Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

AP Inter Result 2025 Live Updates: Direct Link to Check AP Inter Result Online1
ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో క్షణాల్లో చెక్‌ చేసుకోండిలా..

విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు(AP Inter Results) శనివారం విడుదలయ్యాయి. ఇంటర్‌ ఫస్టియర్‌లో 70 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 83 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్ష రాసిన విద్యార్థులు కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో www.sakshieducation.com వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.క్లిక్‌ 👉🏼 ఫస్ట్‌ ఇయర్‌ రెగ్యులర్‌ రిజల్ట్స్‌ క్లిక్‌ 👉🏼 సెకండ్‌ ఇయర్‌ ఇయర్‌ రెగ్యులర్‌ రిజల్ట్స్‌క్లిక్‌ 👉🏼 ఫస్ట్‌ ఇయర్‌ వొకేషనల్‌ రిజల్ట్స్‌క్లిక్‌ 👉🏼 సెకండ్‌ ఇయర్‌ వొకేషనల్‌ రిజల్ట్స్‌ AP Inter Results 2025.. ఎలా చెక్‌ చేసుకోవాలి.. ?➤ ముందుగా https://results.sakshieducation.com ను క్లిక్‌ చేయండి.➤పైన కనిపిస్తున్న లింక్‌లపై క్లిక్ చేయండి.➤ మీ హాల్‌టికెట్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయండి.➤ వివరాలు ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ బటన్‌ను క్లిక్‌ చేయండి. ➤ తర్వాతి స్క్రీన్‌లో ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి.➤ భవిష్యత్‌ అవసరాల కోసం డౌన్‌లోడ్‌/ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి.ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లో చిత్తూరు లాస్ట్‌ఇదిలా ఉంటే.. ఇంటర్‌లో ఈ ఏడాది 10 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి - 19 వరకు ఫస్టియర్‌ పరీక్షలు జరగగా, మార్చి 3- 20 వరకు సెకండియర్‌ పరీక్షలను నిర్వహించారు. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తి కావడంతో ఇవాళ ఫలితాలను వెల్లడించారు. ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పై చేయిగా నిలిచింది. ఫస్ట్ , సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఫస్ట్‌ ప్లేస్‌లో కృష్ణా జిల్లా నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో గుంటూరు , ఎన్టీఆర్ జిల్లాలు నిలిచాయి. ఇక.. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో లాస్ట్ ప్లేస్‌లో సీఎం సొంతజిల్లా చిత్తూరు నిలవడం గమనార్హం. సెకండ్ ఇయర్ ఫలితాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. మే 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని ఇంటర్‌బోర్డు ప్రకటించింది.

Eluru DIG Ashok Kumar Clarity On Pastor Praveen Kumar Incident2
పాస్టర్‌ ప్రవీణ్‌ది సెల్ఫ్ రోడ్‌ యాక్సిడెంట్‌: ఏలూరు డీఐజీ

