహదారిపై టంగుటూరు మెట్ట వద్దకు రాగానే.. కడప నుంచి కర్నూలుకు వెళుతున్న కారు వెనుక నుంచి అతివేగంగా బైక్‌ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న తలారి దానంకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతుండగా, కుమార్తె 8వ తరగతి చదువుతోంది. మృతుడు వ్యవసాయ పనులకు కూలిగా వెళ్లి కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. కుటుంబానికి అండగా ఉన్న వ్యక్తి మృతి చెందడంతో మాకెవరు దిక్కు అంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వినోద్ కుమార్ తెలిపారు.
రిమ్స్ మార్చురీలో మహిళ మృతదేహం
కడప అర్బన్ : కడప రిమ్స్‌లో గుర్తు తెలియని మహిళ (45) చికిత్స పొందుతూ మృతి చెందింది. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఈనెల 22వ తేదీ వరకు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఆమె మృతదేహాన్ని రిమ్స్ మార్చురీలో ఉంచారు. సంబంధీకులు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అఽధికారులు తెలిపారు.
వ్యక్తి మృతి

బైకును ఢీకొన్న కారు

బైకును ఢీకొన్న కారు
Comments
Please login to add a commentAdd a comment