రాష్ట్రంలో నగదు కొరత మరింత తీవ్రమైంది. రూ.5,000 కోట్ల విలువైన నోట్లను రాష్ట్రానికి పంపాలన్న ప్రభుత్వ విజ్ఞప్తికి ఇప్పటికీ ఆర్‌బీఐ నుంచి స్పందన లేకపోవటంతో నోట్ల కొరత ఉధృతమవుతోంది. రాష్ట్రంలో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర అధికారుల బృందం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. నగదు లేకపోవడంతో గురువారం గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో అనధికారికంగా చెల్లింపులు నిలిపివేశారు. కేవలం డిపాజిట్లు చేసుకోవడమే తప్ప.. ఇచ్చేందుకు డబ్బులు లేవంటూ ఖాతాదారులను తిప్పి పంపారు. దీంతో సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.