ఏలూరు, సాక్షి: పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల(Pastor Praveen Pagadala) మృతి కేసుపై నెలకొన్న అనుమానాలకు పోలీసులు పుల్‌స్టాప్‌ పెట్టారు. మద్యం మత్తులో బైక్‌ నడిపి కింద పడిపోవడం వల్లే ప్రవీణ్‌ ప్రాణాలు పొగొట్టుకున్నారని ఏలూరు రేంజ్‌ డీఐజీ అశోక్‌ కుమార్‌(Ashok Kumar) వెల్లడించారు. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం రాజమండ్రిలో ఆయన మీడియాకు వివరించారు.హైదరాబాద్‌ నుంచి పాస్టర్‌ బైక్‌ మీద బయల్దేరారు. ఆయన ప్రయాణించిన మార్గంలో సీసీ టీవీ ఫుటేజీ వివరాలు అన్నీ సేకరించాం. ఒక్క రామవరప్పాడు జంక్షన్‌ వద్ద సీసీటీవీ ఫుటేజీ లభించలేదు. పాస్టర్‌ ఆరోజు ఎవరెవరితో మాట్లాడారో గుర్తించాం. పాస్టర్‌ ప్రవీణ్ ‌కుటుంబ సభ్యులను కూడా విచారించాం. ఆయన్ని హత్య చేశారని, అనుమానాస్పద మృతి అని రకరకాల ప్రచారాలు చేశారు. సోషల్‌ మీడియాలో అలా దుష్ర్పచారం చేసినవారికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నాం.అరోజు ప్రవీణ్‌ కుమార్‌ వస్తున్నారని కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ తెలియదు. మార్గమధ్యలో ఆరుగురితో పాస్టర్‌ ప్రవీణ్‌ మాట్లాడారు. మూడు చోట్ల లిక్కర్‌ కొనుగోలు చేశారు. మద్యం, పెట్రోల్‌ బంకులలో యూపీఐ పేమెంట్స్‌ జరిపినట్లు ఆధారాలున్నాయి. మార్గం మధ్యలో ఓ పోలీస్‌ అధికారి ప్రవీణ్‌తో మాట్లాడారు. మద్యం సేవించడంతో డ్రైవ్‌ చేయొద్దని వారించారు. అయినా కూడా ఆయన వినకుండా ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో మూడు చోట్ల ఆయనకు యాక్సిడెంట్లు అయ్యాయి. ప్రమాదంలో హెడ్‌ లైట్‌ డ్యామేజ్‌ అయ్యిది. హెడ్ లైట్ పగిలిపోవడంతో రైట్ ఇండికేటర్ వేసుకుని పాస్టర్ ప్రయాణించారు.పోస్ట్ మార్టం రిపోర్టులో, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదికలో (ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్‌)లో ఆయన మద్యం సేవించినట్లు తేలింది. మరో వాహనంతో ప్రమాదం జరిగినట్లు ఆధారాలు లభించలేదు. ప్రమాద స్థలానికి చేరుకున్నపుడు పాస్టర్ ప్రవీణ్ 70 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది. కంకర రోడ్డు కారణంగా బైక్ స్లిప్ అయి రోడ్డుపక్కన గుంతలో పడిపోయారు. గుంత అర్ధచంద్రాకారంలో ఉండడం వల్ల బైక్ ఎగిరి పాస్టర్‌పై పడింది. తలకు బలమైన గాయమై చనిపోయారని వైద్యులు తమ నివేదికలో తెలిపారు. పాస్టర్‌ ప్రవీణ్‌ది సెల్ఫ్ రోడ్‌ యాక్సిడెంట్‌ అని ఏలూరు డీఐజీ అశోక్‌ కుమార్‌ ప్రకటించారు.పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంపై సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో అన్ని విధాలుగా, క్షుణ్ణంగా పరిశోధించామని ఆయన తెలిపారు. కంకర వల్ల బైక్ స్లిప్ అయి పడిపోవడమే పాస్టర్ మరణానికి కారణమని, మరే వాహనం ఆయన బైక్ ను ఢీ కొట్టలేదని స్పష్టంగా తేలిందన్నారు. పాస్టర్ బయలుదేరిన సమయం నుంచి ప్రమాద స్థలం వరకు ఎప్పుడెప్పుడు ఏం జరిగిందనే వివరాలు పరిశోధించి తెలుసుకున్నామని ఆయన వివరించారు.

Devotees Wear Chappals At Near Tirumala Temple3
తిరుమలలో మరో అపచారం

సాక్షి, తిరుమల: తిరుమలలో మరో అపచారం వెలుగు చూసింది. శ్రీవారి దర్శనానికి ముగ్గురు భక్తులు పాదరక్షలతో మహా ద్వారం వరకు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. వీరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి పాదరక్షలు ధరించి వచ్చారు. అయితే, మూడు ప్రాంతాలలో తనిఖీ చేసిన టీటీడీ విజిలెన్స్‌ అధికారులు వీరిని గుర్తించకపోవడం గమనార్హం.ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలో భద్రతాలోపం మరోసారి బయటకు వచ్చింది. భక్తులు ఏకంగా చెప్పులు వేసుకుని మహా ద్వారం వరకు రావడం అధికార నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి వీరు పాదరక్షలు ధరించి మహా ద్వారం వరకు చేరుకున్నారు. వీరు వచ్చిన మార్గంలో టీటీడీ విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు ఉన్నప్పటికీ ఇంత దూరం పాదరక్షలతో ఎలా వచ్చారని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా తీరు, టీటీడీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు.. ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా భూమన మాట్లాడుతూ.. ‘తిరుమలలో భద్రత డొల్ల మరోసారి బయట పడింది. పాద రక్షలు వేసుకుని మహా ద్వారం వరకు భక్తులు వెళ్ళారు అంటే ఎలాంటి భద్రత ఉందో తెలుస్తోంది. శ్రీవాణి దర్శన వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి మహా ద్వారం వరకు పట్టించుకోలేదు. మేజోళ్ళుకు అనుమతి ఉంది అని ఏ బోర్డులో తీర్మానం చేశారో చెప్పండి. తిరుమల కొండపై జరుగుతున్న అపచారాలు గురించి చెప్తుంటే వితండ వాదనలు చేస్తున్నారు. తిరుమల కొండపై ప్రక్షాళన చేస్తామని చెప్పిన తర్వాతనే ఇవన్నీ జరుగుతున్నాయి.రాష్ట్రపతి కూడా ఈ సాహసం చేయలేదు, చెప్పులు వేసుకుని మహాద్వారం వరకు ఏనాడు రాలేదు. భద్రత డొల్లతనం ఏమిటి అన్నది తెలుస్తోంది. టీటీడీలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. గోశాలలో ఆవులు చనిపోయాయి, దీనికి ప్రత్యక్ష సాక్షాలు ఉన్నాయి. జేసీబీలతో వెళ్ళి పూడ్చిన కళేబరాలు త్రవ్వి మీడియా సమక్షంలో బయటపెడదాం. టీటీడీ పాలకమండలి వెంటనే రాజీనామా చేయాలి డిమాండ్ చేస్తున్నా. దీనికి కారణమై సెక్యూరిటీ, ఇతర అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. తిరుమల భద్రత ఎంత అధ్వాన్న పరిస్థితికి వెళ్ళింది అనేది తేట తెల్లమైంది. తిరుపతి గోశాలలో గోవులు చనిపోయాయి అని చెప్తే, మాపై ఎదురు దాడి విమర్శలు చేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.

Delhi Dust Storm Effect 205 Flights Delayed4
ఢిల్లీలో దుమ్ము తుపాను, వర్ష బీభత్సం.. 205 విమాన సర్వీసులు ఆలస్యం

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు వీస్తూ.. దుమ్ము తుపానుతో పాటు మోస్తారు వర్షం కురిసింది. ఈ క్రమంలో దుమ్ము, ధూళితో కూడిన గాలులు వీయడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు.. ఢిల్లీ క్రికెట్‌ స్టేడియంలో ముంబై టీమ్‌ ప్లేయర్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో ఈ తుపాన్‌ రావడంతో దీనికి సంబంధించిన వీడియోను టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.వివరాల ప్రకారం.. దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఈదురుగాలులు వీస్తూ మోస్తరు వర్షం కురిసింది. అంతకుముందు.. దుమ్ము తుపాను బీభత్సం సృష్టించింది. బలమైన గాలుల కారణంగా పలుచోట్ల కొన్నిచోట్ల చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. ఈదురుగాలుల ఎఫెక్ట్‌తో ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు 205 విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. దాదాపు 50 విమాన సర్వీసులను దారి మళ్లించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.Crazy wx! Gale and dust-storms at Dwarka, New Delhi.Heard from a friend at IGI airport, his aircraft was moving and guess what, he’s still on ground. You can imagine the wind speed then. #delhirain #delhiweather pic.twitter.com/BIOdq0bOq7— Anirban 👨‍💻✈️ (@blur_pixel) April 11, 2025ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా, ఇండిగో విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. విమానాల రాకపోకల ఆలస్యం కారణంగా ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 12 గంటలుగా విమానాశ్రయంలోనే వేచి చూసినట్లు ఒక మహిళ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ప్రయాణికులు ట్విట్టర్‌ వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైకి వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చాం. ఉదయం 12 గంటలకు బుక్‌ చేసుకున్న విమానం కాకుండా మరొకటి ఎక్కాలని అధికారులు సూచించారు. అదికాస్త ఎక్కాక అందులోనే 4 గంటల పాటు కూర్చోబెట్టి తర్వాత దింపేశారు అని ఒక ప్రయాణికుడు తెలిపారు.Delhi NCR is under a heavy dust storm! Visuals from Gurgaon — very intense dust storm hits Gurugram. Stay safe everyone! pic.twitter.com/IqGVen4kLb— The Curious Quill (@PleasingRj) April 11, 2025ఇక, శ్రీనగర్ నుండి ఢిల్లీకి ముంబైకి సాయంత్రం 4 గంటలకు కనెక్టింగ్ విమానం ఉంది. మా విమానం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ కావాల్సి ఉంది, కానీ దుమ్ము తుఫాను కారణంగా చండీగఢ్‌కు మళ్లించబడింది. ఆ తర్వాత రాత్రి 11 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్లింది అని ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న మరో ప్రయాణీకుడు తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం అయి ఉండి సరైన సమాచారం ఇవ్వకపోవడంపై ఒక ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తంచేశారు.Flight Indigo 6E2397 jammu To delhi experiencing a dust storm, affecting takeoffs and landings and potentially causing air traffic congestion at delhi airport we are diverted to jaipur after long 4 hrs waiting to land at delhi now waiting in aircraft at jaipur airport for… pic.twitter.com/2GDeO19UK1— Dr. Safeer Choudhary (@aapkasafeer) April 11, 2025 Very strong #DustStorm Hit Delhi ncr#DelhiWeather pic.twitter.com/REZY7o8v5y— Raviiiiii (@Ravinepz) April 11, 2025आज दिल्ली में बवंडर 🌪️ आ गया …सभी अपने घर में सुरक्षित रहें 🙏🏻#delhiweather #sandstorm #DelhiRains #delhi pic.twitter.com/OCf4ZE7BfS— Shivam Rajput (@SHIVAMespeare) April 11, 2025 మరోవైపు.. ఢిల్లీలోని కక్రికెట్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసం ముంబై ఇండియన్స్‌ ప్లేయర్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో ఈదురుగాలులు వీచాయి. ఈ క్రమంలో ప్లేయర్స్‌ను గ్రౌండ్‌ నుంచి లోపలికి వెళ్లాలని రోహిత్‌ శర్మ హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. ROHIT SHARMA, WHAT A CHARACTER 😀👌 pic.twitter.com/Ifz1YlNHX4— Johns. (@CricCrazyJohns) April 11, 2025 कल रात आए आंधी–तूफान का भयानक मंजर देखिए, गुरुग्राम का हैं वीडियो#Gurugram #Thunderstorm #WeatherUpdate #DelhiWeather pic.twitter.com/EMu90l1Bjf— Vistaar News (@VistaarNews) April 12, 2025

IPL 2025: Hussey Still Hopeful Of CSK Bagging A Playoff Spot5
IPL 2025: అప్పుడే అంతా అయిపోలేదు.. వరుస ఓటములు ఎదురవుతున్నా సీఎస్‌కే కోచ్‌ ధీమా

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌లో​ వరుసగా ఐదు పరాజయాలు మూటగట్టుకుని పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. తద్వారా ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సీజన్‌లో సీఎస్‌కే మరో 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా ప్లే ఆఫ్స్‌కు చేరుతుందని సొంత అభిమానులకే ఆశ లేదు.సొంత మైదానంలో కేకేఆర్‌ చేతిలో ఘోర పరాజయం అనంతరం ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పుడే అంతా అయిపోలేదు. సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలు ఇంకా ఉన్నాయి. లీగ్‌ మ్యాచ్‌లన్నీ పూర్తయ్యే సరికి కనీసం​ నాలుగో స్థానంతోనైనా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటాము. ఐపీఎల్‌ సుదీర్ఘంగా సాగే టోర్నీ. ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాము. ఒక్కసారి ఊపు అందుకున్నామంటే తిరిగి వెనక్కు చూడము.ప్రస్తుతానికి మేము మంచి క్రికెట్‌ ఆడటం లేదు. అయితే పరిస్థితులు త్వరలోనే మారతాయి. ఇందు కోసం చాలా కష్టపడుతున్నాము. పరాజయాల బాట వీడి ఒక్క విజయం సాధించినా ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ప్లేఆఫ్స్ సమయం వచ్చేసరికి చివరి స్థానాల్లో ఏదో ఒకదాన్ని చేరుకోగలము. ఇలా చేయగలమని ఇప్పటికీ నమ్ముతున్నాను. సత్ఫలితాలు సాధించాలంటే సమూహంగా రాణించాలి. జట్టులో ప్రతి ఒక్కరూ పాటు పడాలి.వరుసగా ఓడిపోతున్నామని ఆటగాళ్లను వారి సహజ శైలికి భిన్నంగా ఆడమని చెప్పలేము. వారు సొంత శైలిలో అద్భుతంగా ఆడారు కాబట్టే ఐపీఎల్‌ లాంటి మెగా టోర్నీలో ఆడే అవకాశం పొందారు. పరిస్థితులు మెరుగుపడటానికి ముందు అధ్వానంగా మారతాయి. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా అనుభవజ్ఞులకే పెద్ద పీట వేస్తున్నామనడం వాస్తవం కాదు. జట్టు అవసరాల దృష్ట్యా అప్పటికి ఎవరు అవసరమో వారినే తుది జట్టులోకి తీసుకుంటాము. కఠిన సమయాల్లో అభిమానులందరూ మద్దతుగా ఉండాలి. ఇప్పటికీ ఏమీ మించి పోలేదు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే సత్తా మాకు ఉందని హస్సీ అన్నాడు.కాగా, సొంత మైదానం చెపాక్‌లో నిన్న జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే కేకేఆర్‌ చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం కేకేఆర్‌ ఆడుతూపాడుతూ 10.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది (2 వికెట్లు కోల్పోయి). ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. కెప్టెన్‌గా ధోని వ్యూహాలు ఈ మ్యాచ్‌లో పని చేయలేదు. రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయపడటంతో ధోని కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. సీఎస్‌కే తమ తదుపరి మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ ఏప్రిల్‌ 14న లక్నో హోం గ్రౌండ్‌లో జరుగనుంది.

Padma Shri Vanajeevi Ramaiah Passed Away Condolences pour6
Vanajeevi Ramaiah: ట్రీ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా ఇక లేరు

సాక్షి, ఖమ్మం: ప్రముఖ సామాజిక కార్యకర్త, జీవితమంతా మొక్కలు నాటేందుకే గడిపిన ప్రకృతి ప్రేమికుడు ‘వనజీవి’ రామయ్య(85) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం వేకువజామున గుండెపోటుతో కన్నుమూశారు. కోటికి పైగా మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో రామయ్య చేసిన కృషికిగానూ కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించింది.దరిపల్లి రామయ్య(Daripalli Ramaiah) స్వగ్రామం ఖమ్మం రూరల్‌ మండలంలోని ముత్తగూడెం. ఇక్కడే ఐదో తరగతి దాకా చదువుకున్నారు కూడా. ఆ సమయంలో మల్లేశం సర్‌ చెప్పిన మొక్కల పెంపకం పాఠాలు రామయ్యను బాగా ప్రభావితం చేశాయి. ఆపై పంటపొలాల కోసం చిన్నతనంలోనే రెడ్డిపల్లికి రామయ్య కుటుంబం మకాం మార్చింది. మల్లేశం సర్‌ పాఠాల స్ఫూర్తితో తన ఇంటిలోని 40 కుంటల స్థలంలో ఇల్లు పోను మిగతా జాగలో చెట్లు నాటి వాటిని ప్రాణప్రదంగా పెంచారు. అక్కడి నుంచి.. దశాబ్దాలపాటు రోడ్ల పక్కన ఖాళీ స్థలం, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలు, దేవాలయాలు.. ఇలా ఒకటేమిటి ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడం రామయ్యకు నిత్యకృత్యమైంది. వృత్తిరీత్యా కుండలు చేస్తూ, పాలు అమ్ముతూ ప్రవృత్తి రీత్యా వనపెంపకానికి అవిశ్రాంతంగా కృషి చేశారాయన. మనవళ్లకు మొక్కల పేర్లు!వనజీవి రామయ్య((Vanajeevi Ramaiah)కు భార్య జానకమ్మ, నలుగురు సంతానం. ఓవైపు కుటుంబ భారాన్ని మోస్తూనే.. దశాబ్దాలకు పైగా మొక్కలు నాటుతూ వచ్చారు. విశేషం ఏంటంటే.. మనుమళ్లు, మనుమరాళ్లకు కూడా ఆయన చెట్ల పేర్లే పెట్టాడు. ఒకామె పేరు చందనపుష్ప. ఇంకో మనుమరాలు హరిత లావణ్య. కబంధపుష్ప అని ఇంకో పాపకు పెట్టాడు. మరో మనవరాలికి వనశ్రీ అని నామకరణం చేశారు వనజీవి రామయ్య.అలసిపోని వనజీవిఆయన యువతరం నుంచి నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా దర్శనమిస్తున్నాయి. ఎండకాలం వచ్చిందంటే రామయ్య అడవుల్లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. వయసు మీదపడుతున్నా కూడా అడవుల వెంట తిరుగుతూ వివిధ రకాల విత్తనాలను సేకరించేవారు. వాటన్నింటిని బస్తాల్లో నింపి ఇంటి దగ్గర నిల్వచేసేవారు. అందులో ఎవరికీ తెలియని చెట్ల విత్తనాలే ఎక్కువగా ఉండేవి. తొలకరి చినుకులు పడగానే మొక్కలు నాటే కార్యక్రమంలో మునిగిపోయేవారు. తాను మొక్కలను పెంచడం మాత్రమే కాదు.. పదిమందికి విత్తనాలు పంచి పెంచమని సూచించారు. బంధువుల ఇళ్ళలో పెళ్ళిళ్ళకు వెళ్ళినా సరే మొక్కలను, విత్తనాలను బహుమతులుగా ఇచ్చి పెంచమని ప్రోత్సహించే వారు. ఆ మధ్య ఆయనకు ఓ యాక్సిడెంట్‌ అయ్యింది. ఆ వాహనదారుడిని శిక్షించే బదులు అతనితో వంద మొక్కలు నాటించాలని పోలీసులను ఆయన కోరారు. అలాగే.. రైతు బంధు, దళిత బంధులాగా హరిత బంధు కూడా ఇప్పించాలంటూ బీఆర్‌ఎస్‌ హయాంలో ఆయన ఓ విజ్ఞప్తి కూడా చేశారు.సీఎం రేవంత్‌ సహా ప్రముఖుల సంతాపంపద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ‘‘ప్రకృతి పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వనజీవిగా పేరుగాంచిన దరిపల్లి రామయ్య గారు. ఒక వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి పద్మశ్రీ రామయ్య గారు. వారి మరణం సమాజానికి తీరని లోటు, కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి.పర్యావరణ రక్షణకు పాటుపడుతూ తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య గారి ఆత్మకు నివాళి. వారు సూచించిన మార్గం నేటి యువతకు ఆదర్శం అని ఒక ప్రకటన విడుదల చేశారు.ప్రచార సాధనాలుప్లాస్టిక్‌ డబ్బాలు, విరిగిపోయిన కుర్చీలు, ప్లాస్టిక్‌ కుండలు, రింగులు.. ఇలా ఆయన తన హరితహారం ప్రచారానికి సాధనాలుగా ఉపయోగించుకోనంటూ వస్తువు లేదు. వాటికి తన సొంత డబ్బులతో రంగులు అద్ది.. అక్షరాలు రాసి తలకు ధరించేవారు. అలా.. తను ఎక్కడికి వెళ్లనా మొక్కల పెంపకంపై అవగాహన కలిగించడం ఆయనకంటూ దేశవ్యాప్తంగా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టింది. ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా ‘‘వృక్షోరక్షతి రక్షిత’’ అని రాసివున్న ప్లకార్డులను తగిలించుకుని ప్రచారం చేసేవారాయన. అడిగిందే ఆలస్యం.. 120 రకాల మొక్కల చరిత్రను అలవోకగా వివరించేవారాయన.అవార్డులు, పాఠంగా రామయ్య జీవితంకోటికి పైగా మొక్కలను నాటి ట్రీ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా గుర్తింపు పొందిన రామయ్య సేవలకుగాను పలు సంస్థలు అవార్డులతో సత్కరించాయి. 2005 సంవత్సరానికి సెంటర్‌ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ నుంచి వనమిత్ర అవార్డు ఇచ్చింది. యూనివర్సల్‌ గ్లోబల్‌ పీస్‌ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ప్రధానం చేసింది. 1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవా అవార్డు దక్కింది. సాక్షి మీడియా సంస్థ సైతం ఆయన సేవలకుగానూ ఎక్సలెన్స్‌(Sakshi Excellence Award) అవార్డుతో సత్కరించింది. ఇక.. మహారాష్ట్ర ప్రభుత్వం వనజీవి రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. అక్కడి తెలుగు విద్యార్థుల కోసం 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. మరోవైపు.. తెలంగాణ 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో వనజీవి కృషిని పాఠ్యాంశంగా పిల్లలకు బోధిస్తున్నారు. 2017 సంవత్సరంలో నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ (సామాజిక సేవ) పురస్కారం అందుకుంటూ..

No Change in Tatkal Ticket Timings IRCTC Tweet7
తత్కాల్‌ బుకింగ్‌ టైమింగ్స్‌లో మార్పు లేదు: ఐఆర్‌సీటీసీ క్లారిటీ

ఆంగ్ల మీడియా కథనాలు ఐఆర్‌సీటీసీ (IRCTC) తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో మార్పులు చేసినట్లు వెల్లడించాయి. వీటిని ఆధారంగా చేసుకుని మేము కూడా కథనం అందించాము. అయితే తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఎలాంటి మార్పు లేదని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేస్తూ అధికారికంగా వెల్లడించింది.ఏప్రిల్ 15 నుంచి కూడా తత్కాల్ టికెట్స్ బుకింగ్స్ సమయంలో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి టైమింగ్ యథావిధిగానే ఉంటాయి. టికెట్స్ బుక్ చేసుకోవాలనుకునే వారు ఇప్పటి వరకు ఉన్న సమయాన్నే పాటించాలి. ఆ సమయాల్లోని టికెట్స్ అందుబాటులో ఉంటాయి.Some posts are circulating on Social Media channels mentioning about different timings for Tatkal and Premium Tatkal tickets. No such change in timings is currently proposed in the Tatkal or Premium Tatkal booking timings for AC or Non-AC classes. The permitted booking… pic.twitter.com/bTsgpMVFEZ— IRCTC (@IRCTCofficial) April 11, 2025

Kiran Abbavaram's 'Ka' Telugu Movie OTT Streaming Details8
మరో ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్‌ అబ్బవరం హిట్‌ సినిమా

కిరణ్‌ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా నటించిన 'క'(KA Movie) సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. కిరణ్‌ అబ్బవరం హీరోగా, నయన్‌ సారిక, తన్వీ రామ్‌ హీరోయిన్లుగా నటించిన పీరియాడికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ ‘క’. సుజీత్‌–సందీప్‌ దర్శకత్వంలో చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 50 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టి కిరణ్‌ అబ్బవరం కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది.ఇప్పటికే ఒక ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న 'క' చిత్రం సడెన్‌గా అమెజాన్‌ ప్రైమ్‌లో కూడా స్ట్రీమింగ్‌ అవుతుంది. డాల్బీ విజన్‌ 4కే, అట్మాస్‌ టెక్నాలజీ నుంచి ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్‌ తెలుగు సినిమాగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. సైకలాజికల్‌ సస్పెన్స్‌తో మెప్పించిన ఈ చిత్రానికి భారీగానే ఫ్యాన్స్‌ ఉన్నారు. చూడని వారు ఉంటే అమెజాన్‌ ప్రైమ్‌లో కూడా ఈ క చిత్రాన్ని చూడొచ్చు.‘క’ కథేంటంటే..ఈ సినిమా కథంతా 1977లో జరుగుతుంది. అభినయ వాసుదేవ్(కిరణ్‌ అబ్బవరం) అనాథ. చిన్నప్పటి నుంచి పక్కవాళ్ల ఉత్తరాలు చదివే అలవాటు ఉంటుంది. తన వయసుతో పాటు ఈ అలవాటు కూడా పెరుగుతూ వస్తుంది. పోస్ట్‌ మ్యాన్‌ అయితే అన్ని ఉత్తరాలు చదువొచ్చు అనే ఆశతో ఆ ఉద్యోగంలో చేరుతాడు. జాబ్‌ కోసం రామ్‌(పెంపుడు కుక్క)తో కలిసి కృష్ణగిరి అనే గ్రామానికి వెళ్తాడు. అక్కడ పోస్ట్‌ మాస్టర్‌ రామారావు(అచ్చుత్‌ కుమార్‌) అనుమతితో పోస్ట్‌ మ్యాన్‌ అసిస్టెంట్‌గా జాయిన్‌ అవుతాడు. అదే గ్రామంలో ఉంటూ..రామారావు గారి అమ్మాయి సత్యభామ(నయని సారిక)తో ప్రేమలో పడతాడు.అనాథ అయిన వాసుదేవ్‌కి ఆ ఊరి ప్రజలే తన కుటుంబంగా బతుకుతుంటాడు. అయితే ఆ గ్రామంలో వరుసగా అమ్మాయిలు మిస్‌ అవుతుంటారు. వారిని కిడ్నాప్‌ చేసేదెవరు? కృష్ణగిరి గ్రామానికి చెందిన అమ్మాయిలే ఎందుకు మిస్‌ అవుతున్నారు? ఉత్తరాలు చదివే అలవాటు ఉన్న వాసుదేవ్‌కి తెలిసిన నిజమేంటి? వాసుదేవ్ ను ఓ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు ? లాలా, అబిద్‌ షేక్‌ ఎవరు? వారికి ఈ కథతో ఉన్న సంబంధం ఏంటి? చీకటి గదిలో బంధించిబడిన రాధ( తన్వి రామ్‌) ఎవరు? ఆమెకు వాసుదేవ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Haryana University Girlfriend Boys Hostel In Suitcase Viral Video9
(వీడియో): బాయ్స్‌ హస్టల్‌కు లవర్‌ను తీసుకెళ్లే ప్లాన్‌.. ప్రియుడు ఏం చేశాడంటే?

ఛండీగఢ్‌: ప్రస్తుత జనరేషన్‌లో యువత ప్రేమ పేరుతో రచ్చ చేస్తున్నారు. భయం, సిగ్గు లేకుండా పబ్లిక్‌గానే హద్దులు దాటుతున్నారు. ఇక, తాజాగా ఓ ప్రేమికుడు.. తన ప్రియురాలి కోసం పెద్ద సాహసమే చేశాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌ను హాస్టల్‌ రూమ్‌లోకి తీసుకెళ్లేందుకు కొత్త ​ప్లాన్‌ చేశాడు. ఓ సూటు కేసులో ఆమెను దాచిపెట్టి తన రూమ్‌కి తీసుకువెళ్దామనుకున్నాడు. ఇంతలో సెక్యూరిటీకి ొదొరికిపో​ాయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. హర్యానాలోని ఓపీ జిందాల్ యూనివర్సిటీకి చెందిన యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. వీరి మధ్య ప్రేమ ముదిరిపోవడంతో తన గర్ల్‌ఫ్రెండ్‌ను విడిచి ఉండలేక ఆమెను తనతో పాటు హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు ప్లాన్‌ చేసుకున్నాడు. దీంతో, ఆమెను ఓ పెద్ద సూట్ కేసులోప్యాక్ చేశాడు. సూట్ కేసులో ఆమెను తీసుకెళ్తూ హాస్టల్ లోకి ప్రవేశించాడు. అయితే, సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి లగేజ్ సూట్ కేసును చెక్ చేశారు.ఇంకేముంది.. ఆ సూట్‌కేస్‌ను తెర‌వ‌గానే లోప‌ల‌ అమ్మాయి కనిపించ‌డంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. వెంట‌నే సూట్‌కేస్‌లో నుంచి ఆ అమ్మాయిని బ‌య‌ట‌కు తీశారు. హస్టల్‌లో తోటి విద్యార్థులు ఈ ఘటన‌ను వీడియో తీశారు. ఆ త‌ర్వాత వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన యూనివర్సిటీ యాజమాన్యం వారిద్దరినీ సస్పెండ్ చేసినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. వయసు ప్రభావం ఎంతటి తప్పునైనా చేయిస్తుందని కొందరు.. ఇదేమి ప్రేమ పైత్యంరా బాబు అని మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.A boy tried sneaking his girlfriend into a boy's hostel in a suitcase.Gets caught.Location: OP Jindal University pic.twitter.com/Iyo6UPopfg— Squint Neon (@TheSquind) April 12, 2025

Anant Ambani Turns 30: Security guards, former nanny emotional wishes10
అనంత్‌ లవ్యూ, సర్‌ప్రైజ్‌ కేక్‌ కట్‌, వీడియో వైరల్‌

దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం రిలయన్స్‌ సామ్రాజ్యవారసుడు, బిలియనీర్ అనంత్‌ అంబానీ పుట్టిన రోజంటే ఓ రేంజ్‌ ఉండాలి. అతిరథమహారథులు, సెలబ్రిటీలు, విశిష్ట అతిథులు..ఇలా బోలెడంతా హంగామా, హడావిడి ఉండాలి అనుకోవడంలో, ఉండటంలో సందేహం లేదు. కానీ రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, నీతా, అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ ఈసారి ఇందుకు భిన్నంగా వ్యవహరించాడు. తన పుట్టిన రోజు వేడుకల్లో అభిమానులందర్నీ సర్‌ప్రైజ్‌ చేశాడు. దీనికి సంబందించిన వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఏమిటబ్బా అది? నెట్టింట వైరల్‌గా మారిన ఆ వీడియో విశేషాలేంటో తెలుసుకుందాం రండి! అనంత్ అంబానీ (Anant Ambani) ఇటీవల (ఏప్రిల్‌ 10న) తన 30వ పుట్టినరోజును జరుపుకున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ నుంచి ద్వారకాధీశ ఆలయానికి అనంత్ అంబానీ 170 కి.మీల పాదయాత్ర చేసిన మరీ తన బర్త్‌డే వేడుకలకు ఒక ఆధ్మాత్మిక వైభవాన్ని తీసుకొచ్చారు. తనకెంతో విశ్వాసమైన భద్రతా సిబ్బంది మధ్య కేక్‌ కట్‌ చేయడం విశేషంగా నిలిచింది. అనేకమంది నెటిజన్ల ప్రశంసలందుకుంది. ఆ క్షణం అనంత్‌ చూపించిన ఆప్యాయత, సర్‌ప్రైజ్ అందరినీ ఆకర్షించింది. నల్లటి పట్టు కుర్తా పైజామాలో మెరిసిపోతున్న బర్త్‌డే బోయ్‌కి పూల బొకేను అందించింది సెక్యూరిటీ టీం (Security guards). వారి అభినందనలు, కేరింతల మధ్య అనంత్‌ ఉత్సాహంగా కేక్‌ కట్‌ చేశారు. అంబానీ అప్‌డేట్స్ ఇన్‌స్టాగ్రామ్ దీనికి సంబంధించిన వీడియోను షేర్‌ చేసింది. భారతదేశంలోని అత్యంత ధనిక కుటుంబ వారసుడు ఇలా నిరాడంబరంగా పుట్టినరోజు జరుపుకోవడం నెటిజనులకు తెగ నచ్చేసింది. వీడియో అంబానీ కుటుంబానికి, అతని బాడీ గార్డులకు మధ్య ఉన్న అనుబంధం, ఆప్యాయతలకు నిదర్శనం అంటున్నారు అభిమానులు. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update)అనంత్ అంబానీ మాజీ నానీ భావోద్వేగ పుట్టినరోజు శుభాకాంక్షలుఅనంత్‌కి వచ్చిన అనేక పుట్టినరోజు సందేశాలలో మరో ప్రత్యేకమైంది ఉంది. అదేంటీ, అంటే తనకి చిన్నప్పుడు నానీగా పనిచేసిన లలితా డిసిల్వా, చిన్న అనంత్ సాంప్రదాయ దుస్తులు ధరించి, ఛాతీపై చిన్న భారతీయ జెండాను ధరించి ఉన్న అనంత్‌ చిన్ననాటి ఫోటోను పోస్ట్ చేశారామె. ఆ ఫోటోతో పాటు, లలిత ఒక భావోద్వేగ అభినందను రాసుకొచ్చారు.“నా అనంత్‌కి బోలెడన్ని పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు అతన్ని దీవించుగాక. నా అనంత్ ఇప్పుడు చాలా పెద్దవాడు. అతను జంతువులను అమితంగా ప్రేమించే తీరు నిజంగా మెచ్చుకోదగ్గది. జంతువుల భద్రత కోసం మీరు చేసిన కృషికి అనంత్, లవ్యూ...మీ రోజును ఆస్వాదించండి, అందమైన పుట్టినరోజు. శుభాకాంక్షలు’’

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement