Common People
-
బడ్జెట్ పై సామాన్యుల డిమాండ్స్
-
అబూదాబి హిందూ ఆలయంలో సామాన్య భక్తుల సందడి!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో రాతితో నిర్మించిన మొదటి హిందూ దేవాలయాన్ని సామాన్యుల కోసం తెరిచారు. దీంతో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. అబుదాబిలోని ఈ హిందూ దేవాలయాన్ని ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దుబాయ్-అబుదాబి షేక్ జాయెద్ హైవేపై అల్ రహ్బా సమీపంలో 27 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.700 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయం కోసం భూమిని యూఏఈ ప్రభుత్వం విరాళంగా ఇచ్చింది. అబుదాబిలోని ఈ తొలి హిందూ దేవాలయం నాగర్ శైలిలో నిర్మితమయ్యింది. ఇదే శైలిలో అయోధ్యలోని రామాలయాన్ని నిర్మించారు. అబూదాబి ఆలయ వాలంటీర్ ఉమేష్ రాజా తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్‌లో 20 వేల టన్నులకు పైగా సున్నపురాళ్లను 700 కంటైనర్లలో అబుదాబికి తీసుకువచ్చారు. అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్)తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో.. ‘నిరీక్షణ ముగిసింది! అబుదాబి ఆలయం ఇప్పుడు సందర్శకులు , సామాన్య భక్తుల కోసం తెరిచారు. సోమవారం మినహా అన్ని రోజుల్లో ఈ ఆలయం ఉదయం 9 నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుందని’ పేర్కొంది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ‘ఆలయంలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి, ఈ ప్రాంగణాన్ని క్రమబద్ధంగా నిర్వహించడానికి భక్తులు ఆలయ మార్గదర్శకాలను పాటించడం అవసరం’ అని పేర్కొన్నారు. -
సామాన్యుడి కోసం ధర్మపీఠం
సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల తన ప్రమాణ స్వీకారంలో జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నిర్మొహమాటంగా చేసిన ఒక ప్రకటన దేశ ప్రజల్లో ఆశలు రేకెత్తించేదిగా ఉంది. పాలక విధానాల ఫలితంగా దేశం నేడు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా దేశ దిశాగతిని మార్చడానికి తోడ్పడగల నిర్ణయాలు చేసే అవకాశం తన స్థాయిలో ఉందని ఆ ప్రకటన ద్వారా ఆయన సూచనప్రాయమైన భరోసాను ఇచ్చారు. తన ఎదుగుదలలో గాంధీ, నెహ్రూల ప్రజాస్వామ్య భావాల ప్రభావమే గాక కారల్ మార్క్స్ రూపొందించిన ప్రపంచ ప్రసిద్ధ మేనిఫెస్టో ప్రభావం కూడా ఉండి ఉండవచ్చునని అనిపిస్తోంది! కనుకనే చంద్రచూడ్ ‘సామాన్య పౌరుల ప్రయోజనాల పరిరక్షణే’ తన ధ్యేయంగా బాహాటంగా ప్రకటించుకోగలిగారు. ‘‘పేదసాదల కోసం మా ప్రభుత్వం అన్నీ చేస్తోందని మన పాలకులు చెప్పుకోవచ్చు గాక. కానీ అలాంటి ‘కోతలు’ బ్రిటిష్ పాలకులు కూడా కోస్తూండేవారు. కానీ అసలు నిజం – పేదల ప్రయోజనాలు మాత్రం స్వతంత్ర భారత ప్రభుత్వం కూడా నెరవేర్చడం లేదు. ఈ సత్యాన్ని మన పాలకులు హుందాగా అణకువతో ఒప్పుకుని తీరాలి’’ – మహాత్మాగాంధీ (1947 డిసెంబర్) ‘‘వెయ్యిన్నొక్క కత్తుల కన్నా ప్రజాభిప్రాయం అనేది అత్యంత బలమైన ఆయుధం. హైందవాన్ని క్షుద్ర పూజాదికాలతో రక్షించు కోలేము. పరాయి పాలన నుంచి విముక్తి పొందిన దేశం మనది. ఈ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కంటికి పాపలా కాపాడుకోవాలి. ఎలా? నీలో మానవత్వం, ధైర్య సాహసాలు, నిరంతర జాగరూకత ఉన్నప్పుడే నీ ధర్మం నీవు నెరవేర్చగలుగుతావు. ఈ అప్రమత్తత మనలో కొరవడిన నాడు, మనం అత్యంత ప్రేమతో సాధించుకున్న స్వాతంత్య్రం కాస్తా చేజారిపోతుంది. కానీ దురదృష్టవశాత్తూ దేశంలో ప్రస్తుత అశాంతికి అంతటికీ కొందరు కారణమని వింటున్నాను. భారత దేశం హిందువులకు ఎంతగా పుట్టినిల్లో, ముస్లిములకూ అంతే పుట్టినిల్లు అని మరచిపోరాదు. అలాగే ఎవరికి వారు తమ మతమే గొప్పదనీ, అదే నిజమైనదనీ భావించడం తప్పు. ఈ భావననే చిన్నప్పటి నుంచీ పిల్లల్లో కూడా నూరిపోయడం వల్ల అదే నిజమన్న ధోరణిని వారిలో పెంచిన వారవుతున్నారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకునేదే నిజమైన ప్రజా ప్రభుత్వం. ప్రజల దారిద్య్రాన్ని, నిరుద్యోగ పరిస్థితిని పట్టించుకోని పాలకులు ఒక్క రోజు కూడా అధికారంలో ఉండటానికి వీలు లేదు’’. – మహాత్మాగాంధీ (అదే ఏడాది మరొక సందర్భంలో) ‘‘దేశం కోసమే నా తపన అంతా. 365 రోజులూ పని చేస్తున్నా. నేను పునాది రాయి వేసిన ప్రాజెక్టులను నేనే ప్రారంభిస్తున్నా. ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా అనేక ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం’’. – ప్రధాని నరేంద్రమోదీ (19.11.2022) ‘దేశం కోసమే నా తపనంతా..’ అనేంతగా ‘ఆత్మవిశ్వాసం’ కొంద రిలో పెల్లుబికి వస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సందర్భంగా ఆయన నిర్మొహమాటంగా చేసిన ఒక ప్రకటన దేశ ప్రజల్ని, ప్రజాస్వామ్యవాదుల్ని ఆలోచింపజేసేదిగా ఉంది. జస్టిస్ చంద్రచూడ్ 2024 నవంబర్ 10 వరకు ఆ పదవిలో ఉంటారు. ఆ లోపుగా.. దేశం నేడు పాలక విధానాల వల్ల ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా దేశ దిశాగతిని మార్చడానికి ఆయన తన స్థాయిలో తోడ్పడగల నిర్ణయాలు చేసే అవకాశం ఉంది. ఆయన ప్రకటన సూచన ప్రాయంగా అదే తెలియజేస్తోంది. రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన భరోసాను పాలకవర్గాలు హరించేస్తున్న సమయంలో చంద్ర చూడ్.. ‘ఆధార్’ పత్రం పేరిట పాలకులు పౌరహక్కుల్ని కత్తిరించడానికి చేస్తున్న ప్రయత్నాలను ఏనాడో ఎదుర్కొని అడ్డుకట్ట వేశారు. ‘ఆధార్’ కార్డు పేరిట పౌరులకు ప్రశ్నించే హక్కును హరించడం ఎలా సాధ్యమో ఆయన నిరూపించారు. ‘ఆధార్’ కార్డు చెల్లుతుందంటూ ధర్మాసనంలోని మిగతా నలుగురు సభ్యులు మెజారిటీతో నిర్ణయిం చగా, అది ఎలా రాజ్యాంగ విరుద్ధమో నిరూపించి నెగ్గుకొచ్చిన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్! కనుకనే ఇప్పుడు దేశ ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్ పదవీ స్వీకారం చేసిన రోజున కూడా ‘సామాన్యుల సేవే తన తొలి ప్రాధాన్యమని’ ప్రకటించారు. ఆ ప్రకట నలో ఆయన పాలకులకు చేదోడువాదోడుగా ఉపయోగపడే ‘సీల్డ్ కవర్’ తతంగానికి కోర్టులు స్వస్తి చెప్పించాలని కూడా సూచించారు. న్యాయ వ్యవస్థపై కూడా ప్రజల నమ్మకం సడలిపోతున్న సమయంలో ఆయన ఇస్తున్న భరోసా నమ్మకాన్ని కలిగిస్తోంది. చంద్రచూడ్ ఎదుగుదలలో గాంధీ, నెహ్రూల ప్రజాస్వామ్య భావాల ప్రభావమే గాక వర్గరహిత సామాజిక వ్యవస్థ ప్రతిష్ఠాపన లక్ష్యంగా ప్రపంచ శ్రమజీవుల ప్రయోజనాల రక్షణకు కారల్ మార్క్స్ రూపొందించిన ప్రపంచ ప్రసిద్ధ మేనిఫెస్టో ప్రభావం కూడా ఉండి ఉండవచ్చు! కనుకనే చంద్రచూడ్ ‘ప్రతి అంశంలోనూ సామాన్య పౌరుల ప్రయోజనాల పరిరక్షణే’ తన ధ్యేయంగా బాహాటంగా ప్రక టించుకోగలిగారు. ఎలాగంటే ధనికవర్గంలో జన్మించిన ఫ్రెంచి మహా రచయిత బాల్జాక్ ఫ్రెంచి సామాజిక పరిణామ క్రమాన్నే సామాన్య ప్రజల ప్రయోజనాల రక్షణ కోసం మార్చేసిన వాడు. అందుకే మార్క్స్ అతణ్ణి సమాజ వాస్తవిక పరిస్థితులకు అద్దంపట్టిన మహా రచయితగా వర్ణించాడు. ధనిక, పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలు క్రమంగా ఏ దారుణ పరిస్థితుల వైపుగా సామాజిక వ్యవస్థల్ని నడిపిస్తాయో తన రచనల ద్వారా ధనికుడైన బాల్జాక్ వర్ణించడాన్ని మార్క్స్ ప్రశంసించాడు. అంతేగాదు, ధనిక వర్గ నాగరికతకూ, దాని అధీనంలో జరిగే నేరాలకూ మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయో కూడా మార్క్స్ అనేక సదృశాలతో నిరూపించాడు. అలాంటి ధనిక వర్గ సమాజాల్లో ‘ఎవరికివారే యమునాతీరే’గా ప్రజావసరాలతో నిమిత్తం లేకుండా జరిగే వస్తూత్పత్తి లాగానే నేరగాళ్లు వరుసగా నేరాలు సృష్టిస్తుంటారు. వాటితోపాటు నేర చట్టానికి దోహదం చేస్తారు. ఈ క్రమంలోనే నేర చట్టాన్ని గురించి ప్రొఫెసర్ గారు ఉపన్యాసాలు దంచేయడానికి ముందుకొస్తారు. ఆ తర్వాత ఆ ఉపన్యాసాలన్నింటినీ సంకలనం చేసుకుని ఓ గ్రంథం సిద్ధం చేసుకుని దాన్ని జనరల్ మార్కెట్లోకి ఓ ప్రత్యేక వస్తువు(కమాడిటీ)గా విడుదల చేస్తాడు. అమ్మి సొమ్ము చేసుకుంటాడు! అంతేనా, అలాంటి సమాజంలోని నేరగాడు మొత్తం పోలీస్ వ్యవస్థ సృష్టికి, తద్వారా క్రిమినల్ జస్టిస్, ఆ పిమ్మట జడ్జీలు, ఉరి తీసే తలార్లు, ఆ పిమ్మట జ్యూరీ వ్యవస్థ వగైరాల ఏర్పాటుకు కారణమౌతాడు. అటుపైన ‘తాటి తోనే దబ్బనం’ అన్నట్టుగా చిత్రహింసలు మొదలై, ఆ హింసాకాండ నిర్వహణకు గానూ అందుకు తగిన వృత్తి నిపుణుల సృష్టి అవసరం అవుతుంది (ఇలాంటివారు అవసరం అవబట్టే రా.వి. శాస్త్రి ‘సారో కథలు’, ‘సారా కథలూ’ రాయాల్సి వచ్చింది). అందుకే మార్క్స్ అంటాడు: ‘‘శ్రామిక వర్గాలు, సంపన్న వర్గాలు భిన్న ధ్రువాలు. రెండూ ప్రైవేట్ ఆస్తుల సృష్టి కారకులే!’’ అని. అందువల్ల ఈ రెండు ఒకే నాణేనికి రెండు ముఖాలని సరిపెట్టుకుంటే చాలదు. ప్రైవేట్ ఆస్తి ప్రత్యేక సంపదగా తనకు తాను రక్షించుకొనక తప్పదు, అలాగే శ్రామిక జీవులూ తమను తాము రక్షించుకొనక తప్పదు. కనుకనే వారిది అమానుషమైన దుఃస్థితి. ఈ స్థితిలోనే ప్రైవేట్ ఆస్తిపరుడు స్వార్థపరుడు అవుతాడు, కాగా తన అమానుష మైన దుఃస్థితిని వదిలించు కోవాలనుకున్న శ్రమజీవి సమాజానికి శత్రువుగా కన్పిస్తాడు. కనుకనే శ్రమజీవిని దోచుకోవడంపై ఆధార పడిన ప్రైవేట్ ఆస్తి రద్దు అయితేనే శ్రమజీవులకు బతుకు. అయితే అసమ సమాజ వ్యవస్థలోని అమానుష జీవన పరిస్థితులు రద్దు కాకుండా మాత్రం శ్రామికులకు శాశ్వత విమోచనం దుర్లభమని మార్క్స్–ఎంగెల్స్‌లు నిరూపించారు (కలెక్టెడ్ వర్క్స్: వాల్యూమ్ 4). అందువల్ల జస్టిస్ చంద్రచూడ్‌ను ‘న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకం కొనసాగేలా మీరు ఏం చర్యలు తీసుకొంటారన్న’ ప్రశ్నకు ‘చేతల్లోనే చూపిస్తానని’ భరోసా ఇచ్చారు. అంతవరకూ ప్రజల అస మ్మతిని ప్రజాస్వామ్యం మనుగడకు రక్షణ కవచంగా ప్రధాన న్యాయ మూర్తి సుప్రీంకోర్టును నిరంతరం తీర్చిదిద్దగలరని ఆశిద్దాం. సామా న్యుడికే తన ‘పెద్ద పీట’ అని చాటిన చంద్రచూడ్ దేశ దిశాగతిని తీర్చి దిద్దేందుకు తనకు సంక్రమించిన అనితరసాధ్యమైన అవకాశాన్ని 2024 ఎన్నికల సంవత్సరాని కన్నా ముందస్తుగానే తగినట్టుగా ఉపయోగించుకోగలరని ఆశిద్దాం! ఏబీకే ప్రసాద్,సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
కరోనా పరీక్షలు @ పలుకుబడి
► హైదరాబాద్‌లో ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతడు నివసిస్తున్న అపార్టుమెంట్లో ఉండే ఓ వ్యక్తి తనకు కూడా వైరస్ సోకిందేమోనని సందేహించాడు. తనకు కూడా పరీక్షలు చేయాలంటూ దగ్గరలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ ఉన్న సిబ్బంది అతడికి పరీక్షలు నిర్వహించేందుకు నిరాకరించారు. ఏవైనా లక్షణాలు ఉంటేనే రావాలని తిప్పి పంపారు. ఇప్పటికీ అతడిలో కరోనా వైరస్ గిలి అలానే ఉండిపోయింది. ► ఓ మీడియా సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి బంధువుకు పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆ ఉద్యోగీ పరీక్షలకు వెళ్లి భంగపడ్డాడు. మరో సంస్థకు చెందిన వ్యక్తి దగ్గు, గొంతు నొప్పి అంటూ వెళ్తే యాంటీ బయాటిక్స్ వేసుకుని అప్పటికీ తగ్గకపోతే 10 రోజులు ఆగి రావాలని ఉచిత సలహా ఇచ్చి పంపిన వైద్య సిబ్బంది పరీక్షలే చేయలేదు. సాక్షి, హైదరాబాద్ : ..ఈ ఉదాహరణలను బట్టి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెడుతోం దని అర్థమవుతోంది. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. అవసరం అనుకుని పరీక్షల కోసం వస్తున్న వారికి పరీక్షలు చేయకుండా నిరాకరిస్తుండటం ప్రజల్లో విమర్శలకు తావిస్తోంది. పరీక్షలు చేసేం దుకు ప్రైవేట్ ల్యాబ్‌లకు ప్రభుత్వ అనుమతి లేకపోవడం, ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే తిప్పి పంపిస్తుండటంతో సాధారణ ప్రజానీకానికి పాలు పోవట్లేదు. అదే సమయంలో పలుకుబడి ఉన్న వారికి, కొందరు ప్రజాప్రతినిధులకు అడిగిన వెంటనే పరీక్షలు చేస్తుండటంతో సామాన్యులను పట్టించుకోవట్లేదనే చర్చ జరుగుతోంది. ఈ పరీక్షల విషయంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది. ► గాంధీ, ప్రభుత్వ, ప్రైవేటు పరీక్ష కేంద్రాలకు రోజూ టెస్టుల కోసం వస్తున్న వారు - 2,000 రోజూ వేల మంది.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు జరుపుతున్న కరోనా టెస్టుల సంఖ్యతో పోలిస్తే మన రాష్ట్రంలో జరుగుతున్న టెస్టుల సంఖ్య చాలా తక్కువ అనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో అటు కోర్టులు, ఇటు కేంద్రం కూడా రాష్ట్ర వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రభుత్వం మాత్రం అనవసరంగా టెస్టులు చేయొద్దనే విధానంతో ముందుకెళ్తోంది. ఐసీఎంఆర్ కూడా రాష్ట్రంలో వైరస్ కమ్యూనిటీ స్ప్రెడ్ కాలేదని, ప్రమాదం లేదని తేల్చింది. రాష్ట్రంలో ఆర్–నాట్ శాతం కూడా 180 నుంచి 110కి తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. అంతవరకు బాగానే ఉంది.. కానీ అవసరం అనుకున్న వారికి టెస్టులు చేయకపోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. అడిగిన అందరికీ కాకపోయినా అవసరం అనుకున్న వారికి, కరోనా సోకిన వారితో సహజీవనం చేయాల్సిన వారికి పరీక్షలు చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. కాగా, తమకు పరీక్షలు చేయాలంటూ రోజూ 2 వేల మందికి పైగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని అంచనా. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పరీక్షలు చేసేందుకు తమకు అనుమతి లేదంటూ ప్రైవేట్ వర్గాలు తిప్పి పంపడం, ప్రభుత్వ వర్గాలు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం, ఐసొలేషన్‌లో ఉండాలంటూ ఉచిత సలహాలు ఇస్తుండటంతో వారికి ఏం చేయాలో పాలు పోవట్లేదు. వీరికి ఇలా.. వారికి అలా.. సామాన్యులను వెనక్కి పంపిస్తున్న ప్రభుత్వ వైద్య వర్గాలు.. పలుకుబడి ఉన్న వారికి మాత్రం అడిగిందే తడవుగా పరీక్షలు చేయడం మరిన్ని విమర్శలకు కారణం అవుతోంది. ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులకు ఒక విధానం, మాకు మరో విధానమా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయడం సాధ్యం కాకపోయినా నిజంగా అవసరమైన వారిని వెనక్కి పంపొద్దని పలువురు కోరుతున్నారు. కరోనా వ్యాధిగ్రస్తులతో సహజీవనం చేయడం కన్నా.. తమకు వైరస్ ఉందో లేదో తెలియకుండా జీవించడం నరకాన్ని తలపిస్తోందని, కుటుంబసభ్యులతో మానసిక ప్రశాంతత ఉండకుండా పోతోందని వాపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే. ప్రైవేటు ల్యాబ్స్‌కు అనుమతిస్తే సరి! ప్రైవేటు ల్యాబ్స్‌లో కరోనా టెస్టులు చేసేందుకు ఐసీఎంఆర్ కొన్ని ల్యాబ్‌లకు అనుమతి ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటిల్లో టెస్టులకు అనుమతి ఇవ్వలేదు. ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతి ఇస్తే సమస్యలు వస్తాయని వాదిస్తోంది. ఇప్పటికే ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అనుమతించగా సమస్యలు వస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టానుసారంగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటం, కరోనా సోకిన వారితో సహజీవనం చేసే వారికి పరీక్షలు నిర్వహించేందుకు ప్రైవేటు ల్యాబ్స్‌కు పరీక్షలు చేసే అవకాశం ఇస్తేనే ఉపయోగమన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రై వేటు ల్యాబ్‌లు పరీక్షలకు ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేయకుండా ప్రభుత్వమే ఓ విధానం రూపొందించి, దాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ పరీక్షలు నిర్వహించేలా అనుమతిస్తే ఉపయోగకరంగా ఉంటుందని, అనుమానం ఉన్నవారు పరీక్షలు చేయించుకునే అవకాశం ఉంటుందన్న వాదనలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. -
సామాన్యుల సహాయాలు
కోవిడ్ 19 దేశం మొత్తాన్ని లాక్డౌన్ చేసేసింది. ఉపాధి పోతోంది. తిండి గింజలు కరవవుతున్నాయి. ఈ గడ్డుకాలంలో నిరుపేదలను, వలస కూలీలను, మూగ జీవాలను ఆదుకునేందుకు ఎందరో సామాన్యులు శక్తికి మించిన సహాయంతో ముందుకు వస్తున్నారు. అలాంటి యోధుల్ని మనం అభినందించి తీరవలసిన సమయం కూడా ఇది. పంచడానికే పంటంతా! యదు ఎస్. బాబు (25) కేరళ రైతు. తన ఎకరన్నర పొలంలో పండుతున్న కూరగాయలను ఈ విపత్కాలంలో రోజువారీ కూలీలకు ఉచితంగా పంచిపెడుతున్నారు. ‘‘కష్టం వచ్చినప్పుడు మనిషిని మనిషే కదా అదుకోవాలి’’ అంటారు యదు బాబు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న ఈ యువకుడి దగ్గరికి రెట్టింపు ధరకు పంటను కొనేందుకు చాలామందే వస్తుంటారు. అయితే ఈసారి మాత్రం తన సాగునంతా అవసరంలో ఉన్నవారికి ఉచితంగా పంపిణీ చేయాలని బాబు నిర్ణయించుకున్నారు. ఇందుకు ఒక ఎన్జీవో సహకారం తీసుకున్నారు. బీన్స్, బీట్రూట్, ఆనప, వంకాయ వంటి కూరల్ని వారానికి వంద కిలోల దాకా పండిస్తున్నారు బాబు. అంబులెన్స్‌గా సొంత కారు ఉత్తరాఖండ్ దేవప్రయాగకు చెందిన 32 సంవత్సరాల గణేశ్ భట్ తన కారును అంబులెన్స్‌గా మార్చారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో 108 సర్వీసుపై ఒత్తిడి పెరగడంతో సమయానికి వారు స్పందించలేక గర్భిణులు, వయోవృద్ధులు, ఇతర ప్రాణాంతక అవసరాలలో ఉన్నవారు అవస్థలు పడుతున్నారు. అందువల్ల నా కారును అటువంటి వారి కోసం ఉపయోగిస్తున్నాను’’ అంటున్న గణేశ్ ఈ లాక్డౌన్లో ఇప్పటివరకు ఇరవై మందికి పైగా అత్యవసర స్థితిలో సాయం చేశారు. తొలిసారి ఈ ఏడాది మార్చి 21న నొప్పులు పడుతున్న ఒక గర్భిణినిని ఆసుపత్రికి చేర్చడంతో ఆయన సేవలు మొదలయ్యాయి. మూగ ప్రాణుల కోసం లాక్డౌన్ కారణంగా రెస్టారెంట్లు, ఆఫీసు క్యాంటీన్లు పూర్తిగా మూతబడటంతో మిగులు పదార్థాలు ఉండట్లేదు. ఆ కారణంగా జంతువులకు తిండి దొరకట్లేదు. వీధుల్లో కుక్కలు, ఆవులు, గేదెలు.. అన్నీ డొక్కలెండి ఉంటున్నాయి. వాటిని సంరక్షించటం కోసం నవీ ముంబైలో ఉంటున్న కరిష్మా ఛటర్జీ అనే గృహిణి ముందుకు వచ్చారు. ‘‘మనమంతా ముందుజాగ్రత్తగా సరుకులు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాం. కాని జంతువులకు అది తెలియదు కదా..’ అంటున్న కరిష్మా ప్రతిరోజూ సుమారు పదిహేను కుక్కలు, పిల్లులకు ఆహారం అందిస్తున్నారు. ఆమె మాత్రమే కాదు. 21 సంవత్సరాల సగుణ్ భతీజ్వాలే (వెటర్నరీ డాక్టరుగా ఆఖరి సంవత్సరం చదువుతున్నారు) పక్షులకు, జంతువులకు, చెట్లకు సేవ చేస్తున్నారు. తన సన్నిహితులు, స్నేహితులు కూడా ఇందులో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. – వైజయంతి పురాణపండ -
అమాయకుడిపై ఖాకీ ప్రతాపం
సాక్షి, పుట్లూరు: అమాయకుడిపై పోలీసు అధికారి ప్రతాపం చూపిన ఘటన వెలుగు చూసింది. పోలీసుస్టేషన్లో అదుపులో ఉన్న యువకులను కిటికీలోంచి తొంగి చూశాడన్న నెపంతో లోనికి పిలిచి ముఖంపై బూటు కాలితో మూడుసార్లు తన్నడంతో బాధితుడు అవమానభారంతో కన్నీటిపర్యంతమయ్యాడు. అకారణంగా తనపై అమానుషంగా ప్రవర్తించిన పోలీసుపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నాడు. వివరాల్లోకెళ్తే... పుట్లూరు మండలం అరకటివేముల ఎస్సీ కాలనీకి చెందిన ఓ మహిళ తనపై శుక్రవారం రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేశారని శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కాలనీకి చెందిన ఇద్దరు యువకులను పోలీసులు విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకొచ్చారు. తొంగి చూడటమేమైనా నేరమా..? దాడి ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను విచారణ నిమిత్తం తీసుకొచ్చారని తెలిసి అదే కాలనీకి చెందిన నాగముని అనే దళితుడు స్టేషన్ వద్దకు వచ్చాడు. యువకులను ఉంచిన గదిలోకి నేరుగా వెళ్లకుండా కిటికీలో నుంచి చూస్తున్న నాగమునిని పోలీసులు గమనించి.. లోనికి పిలిపించారు. అనుమతి లేకుండా కిటికీలోంచి ఎందుకు చూస్తున్నావని ప్రశ్నించగా.. తమ గ్రామస్తులను చూడటానికి వచ్చానని చెప్పాడు. అంతే.. ఒక్కసారిగా అతడిపై విరుచుకుపడ్డారు. మద్యం తాగి లోపలికి వస్తావా అంటూ బూటుకాలితో నాగముని ముఖంపై తన్నారు. అలా మూడుసార్లు తన్నారు. తనేమీ నిందితుడు కాకపోయినా.. దురుసుగా మాట్లాడకపోయినా తన్నడాన్ని నాగముని అవమానంగా భావించాడు. తన ముఖంపై పడిన బూటు ముద్రను విలేకరులకు చూపుతూ బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. తనపై అకారణంగా దాడిచేసిన పోలీసుపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరాడు. డీఎస్పీ విచారణ అమాయకుడిపై పోలీసు బూటుకాలితో తన్నిన ఘటన గురించి మీడియాలో రావడంతో తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు శనివారం సాయంత్రం అరకటివేముల ఎస్సీ కాలనీకి వెళ్లి విచారణ చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా పుట్లూరు పోలీసుస్టేషన్‌కు చేరుకుని పోలీసు సిబ్బందితో సమావేశమై ఘటనకు సంబంధించి ఆరా తీశారు. -
సాంకేతిక పరిజ్ఞానం సామాన్యులకు చేరితేనే నిజమైన విజయం
-
ఆధార్‌పై అనుమానాలొద్దు!
న్యూఢిల్లీ: కేవలం రూ.500కే దేశంలో ఎవరి ఆధార్ సమాచారమైనా ఆన్లైన్లో దొరుకుతోందంటూ ‘ద ట్రిబ్యూన్’ పత్రిక ఇటీవల బయటపెట్టి సంచలనం సృష్టించింది. అలాగే కొన్ని ప్రభుత్వ విభాగాల వెబ్సైట్ల నుంచే 13 కోట్ల మంది ఆధార్ సమాచారం బట్టబయలైందంటూ కూడా గతంలో వార్తలొచ్చాయి. అసలు ఆధార్ రాజ్యాంగ బద్ధమేనా కాదా అనే దానిపై సుప్రీంకోర్టు ఐదురుగు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం నుంచి విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆధార్‌పై సామాన్యుల సందేహాలను నివృత్తి చేసేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) 11 ‘తరచుగా అడిగే ప్రశ్నలు’ (ఎఫ్ఏక్యూ), వాటికి సమాధానాలను విడుదల చేసింది. ప్రశ్న: నా ఆధార్ సమాచారంలో బయోమెట్రిక్స్, బ్యాంక్ ఖాతా, పాన్, మొబైల్, ఈ–మెయిల్ తదితర వివరాలన్నీ ఉన్నాయి? నేను ఏమేం చేస్తానో యూఐడీఏఐ గమనిస్తూ ఉంటుందా? జవాబు: తప్పు. యూఐడీఏఐ దగ్గర బ్యాంకు ఖాతాలు, పాన్, మ్యూచ్‌వల్ ఫండ్లలో పెట్టుబడులు, ఆస్తులు, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సభ్యులు, కులం తదితర వివరాలేవీ ఉండవు. ప్రశ్న: కానీ నాకు బ్యాంక్ ఖాతా, పాన్ కార్డు, షేర్ మార్కెట్, మ్యూచ్‌వల్ ఫండ్లలో పెట్టుబడులు, మొబైల్ కనెక్షన్..ఇలా ఏది కావాలన్నా ఆధార్ అంటున్నారుగా. ఆయా సంస్థలకు నా ఆధార్ నంబర్ ఇస్తే ఆ సమాచారం యూఐడీఏఐకి రాదా? జవాబు: కచ్చితంగా రాదు. మీరు ఆయా సంస్థలకు ఆధార్ సంఖ్య ఇచ్చినప్పుడు అవి మీరు వారికిస్తున్న బయోమెట్రిక్స్, మీ పేరు తదితరాలను మాత్రమే యూఐడీఏఐకి ధ్రువీకరణ కోసం పంపుతాయి. ఇతర వివరాలేవీ రావు. ఆధార్ నంబర్‌తో వేలిముద్రలు, పేరు సరిపోలితే ధ్రువీకరణ అయిపోతుంది. ప్రశ్న: ఎవరికైనా నా ఆధార్ నంబర్ తెలిస్తే, వాళ్లు నా బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేయగలరు కదా? జవాబు: పూర్తిగా అవాస్తవం. కేవలం మీ ఏటీఎం కార్డు నంబర్ తెలిసినంత మాత్రాన ఎవరైనా మీ ఖాతాలోని డబ్బును ఏటీఎం ద్వారా డ్రా చేయగలరా? అలాగే ఇది కూడా అసాధ్యం. ప్రశ్న: బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానించుకోవాలని ఎందుకు చెబుతున్నారు? జవాబు: మీ భద్రత కోసమే. నేరస్తులు, అవినీతిపరుల బ్యాంకు ఖాతాలను తొలగించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఆధార్‌తో అనుసంధానమై ఉన్న ఖాతాల నుంచి ఎవరైనా అక్రమంగా డబ్బు తీస్తే వారి గురించి అన్ని వివరాలు ఇట్టే తెలిసిపోతాయి. కాబట్టి మీ ఖాతాలకు మరింత భద్రత సమకూరుతుంది. ప్రశ్న: మరి మొబైల్ నంబర్లకు ఆధార్ ఎందుకు? జవాబు: ఇది కూడా మీ భద్రత కోసమే. దేశ భద్రత కోసం కూడా. నేరస్తులు, మోసగాళ్లు వినియోగిస్తున్న సిమ్ కనెక్షన్లను తొలగించడం కోసమే అనుసంధానం చేసుకోమంటున్నాం. చాలాసార్లు నేరగాళ్లు నకిలీ ధ్రువపత్రాలతో సిమ్‌లు సంపాదించి నేరాలకు పాల్పడుతున్నారు. ఆధార్‌తో అనుసంధానించడం వల్ల దీన్ని నివారించవచ్చు. ప్రశ్న: మొబైల్ కంపెనీలు నా వేలిముద్రలను సేవ్ చేసుకుని తర్వాత వాటిని వేరే పనుల కోసం వాడుకునే అవకాశం ఉంది కదా! జవాబు: ఆధార్ ధ్రువీకరణ సమయంలో మీరిచ్చే వేలిముద్రలను మొబైల్ కంపెనీలే కాదు, ఎవ్వరూ సేవ్ చేసుకోలేరు. సెన్సర్‌పై మీ వేలిముద్ర పెట్టగానే, ఆ సమాచారం ఎన్‌క్రిప్ట్ అయ్యి, సరిపోల్చడం కోసం యూఐడీఏఐకి వస్తుంది. ఆధార్ చట్టం–2016 ప్రకారం ఏవేనీ సంస్థలు మీ వేలిముద్రలను సేవ్ చేయడం శిక్షార్హమైన నేరం. ప్రశ్న: ఎన్ఆర్ఐలకు కూడా ఆధార్ ఉండాల్సిందేనా? జవాబు: లేదు. ఆధార్‌లో భారత్‌లో నివసిస్తున్న వారికి మాత్రమే. ఆధార్‌ను పొందేందుకు ఎన్ఆర్ఐలు అసలు అర్హులే కాదు. ఎన్ఆర్ఐలకు ఆధార్ లేకపోయినా అన్ని రకాల సేవలూ లభిస్తాయి. ప్రశ్న: పేదవారికి అత్యవసరమైన పింఛను, రేషన్ సరకులు తదితరాలను కూడా ఆధార్ లేని కారణంగా నిలిపేస్తున్నారు కదా? జవాబు: కచ్చితంగా లేదు. ఎవరైనా ఆధార్ కార్డు ఇంకా తీసుకోకపోతే, అలాంటి వారికి ఆధార్ సంఖ్య వచ్చే వరకు ఇతర గుర్తింపు కార్డుల ఆధారంగానే సంక్షేమ పథకాల ప్రయోజనాలు కల్పించాల్సిందేనని చట్టంలో స్పష్టంగా ఉంది. ఒకవేళ ప్రభుత్వ సిబ్బంది ఎవరైనా ఆధార్ కచ్చితంగా కావాల్సిందేనని ఇబ్బంది పెడుతుంటే అలాంటి వారిపై పై అధికారులకు ఫిర్యాదు చేయండి. ప్రశ్న: కొన్ని సంస్థలు ఈ–ఆధార్‌ను ఒప్పుకోవడం లేదు. ఒరిజినల్ ఆధార్ కార్డు కావాల్సిందేనని అవి పట్టుబడుతున్నాయి. ఎందుకు? జవాబు: ఈ–ఆధార్ కూడా ఒరిజినల్ ఆధార్‌తో సమానమే. రెండింటిలో ఏదైనా ఒకటే. అన్ని సంస్థలూ రెండింటిలో దేన్నయినా అంగీకరించాల్సిందే. ఇంకా మాట్లాడితే ఒరిజినల్ ఆధార్ కన్నా ఈ–ఆధార్‌కే వారు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఎవరైనా ఈ–ఆధార్‌ను ఒప్పుకోకపోతే వెంటనే పై అధికారులకు ఫిర్యాదు చేయండి. ప్రశ్న: సామాన్యులకు ఆధార్‌తో ప్రయోజనమేంటి? జవాబు: ఆధార్ అంటే 119 కోట్ల మంది భారతీయుల విశ్వసనీయమైన గుర్తింపు. ఇతర ఏ గుర్తింపు కార్డుకూ లేని విశ్వసనీయత ఆధార్‌కు ఉంది. పల్లెల నుంచి పట్టణాల్లోని మురికి వాడల వరకు ఎవ్వరినైనా అడగండి వారు ఆధార్‌ను ఎలా ఉపయోగిస్తున్నారో. బ్యాంకు ఖాతాకు, ఉద్యోగానికి, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేరుగా బ్యాంకు ఖాతాల్లో పొందేందుకు, రైళ్లలో ప్రయాణానికి ఇలా దేనికయినా సరే, గుర్తింపు కార్డుగా మొదటి ప్రాధాన్యత ఉన్నది ఆధార్‌కే. ప్రశ్న: ఆధార్ సమాచారం లీక్ అయ్యిందంటూ మీడియాలో వార్తలు చూశాం. నిజం కాదంటారా? జవాబు: ఆధార్ గత ఏడేళ్ల నుంచి ఉంది. ఎప్పుడూ సమాచారం లీక్ కాలేదు. ఆధార్ కార్డుదారుల సమాచారం భద్రంగా, సురక్షితంగాఉంది. ఆధార్ సమాచారం లీకయిందంటూ వచ్చిన వార్తలు అవాస్తవం. మేం ఆధార్ సమాచార భద్రత కోసం అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నాం. యూఐడీఏఐ -
టికెట్ల ధరలు టూమచ్ గురూ..!
కలల మెట్రోలో హాయిగా ప్రయాణించాలని ఆశిస్తున్న సిటీజనులకు చార్జీలు కొంత నిరాశ కలిగించాయి. ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లలో కంటే మెట్రో రైళ్లలో జర్నీ కాస్త భారమే. కనీస చార్జీ రూ.10, గరిష్టంగా రూ.60 చార్జీలు ప్రకటించడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆల్పాదాయ, మధ్యతరగతి ఉద్యోగులు, చిరు వ్యాపారులు పెదవి విరుస్తున్నారు. మరోవైపు రైళ్ల వేళలు కూడా మార్చాలని కోరుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో : మెట్రోరైలు చార్జీలు గ్రేటర్లో సగటుజీవికి భారంగానే పరిణమించనున్నాయి. గ్రేటర్ పరిధిలో 29 ఆర్టీసీ డిపోల్లోని 3850 ఆర్టీసీ బస్సుల్లో నిత్యం 33 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. వీరందరూ కలల మెట్రో జర్నీ చేయాలనుకుంటే వారి జేబుకు చిల్లు తథ్యం అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఉదాహరణకు తొలిదశ మెట్రో మార్గాలను పరిగణనలోకి తీసుకుంటే నాగోల్–అమీర్‌పేట్ (17కి.మీ)వరకు ఆర్టీసీ ఆర్డినరీ బస్సుల్లో ప్రయాణిస్తే రూ.17 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదే మెట్రో రైలులో అయితే రూ.45 తథ్యం. ఇక మియాపూర్–అమీర్‌పేట్(13కి.మీ)మార్గంలో ప్రయాణించేవారు ఆర్టీసీ ఆర్డినరీ బస్సులో బయలుదేరి వెళితే రూ.15 చార్జీ చెల్లించాలి. అదే మెట్రోరైలులో అయితే రూ.40 చెల్లించాలి. ఇక ఎంఎంటీఎస్ రైలు చార్జీలతో పోల్చినా మెట్రో చార్జీలు సామాన్యునికి గుదిబండలానే మారాయి. ఎంఎంటీఎస్ రైళ్లలో కనీస చార్జీ రూ.5 ..గరిష్టం రూ.10 కావడం గమనార్హం. అదే మెట్రోలో కనీసం రూ.10..గరిష్టంగా రూ.60 చెల్లించాల్సి రావడం సామాన్యులపై భారం పడుతుందని అల్పాదాయ, మద్యాదాయ, వేతనజీవులు ఆందోళన చెందుతున్నారు. ఏసీ బస్సు కంటే తక్కువ.. ఆర్టీసీ ఏసీ బస్సు కంటే..మెట్రో జర్నీ చవకే కాదు..సమయం ఆదా కూడా. ఇదెలా అంటారా..మీరు నాగోల్ నుంచి 17 కి.మీ దూరంలో ఉన్న అమీర్‌పేట్‌కు ఆర్టీసీ ఏసీ బస్సులో ప్రయాణిస్తే రూ.64 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణానికి సుమారు 50 నుంచి 60 నిమిషాల సమయం పడుతుంది. అదే మెట్రోరైలులో అయితే రూ.45 ఛార్జీ చెల్లించి 25 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు. ఇక మియాపూర్–అమీర్‌పేట్(13కి.మీ)మార్గంలో ఏసీ బస్సులో రూ.48 చెల్లించి 45 నిమిషాల్లో గమ్యం చేరవచ్చు అదే...మెట్రోరైలులో కేవలం రూ.40 మాత్రమే చెల్లించి 20 నిమిషాల్లో గమ్యమస్థానం చేరుకునే అవకాశం ఉండడం విశేషం. భారీ వర్షం కురిసి ట్రాఫిక్ స్తంభిస్తే ఈ మార్గాల్లో బస్సు ప్రయాణానికి రెండు గంటలకు పైగా సమయం పడుతుంది. కాగా మెట్రో ప్రయాణ చార్జీలను ఎట్టకేలకు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ప్రకటించిన నేపథ్యంలో నగరంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మెట్రో జర్నీ ఎవరికి ఉపయోగం.. రోజువారీగా ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే వారికి మెట్రో జర్నీ చవక ప్రయాణమే కాదు..సమయం ఆదా అవుతుంది. అయితే ప్రస్తుతానికి నాగోల్–అమీర్‌పేట్, మియాపూర్–అమీర్‌పేట్ మార్గాల్లోనే మెట్రో అందుబాటులో ఉన్న నేపథ్యంలో మిగతా రూట్లలో తిరిగే వారు యథావిధిగా ఆటోలు, క్యాబ్‌లు ఆశ్రయించాల్సిందే. కాలుష్యం, కుదుపులు లేనిప్రయాణం, ట్రాఫికర్ లేకపోవడం మెట్రో జర్నీ ప్లస్ పాయింట్లుగా చెప్పొచ్చు. రాయితీ పాస్‌లు లేనట్టే... ఇక ఆర్టీసీ బస్సుల్లో స్టూడెంట్స్, ఎన్జీఓ, వికలాంగులు, జర్నలిస్టులకు రాయితీ పాస్‌ల విధానాన్ని అమలుచేస్తున్నారు. అయితే మెట్రో రైళ్లలో స్మార్ట్‌కార్డ్, టోకెన్, టిక్కెట్ మినహా ఎలాంటి రాయితీ పాస్‌లు అమలులో లేవు. దీనిపై ఆయా వర్గాలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. పనివేళలపై అసంతృప్తి... ఇక మెట్రో రైలు సర్వీసులు తొలి మూడునెలలు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకే నడపనున్నారు. ఆతరవాత ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకే నడపనున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో జర్నీ ఎవరికి ఉపయోగం అన్నది ఆసక్తికరంగా మారింది. విద్యార్థులు: ఆర్టీసీ జారీచేసే స్టూడెంట్ బస్‌పాస్‌లున్నవారు గ్రేటర్ పరిధిలో సుమారు ఏడు లక్షల మంది ఉన్నారు. వీరు నెలకు రూ.130 చెల్లించి బస్‌పాస్ కొనుగోలు చేస్తారు. ప్రత్యేక సందర్భాల్లో మినహా వీరంతా మెట్రో రైలులో రోజువారీగా ప్రయాణించే అవకాశం ఉండదు. ప్రభుత్వ ఉద్యోగులు: ప్రభుత్వం మంజూరు చేసే ఎన్జీఓ పాస్ ఉన్నవారు నగరంలో సుమారు 2 లక్షలమంది ఉన్నారు. వీరు నెలకు రూ.750 చెల్లించి పాస్ కొనుగోలు చేస్తారు. వీరు కూడా మెట్రో రైళ్లలో నిత్యం ప్రయాణించే అవకాశం ఉండదు. ప్రైవేటు ఉద్యోగులు: గ్రేటర్ పరిధిలో సుమారు 35 లక్షల ద్విచక్రవాహనదారులున్నారు. వీరిలో చాలామంది ప్రైవేటు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నవారే. వీరిలో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు డ్యూటీ ఉండేవారు చాలా తక్కువే. వీరిలో చాలామందికి అర్థరాత్రి, అపరాత్రి షిఫ్టులుంటాయి. దీంతో వీరిలో చాలామంది ద్విచక్రవాహనానికే మొగ్గుచూపుతారు. ఇక మార్కెటింగ్ రంగంలో పనిచేసే వారిదీ ఇదే రూటు. చిరు వ్యాపారులు: పాలు, కూరగాయలు, నిత్యావసరాలను విక్రయించే వ్యాపారులు భారీ లగేజితో తరలివస్తే మెట్రో జర్నీలో అనుమతించరు. దీంతో వేలాదిమంది వ్యాపారులు ఇతర పనుల నిమిత్తం బయటికి వెళితే తప్ప..వారి వ్యాపార నిమిత్తం మెట్రో రైళ్లలో ప్రయాణించే అవకాశం ఉండదు. -
పెద్ద నోట్ల పరిణామంతో ఇబ్బందులు
ఖమ్మం వ్యవసాయం : పెద్దనోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని పత్తి, అపరాల కొనుగోళ్లును ఆయన పరిశీలించారు. రైతులు పంట ఉత్పత్తులు విక్రయిస్తే చెక్కులు ఇస్తున్నారని, వాటిని బ్యాంకుల్లో ఇస్తే నగదు చేతికందేందుకు 20 రోజులకు పైగా పడుతోందన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో హమాలీలకు కూడా నిత్యం చేసిన పనికి నగదు అందడం లేదని, వారం రోజులకు కూడా కూలీ ఇవ్వడం లేదని, దీంతో ఆయా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని పేర్కొన్నారు. వేరుశనగ ఉత్పత్తిని మార్కెట్‌కు తీసుకువస్తే వెం టనే కొనుగోలు చేయ డం లేదని, ధర నిర్ణయించిన తరువాత ఆరబెట్టించి, కాంటాలు పెడుతున్నారని, ఇది మంచిది కాదని చెప్పారు. పెసలకు కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.5,225 మద్దతు ధర ప్రకటించగా, మార్కెట్లో కేవలం రూ.3 వేలకు మించి కొనుగోలు చేయటం లేదని తెలి పారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కల్వకుంట్ల గోపాల్‌రావు, రాపర్తి శరత్, ఫజల్, దడవాయి సంఘం నాయకులు పి.నర్సింహారావు, పి.ఆదినారాయణ, శివారెడ్డి, తాటికొండ కృష్ణ, శ్రీనివాసరావు, నిర్మల, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా నగదు కోసం జనం విలవిల
-
కష్టాలు.. కన్నీళ్లే!
►రాష్ట్రవ్యాప్తంగా నగదు కోసం జనం విలవిల ►క్యూలైన్లలో సొమ్మసిల్లుతున్న వృద్ధులు ► పలు చోట్ల తొక్కిసలాటలు, ఆందోళనలు సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా నగదు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనమంతా బ్యాంకులు, ఏటీఎంల వద్దే పడిగాపులు కాస్తున్నారు. చాలా చోట్ల బ్యాంకుల్లో రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకే అదీ తొలి వంద, రెండు వందల మంది ఖాతాదారులకే చెల్లిస్తున్నారు. మరికొన్ని చోట్ల అసలు నగదు లేదంటూ ‘నో క్యాష్’ బోర్డులు పెడుతున్నారు. అటు గురువారం కూడా హైదరాబాద్‌లోని సుమారు 1,435 బ్యాంకుల వద్ద జనం కిలోమీటర్ల మేర బారులు తీరారు. మొత్తంగా ఉన్న ఏడువేల ఏటీఎంలలో గురువారం తెరుచుకున్నవి వెయ్యిలోపు మాత్రమే. ఎస్డీ రోడ్‌లోని సిండికేట్ బ్యాంకు వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం 12 వరకు క్యూలైన్లో నిలబడిన కృష్ణ సూర్యనారాయణ (65) అనే రైల్వే రిటైర్డ్ ఉద్యోగి సొమ్మసిల్లి పడిపోయారు. ఆయనను పోలీసులు వెంటనే లాలాగూడలోని రైల్వే ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. ఇక పలు చోట్ల బ్యాంకులు ఇచ్చే కొద్దిపాటి నగదు అయినా.. వారానికి ఒకసారి మాత్రమే ఇస్తామని చెబుతుండడంతో ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగదు కష్టాలతో కోఠి, అబిడ్స్, సుల్తాన్‌బజార్, బేగంబజార్, మోండా మార్కెట్, చార్మినార్ తదితర మార్కెట్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. తొక్కిసలాటలు.. ఆందోళనలు.. నగదు కోసం బ్యాంకుల వద్దకు జనం భారీ సంఖ్యలో చేరుకుంటుండడంతో తొక్కిసలాట, తోపులాట, వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలు చోట్ల నగదు అందక జనం ఆందోళనలకు దిగుతున్నారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఆంధ్రాబ్యాంక్ ఎదుట భారీగా జనం చేరారు. ఉదయం 10.30కు బ్యాంకు గేటు తెరవడంతో.. వారంతా ఒక్కసారికి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట జరిగింది. మరోవైపు కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ రైతులు, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు వేర్వేరుగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. నగదు ఇవ్వకుంటే తాము పంటలు ఎలా వేసుకోవాలంటూ బ్యాంకుల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ఎస్బీహెచ్ వద్ద కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. నగదు లేదనడంతో రైతులు రాస్తారోకో చేశారు. ఏటీఎంకు పూజలతో నిరసన జనాలకు డబ్బులు అందజేయాల్సిన ఏటీఎంలు.. నోట్ల రద్దుతో ఎందుకూ పనికిరాని డబ్బాలుగా మారిపోయాయి. దీంతో జనం ఏటీఎంలకు పూజలు చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో గురువారం కామారెడ్డిలోని పలు ఏటీఎంలకు పట్టణ కాంగ్రెస్ నేతలు పూజలు చేశారు. అన్ని బ్యాంకుల ఏటీఎంలలోనూ డబ్బులు పెట్టడం లేదని.. దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు కన్నయ్య పేర్కొన్నారు. తిండీతిప్పలూ బ్యాంకు వద్దే.. అటు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తోపాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జనం కొండపాక, దుద్దెడ ఆంధ్రా బ్యాంకులకు వచ్చారు. రూ.4వేల చొప్పున ఇస్తామంటూ బ్యాంకు అధికారులు వారికి టోకెన్లు ఇచ్చారు. అయితే సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ సేవలు పనిచేయకపోవడంతో నగదు ఇవ్వలేదు. దీంతో ఖాతాదారుల్లో చాలా మంది బ్యాంకు వద్దే నిరీక్షించారు. వారిలో కొందరు ఇంటి నుంచి తెచ్చుకున్న సద్దులు తిని కడుపు నింపుకున్నారు. వృద్ధురాలికి ‘పెద్ద’ కష్టం ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు భాగ్యమ్మ (70). ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొంగర గ్రామం. చేతిలో చిల్లి గవ్వ లేని దుస్థితిలో గురువారం పింఛన్ సొమ్ము తీసుకుం దామని చెరువుమాధారం ఏపీజీవీ బ్యాంకుకు వచ్చింది. 2 గంట ల పాటు క్యూలో నిలబడడంతో.. సొమ్మసిల్లి పడిపోయింది. ఇది చూసిన మస్తాన్ అనే ఆటో డ్రైవర్ ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పడంతో సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తే భాగ్యమ్మ తుంటి ఎముక విరిగిందని వైద్యులు చెప్పారు. ఇప్పుడు తన పరిస్థితేమిటని వృద్ధురాలు కన్నీరమున్నీరవుతోంది. క్యూలైన్లోనే బీడీలు చుడుతూ.. రోజూ బీడీలు చుడితేగానీ పూట గడవని పరిస్థితి వారిది. నోట్ల రద్దుతో చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితి. దీంతో అటు బ్యాంకుల ముందు క్యూలైన్లో ఉంటూనే.. ఇటు బీడీలూ చుడుతు న్నారు కొందరు మహిళలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లోని ఆం ధ్రాబ్యాంకు ఎదుట గురువారం తెల్ల వారుజామున కనిపించిన దృశ్యమిది. పోత్గల్‌కు చెందిన ఈర్ల లక్ష్మి, ముస్తా బాద్‌కు చెందిన ఆరుట్ల లక్ష్మి, మరి కొందరు క్యూలైన్ల ఉండే బీడీలు చుడుతూ తమ వంతు కోసం ఎదురు చూశారు. గంటలు గంటలు నిలబడా ల్సి వస్తోందని, దాంతో పని పోతుం దనే ఉద్దేశంతో లైన్లోనే బీడీలు చుడుతున్నామని వారు పేర్కొన్నారు. అమ్మా.. పాలకులను కదిలించేనా నీ కంటి చెమ్మ.. అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి.. ఉన్నచోటి నుంచి కదలాలన్నా కష్టమైన పరిస్థితి.. అటు తిండికీ, ఇటు మందులకూ నెల నెలా వచ్చే పింఛన్ డబ్బులే దిక్కు.. కానీ ‘నోట్ల రద్దు’తో ఆ పింఛన్ సొమ్మునూ తీసుకోలేని పరిస్థితి.. కాళ్లీడ్చుకుంటూ బ్యాంకుకు వచ్చినా లైన్లో నిలబడలేక.. నిలబడినా సొమ్ము చేతికి అందక కన్నీళ్లే మిగులుతున్నాయి.. గురువారం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం షాపూర్‌నగర్ ఎస్బీహెచ్ బ్రాంచీకి వచ్చిన కమలమ్మ అనే వృద్ధురాలికి ఇదే పరిస్థితి ఎదురైంది. దుండిగల్ మండలం బౌరంపేట్‌కు చెందిన ఆమె.. అందరికన్నా ముందే బ్యాంకుకు వచ్చింది. కానీ నగదు లేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో.. తల బాదుకుంటూ, రోదిస్తూ ఇంటిదారి పట్టింది. ఇలా పింఛన్ సొమ్ము అందక ఎందరో పండుటాకులు ఆవేదనతో వెనుదిరుగుతున్నారు. వాస్తవానికి తొలుత పింఛన్ల సొమ్మును నేరుగా లబ్ధిదారుల చేతికి అందజేసేవారు. తర్వాత ఖాతాల్లో జమ చేస్తున్నారు. ‘నగదు’ సమస్యల నేపథ్యంలో వృద్ధులు, వికలాంగులకు కష్టాలు తప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదా?.. పాత పద్ధతిలో నేరుగా పింఛన్ సొమ్ము అందజేసేందుకు ఏర్పాట్లు చేయలేదా..? -
సామాన్యుడి ఇంట్లో కరెన్సీ సునామీ..!
-
మా డబ్బు మేం తీసుకునెందుకు కష్టపడలా?
-
ఎక్కడా నోట్లు లేవు!
-
ఎక్కడా నోట్లు లేవు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నగదు కొరత మరింత తీవ్రమైంది. రూ.5,000 కోట్ల విలువైన నోట్లను రాష్ట్రానికి పంపాలన్న ప్రభుత్వ విజ్ఞప్తికి ఇప్పటికీ ఆర్బీఐ నుంచి స్పందన లేకపోవటంతో నోట్ల కొరత ఉధృతమవుతోంది. రాష్ట్రంలో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర అధికారుల బృందం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. నగదు లేకపోవడంతో గురువారం గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో అనధికారికంగా చెల్లింపులు నిలిపివేశారు. కేవలం డిపాజిట్లు చేసుకోవడమే తప్ప.. ఇచ్చేందుకు డబ్బులు లేవంటూ ఖాతాదారులను తిప్పి పంపారు. దీంతో సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 80 శాతం బ్యాంకుల్లో.. హైదరాబాద్ నగరంలో దాదాపు 80 శాతం బ్యాంకుల్లో అనధికారికంగా చెల్లింపులు నిలిచిపోయారుు. కొత్త నోట్లకు అనుగుణంగా ఏటీఎంలను మార్చినా నగదు లేకపోవడంతో ఖాళీగానే ఉన్నారుు. వాస్తవానికి శుక్రవారం నుంచే అత్యధిక బ్యాంకుల్లో నగదు మార్పిడిని నిలిపివేశారు. అరుుతే పదిహేను రోజులుగా బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలు, నగదు మార్పిడి తంటాలు, రూ.2 వేల నోటును చిల్లరగా మార్చుకునేందుకు ప్రజలు పాడుతున్న పాట్లు నిత్యకృత్యంగా మారారుు. పాత పెద్ద నోట్ల చెల్లింపుల గడువు ముగుస్తోందనే ఆందోళనతో గురువారం పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లు, కరెంటు బిల్లులు, ప్రభుత్వ ఫీజుల చెల్లింపులకు జనం ఎగబడ్డారు. నగదు వెంటనే సరఫరా చేయండి నోట్ల కొరత ఇదే తీరుగా కొనసాగితే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు మరింత ఇబ్బంది పడతారని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. రాష్ట్రంలో నోట్ల రద్దు పరిణామాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం పర్యటన ముగియడంతో... గురువారం సాయంత్రం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో భేటీ అరుుంది. రాష్ట్రంలో ప్రజల కనీస అవసరాలకు సరిపడేంత డబ్బును విడుదల చేయాలని, రూ.5వేల కోట్ల విలువైన రూ.500, రూ.100 నోట్లు సరఫరా చేస్తే ఇబ్బందులు తగ్గుతాయని సీఎస్ ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయే ఆదాయాన్ని భర్తీ చేసేందుకు పాత బకారుులను విడుదల చేసేలా కేంద్రానికి సూచించాలని కోరారు. ఉద్యోగులు, పింఛన్లపై సర్కారు దృష్టి ఒకటో తేదీ వచ్చేస్తుండటంతో ఉద్యోగుల జీతాలు, ఆసరా పెన్షన్ల చెల్లింపులపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతంలో రూ.10 వేలు నగదుగా ఇచ్చే ప్రతిపాదన ముఖ్యమంత్రి వద్ద పరిశీలనలో ఉంది. ఉద్యోగులు తమ కార్యాలయాల్లోనే సంబంధిత అధీకృత అధికారి నుంచి ఓచర్ ద్వారా ఈ డబ్బు తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. లేని పక్షంలో బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి రూ.10 వేలు ఇప్పించాలనే ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తోంది. దీనిపై ఆర్బీఐ నుంచి అనుమతి తీసుకోవడంతో పాటు సరిపడేంత డబ్బు అందుబాటులో ఉంచాలంటూ కేంద్రానికి లేఖ రాయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించారుు. దీనిపై సీఎం తీసుకునే నిర్ణయం మేరకు శుక్రవారం స్పష్టత రానుంది. ఇక ఆసరా పెన్షన్లు సజావుగా చెల్లించేందుకు సరిపడా నోట్లు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆర్బీఐకి విజ్ఞప్తి చేసింది. నగదు రహిత లావాదేవీలే పరిష్కారం: రెడ్డి సుబ్రమణ్యం నోట్ల రద్దు సమస్యను అధిగమించేందుకు నగదు రహిత లావాదేవీలే పరిష్కారమని కేంద్ర బృందం ప్రతినిధి రెడ్డి సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. ‘‘నోట్ల రద్దు వల్ల ప్రజలు, ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలు క్షేత్రస్థారుులో పరిశీలించాం. జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నాం. చిన్న నోట్లు లేకపోవడంతో గ్రామీణ ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అందుకే నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించాలి. గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలు నగదు రహిత లావాదేవీలకు చేపట్టేందుకు సుముఖంగా ఉన్నారు. నోట్ల రద్దుతో రాష్ట్రానికి రూ.3 వేల కోట్లు నష్టం వస్తోందని ప్రభుత్వం నివేదించింది. వీటన్నింటినీ ప్రధానికి, ఆర్బీఐకి తెలియజేస్తాం..’’ అని చెప్పారు. వంటగ్యాస్‌కూ డబ్బుల్లేక.. ఈమె పేరు బీసం కొండమ్మ. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం నాగరాల గ్రామానికి చెందిన ఈమెది వ్యవసాయ కుటుంబం. వరి, వేరుశనగ పంటలు సాగు చేశారు. పొద్దున లేస్తే పొలానికి వెళ్లాల్సిందే. ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ ఉన్నా గ్యాస్ అరుుపోరుుంది. రీఫిల్ సిలిండర్ తీసుకుందామనుకుంటే చేతిలో డబ్బులు లేవు. బ్యాంకుకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడినా.. చివరకు డబ్బు లేదంటున్నారు. దీంతో చేసేది లేక కట్టెల పొరుు్య మీదనే వంట చేసుకుని పొలం పనులకు వెళ్తున్నామని కొండమ్మ వాపోరుుంది. ‘చిల్లర’ తిప్పలు ఆసరా పింఛన్ దారులకూ చిల్లర కష్టాలు తప్పడం లేదు. యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని తపాలా కేంద్రాల్లో గురువారం వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు. చిల్లర లేకపోవడం వల్ల ఇద్దరిద్దరికి కలిపి రూ.2వేల నోటు చొప్పున ఇచ్చారు. దీంతో పింఛన్‌దారులు డబ్బు పంచుకోవడానికి నానా తంటాలూ పడ్డారు. కనిపించిన వారినల్లా చిల్లర కోసం ప్రాధేయపడ్డారు. ఇలా భువనగిరి మండలం తాతానగర్‌కు చెందిన ముదిగొండ యాదమ్మ, కొండె నాగమ్మ తమ వృద్ధాప్య పింఛన్ కోసం సబ్ పోస్టాఫీస్‌కు రాగా.. ఇద్దరికీ కలిపి రూ.2వేల నోటు ఇచ్చారు. వీరిలో యాదమ్మ ఆ నోటును తీసుకుని.. చిల్లర మార్చి శుక్రవారం ఇస్తానని చెప్పడంతో నాగమ్మ వెళ్లిపోరుుంది. ఇక వికలాంగులు తమకిచ్చే రూ.1,500 పింఛన్ కోసం మరింత అవస్థ పడ్డారు. ముందుగానే రూ.500 చిల్లర తీసుకుని వెళితే.. రూ.2 వేల నోటు ఇస్తున్నారు. దీంతో తెలిసినవారి వద్ద అడిగి చిల్లర తెచ్చుకోవడానికి వికలాంగులు తిప్పలు పడ్డారు. ఇలా చాలా మంది పింఛన్‌దారులకు ‘నోట్లు’ కన్నీళ్లు తెప్పించారుు. నోట్లు.. పాట్లు పెద్దనోట్ల రద్దు వ్యవహారం సామాన్య ప్రజానికానికే కాదు.. ప్రజాపతినిధులకూ ఇబ్బందిగా మారింది. అందరికీ విత్‌డ్రా పరిమితి ఒకేలా ఉండటంతో పార్లమెంట్ సమావేశాలకు వెళ్లిన ఎంపీలు కూడా ‘నోట్ల’ కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎంపీలు పడుతున్న పాట్లపై ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీకి వెళ్తే అక్కడ ఖర్చులుంటారుు. క్వార్టర్లలో పనిచేసే వారికి, కార్యాలయ సిబ్బందికి, డ్రైవర్లకు, కార్లలో డీజిల్ కోసం పైసలు ఇవ్వాల్సి ఉంటుంది. మొదటివారం ఢిల్లీలో బ్యాంకుకు వెళితే రూ.10 వేలు ఇచ్చారు.. మళ్లీ వెళితే 14 వేలు ఇచ్చారు.. ఆ తర్వాత వెళ్లగా 8 రోజుల వ్యవధి ఉండాలని చెప్పారు. రూ.24వేలు మాకు ఎలా సరిపోతారుు? మా జీతం మేం తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు’ అని పేర్కొన్నారు. తన పర్సు బయటకు తీసి అందులో ఉన్న రూ.20, 10 నోట్లను కూడా చూపించారు. -
ప్రజలకు 2వేల కష్టాలు
పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజలు తీరని కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఆర్బీఐ కొత్తగా జారీ చేసిన రూ.2వేల నోటు అలంకారప్రాయంగా మారుతోంది. ఎక్కడా చిల్లర దొరకడంలేదు. చివరకు బ్యాంకుల్లోనూ తీసుకోవడానికి సిబ్బంది విముఖత చూపుతున్నారు. ఏం చేయాలో తెలియక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. తిరుపతి (అలిపిరి): పెద్దనోట్ల రద్దుతో జిల్లా ప్రజలు సవాలక్ష కష్టాలు ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల నుంచి రూ.2వేల నోటు పొందిన వారికి వింత అనుభవం ఎదురవుతోంది. 10వ తేదీ బ్యాంకులకు రూ.2వేల నోట్లు చేరాయి. వాటిని సొంతం చేసుకోవాలని యువకులు బ్యాంకుల ముందు బారులు తీరారు. గంటల తరబడి నిరీక్షించారు. కలర్‌ఫుల్ లుక్‌తో మెరిసిపోయే రూ.2వేల నోట్లు చేతికి రావడంతో బ్యాంకుల ముందే సెల్ఫీలు దిగి సోషియల్ మీడియాలో పోస్టులు చేశారు. ఈ తంతు మూడు రోజుల పాటు కొనసాగింది. కాలం గడిచే కొద్ది రూ.2వేల నోటు గుదిబండగా మారింది. ఒక వైపు రూ.100 నోట్ల కొరత.. మరో వైపు కొత్త పెద్దనోటు రూ.2వేలకు చిల్లర దొరక్క అల్లాడాల్సి వస్తోంది. నిరాకరణ: బ్యాంకుల్లో రూ.2వేల నోటు తీసుకోవడానికి సిబ్బంది నిరాకరిస్తున్నారు. నోటును చిల్లర దుకాణాలకు తీసుకెళ్లినా అదే పరిస్థితి. నో చేంజ్ అంటూ తిప్పి పంపుతున్నారు. ఖాతాదారుల ఇళ్లలో రెండువేల నోటు అలంకారప్రాయంగా మారుతోంది. కష్టాలు కంటిన్యూ: జిల్లాలోని పలు ఏటీఎం కేంద్రాల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి రూ.2వేల నోట్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రజలు చిల్లర నోట్లు వస్తాయని ఏటీఎం కేంద్రాలకు వెళ్లి డ్రా చేస్తే రూ.2వేల నోటు వస్తోంది. దీంతో ప్రజలకు మరింత చిల్లర కష్టాలు తప్పడం లేదు. ఆర్బీఐ నుంచి తక్కువ మొత్తంలో రూ.100 నోట్లు అందుతుండడంతో చిల్లర కొరత ఏర్పడుతోంది. బ్యాంకు అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. అమ్మో రూ.2వేలా! రూ.2వేల నోటు పేరు చెబితే భయమేస్తోంది. చిల్లర దుకాణాలకు వెళితే నో చేంజ్ అంటున్నారు. చిన్నాచితక షాపులకు వెళితే రూ.200 కొంటే రూ.1800 చిల్లర ఎలా ఇచ్చేదంటూ వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. కొత్త నోటు మాకొద్దంటూ పలువురు తిప్పి పంపుతున్నారు. - దొరస్వామిరెడ్డి, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి బీరువాలో దాచుకోవాల్సిందే కొత్త రూ.2వేల నోటును బీరువాలో దాచుకోవాల్సిందే. రద్దరుున రూ.1000 నోటుకు చిల్లర దొరకడం కష్టంగా ఉండేది. ఇప్పడు రూ.2వేల నోటు అంటే చిల్లర దుకాణాల్లో తీసుకోవడంలేదు. కూరగాయలు కొందామని మార్కెట్‌కు వెళితే రూ.2వేల నోటుకు చిల్లర ఎక్కడి నుంచి తేవాలంటూ ప్రశ్నిస్తున్నారు. - గోవిందయాదవ్, వ్యాపారి, తిరుపతి -
రోడ్డున పడ్డ భారత్...!
-
పెద్ద నోట్ల రద్దు తొందరపాటు చర్య
- కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి నంద్యాల: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడం తొందర పాటు చర్య అని 20 సూత్రాల కమిషన్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి విమర్శించారు. పీసీసీ కార్యదర్శి డాక్టర్ రాకేష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరెన్సీ నోట్లపై కేంద్రం అనాలోచితంగా నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. బ్యాంకులను, డబ్బును సిద్ధం చేసి నిషేధాన్ని ప్రకటించి ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదన్నారు. రూ.2వేల నోటు కూడా గందరగోళానికి గురి చేస్తుందని చెప్పారు. దీని వల్ల సామాన్యులు మాత్రమే ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం ఈ ఇబ్బందులను త్వరితంగా తొలగించాలని కోరారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా 19వ తేదీ కోడుమూరులో నిర్వహించే రైతు సదస్సుకు జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులు పాల్గొంటారన్నారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర నేత నాగమధుయాదవ్, కడప జిల్లా కాంగ్రెస్ నేత ధ్రువకుమార్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు లగిశెట్టి సుబ్బగురుమూర్తి పాల్గొన్నారు. -
నోట్ల రద్దు:బస్టాండులో ప్రయాణికుల అవస్ధలు
-
జనాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలు
గుంటూరు వెస్ట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపన్నవర్గాలకు సేవకులుగా మారిపోయి, సామాన్యవర్గాల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నాయని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి, పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్ పూర్తిగా అమలుచేయాలని, ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ గుంటూరు కొత్తపేటలోని సీపీఐ కార్యాలయంలో సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఇనాక్ మాట్లాడుతూ బడ్జెట్లో కేటాయిస్తున్న ఒక్క రూపాయిలో 99 పైసలు 15 శాతంగా ఉన్న ప్రజలకు చేరుతోందని, కేవలం ఒక్క పైసా మాత్రమే 85 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చేరుతోందని, ఇది దారుణమైన పరిస్థితి అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండా ఒక్కో పర్యాయం మెయిన్ ప్లాన్‌లోకి కలుపుతున్నారని విమర్శించారు. ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్లకు పోరాటాలు చేయాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి విల్సన్ మాట్లాడుతూ ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్ల సాధనకు అందరూ ఐక్యంగా పోరాటాలు చేయాలన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్‌ను పూర్తిగా అమలుచేయడానికి, ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్ల సాధనకు అన్ని సామాజిక శక్తులను ఒకే వేదికపైకి తీసుకురావాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ దళిత క్రైస్తవులను ఎస్సీల జాబితాలో చేర్చాలని కోరారు. -
వ్యాపారులకు అందలం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి అప్పిరెడ్డి సీఆర్డీఏ పరిధిలో భూములు, భవనాల రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై మండిపాటు పట్నంబజారు : కార్పొరేట్ వర్గాలకు రెడ్ కార్పెట్ వేస్తూ.. కంత్రీగాళ్లకు కొమ్ముకాస్తూ.. బడా పారిశ్రామిక వేత్తలకు లబ్ధి చేకూరుస్తూ, సామాన్య ప్రజలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపేలా చంద్రబాబు సర్కారు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా సీఆర్డీఏ పరిధిలో భూములు, భవనాల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడంపై రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ జిల్లా రిజిస్ట్రార్ కె.శ్రీనివాసరావుకు శుక్రవారం వినతిపత్రం ఇచ్చారు. అనంతరం అప్పిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు రెండేళ్ల పాలనలో అడుగడుగునా చట్టాలు తుంగలో తొక్కుతూ ఆదాయం కోసం హడావుడిగా జీవోలు విడుదల చేయడంపై మండిపడ్డారు. సీఆర్డీఏ పరిధిలో టీడీపీకి చెందిన బడా వ్యాపార వేత్తలకు లబ్ధి చేకూర్చేలా జీవో విడుదల చేయడం సమంజసమేనా అని నిలదీశారు. బడా వ్యాపారులకు అన్నం.. సామాన్యులకు సున్నం అన్నచందంగా చంద్రబాబు సర్కారు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచిందని ఎద్దేవా చేశారు. పెంచిన రిజిస్ట్రేషన్ చార్జిల జీవోను తక్షణమే ఉపసంహరించుకుని చార్జీల పెంపుపై ప్రజాభిప్రాయం సేకరించాలని లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రజలకు వెలుసుబాటు ఇవ్వకుండా గంటల్లోనే రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం చేస్తున్న వికృత చేష్టలకు ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. -
సీఎం గేటు దాటని పేదల కష్టాలు
నానా అగచాట్లు పడుతున్న సందర్శకులు రోజుల తరబడి తిరిగినా కలవడం అనుమానమే సీఎం కార్యాలయం వద్ద భద్రత పేరుతో హంగామా సందర్శకుల వేళలు పాటించని కార్యాలయం విజయవాడ : వివిధ సమస్యలపై ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చే సందర్శకులు ఆయన కార్యాలయం వద్ద అష్టకష్టాలు పడుతున్నారు. అనేక అడ్డంకులు దాటుకుని సీఎం కార్యాలయం వద్దకు చేరుకున్నా లోనికి వెళ్లడమంటే గగనమే. వారానికో, పది రోజులకో ఆయనకు సమయం కుదిరితే సందర్శకులను లోనికి పంపిస్తున్నారు. లేకపోతే గేటుకు ఇవతలే నిలిపివేస్తున్నారు. దీంతో ఆయన సాయంకోసం ఎంతో ఆశతో వచ్చినవారి ఆవేదనలు సీఎం కార్యాలయం వద్ద నిత్యకృత్యంగా మారాయి. ఆయన్ను కలవడానికి వచ్చే వారిలో 50 శాతం మంది నిరాశతోనే వెనుదిరుగుతున్నారు. మిగిలిన వారు లోనికి వెళ్లినా గంటల తరబడి అక్కడ కూడా వేచి ఉండక తప్పడం లేదు. గంట సమయం ఉత్తుత్తిదే.. మొదట్లో సందర్శకుల కోసం ముఖ్యమంత్రి ప్రతి రోజూ గంట సేపు కేటాయిస్తారని ఆయన కార్యాలయం ప్రకటించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకూ ఎవరైనా వచ్చి ఆయన్ను కలవచ్చని కార్యాలయం గేట్లకు నోటీసులు అంటించారు. అది ఎన్నో రోజులు అమలు కాలేదు. జిల్లాల పర్యటనలు, విదేశీ యాత్రలతో ముఖ్యమంత్రి బిజీ బిజీగా గడుపుతున్నారు. ఒకవేళ కార్యాలయంలో ఉన్నా సమీక్షలు, సమావేశాలు, విదేశీ బృందాలతో భేటీలకే ఆయనకు సమయం ఉండడం లేదు. దీంతో సందర్శకుల కోసం కేటాయించిన గంట సమయం గాల్లోనే కలిసిపోయింది. దీంతో సీఎం కార్యాలయ అధికారులు సందర్శకుల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు. ప్రతి రోజూ 30 నుంచి 50 మంది వరకూ సీఎంను కలవడానికి వస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు చెప్పుకునేందుకు ఎక్కువ మంది కుటుంబాలతో కలిసి వస్తుండగా.. వృద్ధులు, వికలాంగులు సైతం తరచూ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. కార్యాలయ సిబ్బంది ముందు వారి అర్జీలను తీసుకుని పరిశీలించి వివాదం కాదనుకుంటేనే లోనికి పంపుతున్నారు. ఆర్థిక సమస్యలు, భూవివాదాల సమస్యలతో వచ్చిన వారికి దాదాపు లోనికి పంపడం లేదు. ఉద్యోగం, ఇల్లు కావాలన్న వారిని చాలావరకూ లోనికి పంపడంలేదు. అనారోగ్య సమస్యలతో వచ్చిన వారినే ఎక్కువగా లోనికి అనుమతిస్తున్నారు. ఎప్పుడైనా సీఎం ఉంటే అదృష్టం కొద్దీ కొందరు ఆయన్ను కలుస్తున్నారు. లేకపోతే కార్యాలయ అధికారులే అర్జీలు తీసుకుని పంపిస్తున్నారు. -
ధరలు తగ్గేదెన్నడు బాబూ?
స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు కావస్తున్నా ఐదేళ్లూ ఇంకా నోటిలోకి పోని దురవస్థలో సామాన్య ప్రజలు బ్రతుకీడుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అంబరాన్నంటుతున్న అత్యవసర వస్తువుల ధరలతో ఏం కొ(తి)నేటట్టులేని దుస్థితి దాపురించింది. కొన్ని నెలలుగా కొండెక్కి తిష్ఠ వేసిన పప్పులు, బియ్యం, ఉల్లి ధరలు ఎంతకీ దిగిరాకపో వడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.150, మినప్పప్పు రూ.180 అమ్ముతున్నారు. తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందం టారు కానీ అదే ఉల్లి నేడు కోయకుండానే అమ్మలకు కన్నీరు తెప్పిస్తోంది. కిలో ఉల్ల్లిపాయలు కొండెక్కి కూర్చు న్నాయి. కూరగాయల ధరలూ ఎవరూ కొనలేని స్థితికి చేరాయి. ఫలితంగా పేదవాడి ఇంట వంటింటి సంక్షోభం ఏర్పడుతోంది. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించి, వాటి ధరలను అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభు త్వంపై ఉంది. అటు కేంద్రం, ఇటు రాష్ర్టంలో కొత్త ప్రభు త్వాలు కొలువు దీరి పదిహేను నెలలు గడచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో అవినీతి పెచ్చరిల్లిం దన్నది వాస్తవం. అదే సమయంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడం సామాన్యులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. దీంతో కేంద్రంలో బీజేపీ, రాష్ర్టంలో తెలుగుదేశం పార్టీలకు ప్రజలు పట్టం కట్టారు. కొత్త ప్రభుత్వాలు గద్దె నెక్కి పదిహేను నెలలు గడచినా ధరలు దిగిరావడంలేదు సరికదా... అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పెరిగిన నిత్యావసరాల ధరలను తగ్గించేందుకు పాలకుల నుంచి ఎలాంటి ప్రయత్నాలూ జరగడంలేదు. మరోవైపు పెట్రో ఉత్పత్తుల ధరలు అదుపులోకి వచ్చాయి. ఆ మేరకు నిత్యా వసరాల ధరలే తగ్గడంలేదు. వ్యాపారులు సరకుల కృత్రి మ కొరత సృష్టించి, వాటి ధరలు దిగిరాకుండా అడ్డు కుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసు కొని నిత్యావసరాల ధరలను ప్రజలకు అందుబాటులోకి తేవాలి. అంతేగాకుండా అన్ని నిత్యావసర వస్తువులను చౌక దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. పేద, సామాన్య ప్రజల పట్ల తనకు గల కర్తవ్యాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదు. - బట్టా రామకృష్ణ దేవాంగ సౌత్ మోపూరు, నెల్లూరు జిల్లా -
కరువు మేఘం
జిల్లాలో కరువు కమ్ముకొస్తోంది.. సాగు భూములు బోసిపోతున్నాయి.. ఖరీఫ్ మొదలై రెండు నెలలు కావస్తున్నా వర్షం జాడ లేదు. ఆకాశంకేసి చూడడం తప్ప అన్నదాతకు పాలుపోవడం లేదు. మరోవైపు వ్యవసాయ కూలీల పరిస్థితి దయనీయంగా ఉంది. పనుల్లేక పట్టణాల బాట పడుతున్నారు. దారి చూపాల్సిన ప్రభుత్వం మిన్నకుండిపోతోంది. ఈ ఏడాది సాగు సంకటంగా మారింది. సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లాలోని 30 మండలాల్లో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. పల్నాడులోని రైతులు, సామాన్య ప్రజలపై వర్షాభావ పరిస్థితులు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. జూలైలో 142.1 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉంటే 112.1 మి.మీ తక్కువగా వర్షపాతం నమోదైంది. వర్షాలు కురుస్తాయనే నమ్మకంతో పత్తి సాగుచేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వినుకొండ, మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉన్నది. ఇక్కడ 1.20 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం ఉంటే 30 వేల హెక్టార్లలో పత్తిని సాగు చేశారు. నెల గడిచినా పదునైన వర్షం కురవక పోవడంతో మొలకెత్తిన మొక్కల్లో పెరుగుదల లేక గిడసబారిపోతున్నాయి. మొక్కలను రక్షించుకునేందుకు ట్రాక్టర్ల సహాయంతో దూరప్రాంతాల నుంచి సాగునీటిని రవాణా చేస్తున్నారు. కొందరు రైతులు విత్తని విత్తనాలను తిరిగి షాపుల్లో అమ్ముకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండునెలలు గడిచినా సాగు నీరు లేక భూములు బోసిగా కనిపిస్తున్నాయి. పనుల్లేక అల్లాడుతున్న వ్యవసాయ కార్మికులు ఓ వైపు వర్షాభావం.. మరోవైపు సాగర్ కుడి కాలువ నుంచి నీరు విడుదల కాకపోవటంతో పంట పొలాలన్నీ ఖాళీగానే ఉన్నాయి. దీంతో పంట పొలాలపై ఆధారపడే కూలీలు పనులు కూడా దొరకక అల్లాడిపోతున్నారు. మాచర్ల, వినుకొండ, బొల్లాపల్లి, శావల్యాపురం, ఈపూరు లాంటి మండలాల్లోని వ్యవసాయ కార్మికులు పనుల కోసం ఎగబడుగున్నారు. ఒకో మండలం నుంచి వెయ్యి నుంచి 1,500 వరకు ఉపాధి కూలీ పనుల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. నీటి ఎద్దడి వలన పశువులను నీరున్న ప్రాంతాలకు తరలిస్తున్నారు. సాగర్‌నీరు లేక, సకాలంలో వ ర్షాలు పడక రైతులకు మళ్లీ గడ్డుకాలం వచ్చినట్లు కనిపిస్తుంది. ఈనెలలో మిరప నాట్లు ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పటికీ రైతులు వేసి చూసే దోరణిలో ఉన్నారు. దీనికి తోడు భూగర్భ జలాలు కూడా అడుగంటడంతో బోర్ల కింద సాగు చేసిన పత్తి పంట కూడా ఎండిపోతుంది. దీంతో ఈ ఏడాది రైతులు కరువుతో సహజీవనం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. డెల్టాలో పెరుగుతున్న ఖర్చులు.. డెల్టాలో వరి పంటను సాగు చేస్తున్న రైతులకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. 4.18 లక్షల ఎకరాల్లో వరి సాధారణ విస్తీర్ణం ఉంటే ఇప్పటివరకు 1.20 ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. కొందరు రైతులు బోర్ల సహాయంతో నారుమడులు పోస్తే, మిగిలిన రైతులు విత్తనం ఎదజల్లే విధానం ద్వారా వరిని సాగు చేస్తున్నారు. వర్షాలు కురవకపోవడంతో నాటిన వరిని కాపాడుకునేందుకు డీజిల్ ఇంజిన్ల ద్వారా సాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఆగస్టులో వర్షాలు కురుస్తాయనే ఆశతో డెల్టా రైతులు ఉన్నారు. కరువు లేదట : పరిస్థితులు ఇలా ఉంటే జిల్లాలో కరువు లేవని జిల్లా యంత్రాంగం చెబుతోంది. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశపు హాలులో నిర్వహించిన సమీక్షలో జిల్లాలో కరువు పరిస్థితులు లేవని, పంటలను కాపాడుకునేందుకు డ్రిప్ ఇరిగేష్ను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. -
ఆ పీపీఏలు పెను భారమే!
(మహమ్మద్ ఫసీయొద్దీన్) ఉమ్మడి రాష్ర్టంలో జెన్కోతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏలు) విషయంలో రాష్ర్ట ప్రభుత్వం తన వాదనను సమీక్షించుకోకపోతే భవిష్యత్తులో భారీ నష్టం తప్పదని విద్యుత్‌రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్పటి పీపీఏలను అమలు చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం పట్టుబడుతుండగా.. ఏపీ సర్కారు మాత్రం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో పీపీఏల అమలు వల్ల ఏపీ ప్రాజెక్టుల నుంచి కొంత విద్యుత్ వాటా వస్తుందని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఆమోదం లేదన్న కారణం చూపి ఆ పీపీఏలు చెల్లవని ఏపీ వాదిస్తోంది. ఈ వివాదంపై విచారణ జరుపుతున్న కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ) మరో రెండు నెలల్లోగా తీర్పును ప్రకటించే అవకాశముంది. నిజానికి అప్పటి పీపీఏలు అమలైతే రాష్ట్రానికి తాత్కాలికంగా ఊరట లభించనుంది. అయితే ప్రస్తుతం రాష్ర్టంలో చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టులు వచ్చే రెండుమూడేళ్లలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో అప్పటికి ఇవే పీపీఏలు గుదిబండగా మారతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ తర్వాత దాదాపు 20 ఏళ్ల వరకు ఆ భారాన్ని మోయాల్సి ఉంటుందని చెబుతున్నారు. పీపీఏల కొనసాగింపునకు అనుకూలంగా సీఈసీ నిర్ణయం వెల్లడిస్తే రెండు రాష్ట్రాలు అందుకు కట్టుబడి ఉండక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ఆలోపే ఈ విషయంపై రాష్ర్ట ప్రభుత్వం పునరాలోచన జరపాల్సి ఉంది. ఏపీకి 1198 మెగావాట్లు.. తెలంగాణకు 862 మెగావాట్లు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం ఉమ్మడి రాష్ర్టంలోని విద్యుత్ ప్రాజెక్టుల్లో తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం వాటాలున్నాయి. పీపీఏల కొనసాగింపు వల్ల ఉత్పత్తి దశలో ఉన్న ప్రాజెక్టుల నుంచి ప్రస్తుతం తెలంగాణకు అదనంగా 370 మెగావాట్ల కరెంటు వస్తోంది. ఏపీలో నిర్మాణ దశలో ఉన్న, ఉత్పత్తి దశకు చేరిన ప్రాజెక్టుల నుంచి సైతం రాష్ర్ట ప్రభుత్వం వాటా కోరుతోంది. అయితే పాత పీపీఏలు కొనసాగితే తెలంగాణలో నిర్మితమవుతున్న ప్రాజెక్టుల నుంచి సైతం ఏపీకి 46.11 శాతం వాటా ఇవ్వాల్సి రానుంది. ఉమ్మడి రాష్ట్రంలో పీపీఏలు జరిగి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, నిర్మాణం పూర్తయి ఉత్పత్తి దశలో ఉన్న ప్రాజెక్టులను పరిశీలిస్తే తెలంగాణలో సింగరేణి ఆధ్వర్యంలో 1200 మెగావాట్లు, కేటీపీఎస్ ఏడో దశ కింద 800 మెగావాట్లు, భూపాలపల్లి రెండో దశలో 600 మెగావాట్లు కలిపి మొత్తం 2600 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. అదే ఏపీలో అయితే 1600 మెగావాట్లతో కృష్ణపట్నం, 600 మెగావాట్లతో ఆర్టీపీపీ ప్రాజెక్టులు కలిపి మొత్తం 2200 మెగావాట్ల విద్యుత్ మాత్రం అందుబాటులోకి రానుంది. దీంతో పీపీఏలు అమలైతే తెలంగాణ ప్లాంట్ల నుంచి 1198 మెగావాట్ల వాటాను ఏపీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఉత్పత్తి వ్యయం చూసుకున్నా నష్టమే తెలంగాణ ప్రాజెక్టులు తక్కువ ఖర్చుతో నిర్మితం కావడంతో యూనిట్ విద్యుదుత్పత్తి వ్యయం సగటున రూ. 4 వరకు మాత్రమే ఉంటుంది. ఇక ఏపీలోని ప్రాజెక్టులను పరిశీలిస్తే.. 600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఆర్టీపీపీ-4 ప్రాజెక్టు కోసం ఇప్పటికే అడ్డగోలుగా వ్యయం చేశారు. ఈ ప్రాజెక్టు నుంచి యూనిట్ విద్యుదుత్పత్తికి రూ. 7 వరకు ఖర్చుకానుంది. ఇంత వ్యయంతో విద్యుదుత్పత్తి చేస్తే ఆ రాష్ర్టం తీవ్ర నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. అందుకే ఈ ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ పీపీఏలు కొనసాగితే ఆర్టీపీపీ నుంచి తెలంగాణకు విద్యుత్ రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ జెన్కోకు ఏటా వందల కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. పీపీఏల్లో ఈ విషయం స్పష్టంగా రాసి ఉంది. ఇక కృష్ణపట్నం మెగా విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. మెగా విద్యుత్తు ప్రాజెక్టుల పాలసీ ప్రకారం ఈ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్‌లో 10 శాతాన్ని మరో రాష్ట్రానికి ఇవ్వాల్సిందే. కృష్ణపట్నంలోని 1600 మెగావాట్ల నుంచి తెలంగాణకు 160 మెగావాట్లు అనివార్యంగా రానున్నాయి. ఇక పీపీఏలు అమలైతే వాటా ప్రకారం 862 మెగావాట్ల కరెంట్ దక్కుతుంది. కానీ ఏపీకి తెలంగాణ నుంచి ఇవ్వాల్సిన విద్యుత్ మాత్రం ఇంతకన్నా ఎక్కువ కావడం గమనార్హం. పీపీఏలు అమలు కాకపోయినా 160 మెగావాట్లు రానున్నందున పీపీఏలను వదులుకుంటే 700 మెగావాట్లను మాత్రమే తెలంగాణ కోల్పోతుంది. అయితే ఏపీకి ఇవ్వాల్సిన 1198 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికే మిగులుతుంది. పైగా విదేశీ బొగ్గును వినియోగిస్తూ అధిక వ్యయంతో నడిచే ఏపీ ప్రాజెక్టుల వల్ల భవిష్యత్తులో తెలంగాణకు తీవ్ర నష్టమే మిగులుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పునరాలోచన తప్పదు పాత పీపీఏల అమలు వల్ల రాష్ట్రానికి దీర్ఘకాలంలో భారీ నష్టాలు కలుగుతాయి. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే పునరాలోచన చేయాలి. మరో రెండేళ్ల పాటు రాష్ట్రానికి అదనంగా 500 మెగావాట్ల విద్యుత్ అవసరం. ఈ లోటును పూడ్చడానికి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలి. ఉమ్మడి రాజధాని ఉన్న దృష్ట్యా కేంద్ర విద్యుత్ పూల్‌లో ఏపీ వాటా నుంచి 500 మెగావాట్లను తెలంగాణకు కేటాయించాలని కేంద్రంపై రాష్ర్ట ప్రభుత్వం ఒత్తిడి చేయాలి. - కె. రఘు, విద్యుత్ రంగ నిపుణుడు -
సామాన్యులను పట్టించుకోలేదు
సినీ నటుడు నారాయణ మూర్తి కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సామాన్యులను విస్మరించి, సంపన్నులకు మేలు చేకూర్చేలా ఉందని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఆదివారం సీపీఎం రాష్ట్ర మహా సభల్లో మాట్లాడుతూ మోడీ ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకు భారంగా మారిందన్నారు. కమ్యూనిస్టు పార్టీలు సంఘటితమై మోడీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలన్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కళాకారులకు ఉపాధి కల్పించడంలో ముందుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి కాల్ లెటర్, ఉద్యోగం కళాకారులకే ఇవ్వడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో పీఎన్ఎం రాష్ట్ర నాయకులు జగ్గారాజు, నర్సింహులు, సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, సుద్దాల అశోక్, మాదాల రవి, సీపీఐ నాయకులు ప్రతాప్‌రెడ్డి, భూపతి వెంకటేశ్వర్లు,రమేష్, మిమిక్రీ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు దుర్గా నాయక్, మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి, బండ్రు నర్సింహులు, మల్లు స్వరాజ్యం, జైని మల్లయ్య గుప్తా, రత్నం, అబ్బగాని భిక్షం, చుక్క సత్తయ్య, గూడ అంజయ్య, సత్యనారాయణ, దాసు, నర్సయ్య, సోనెరావు, శ్రీనివాసరెడ్డి తదితరులను సత్కరించారు. ఎర్రజెండా రెపరెపలు సుందరయ్య విజ్ఞాన కేంద్రం: సీపీఎం తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభల సందర్భంగా ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండప పరిసర ప్రాంతాలు ఎరుపువర్ణాన్ని సంతరించుకున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రాంగణ వద్ద ఏర్పాటు చేసిన స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్, కేంద్ర కమిటీ సభ్యులు బేబి, శ్రీనివాసరావు, పాటూరి రామయ్య, పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి పి.మధు, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, ఎస్‌యూసీఐ నాయకులు బండ నరేందర్, ఎంసీపీఐ నాయకులు మద్దికాయల అశోక్ తదితరులు పాల్గొన్నారు. సభకు సీపీఎం రాష్ట్ర నాయకులు జి.రాములు, సుదర్శన్, చుక్కా రాములు, జ్యోతి, జూలకంటి రంగారెడ్డి అధ్యక్షత వహించారు. డప్పు కొట్టారు..చెప్పులు కుట్టారు.. సాక్షి,సిటీబ్యూరో: సీపీఎం రాష్ట్ర తొలి మహాసభల సందర్భంగా నిజాంకాలేజ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కళా ప్రాంగణాలు, ఎగ్జిబిషన్లు ఆకట్టుకున్నాయి. ‘బండెనుక బండి యాదగిరి కళా ప్రాంగణాన్ని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు ఎంఏ బేబి ప్రారంభించారు. తెలంగాణ వంటలు, రుచుల ప్రదర్శనను రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పుస్తక ప్రదర్శనను ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, చేతి వృత్తుల ఎగ్జిబిషన్‌ను ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, భూక్యా బంగ్యా, చిత్రకారుల ప్రదర్శనను సీపీఎం నేత మల్లు స్వరాజ్యం, షార్ట్ ఫిల్మ్, కార్టూనిస్టుల ఎగ్జిబిషన్లను కార్టూనిస్టు శంకర్, మోహన్, తెలంగాణ సాయుధ ఎగ్జిబిషన్‌ను మల్లు స్వరాజ్యం, ఛాయా చిత్ర ప్రదర్శనను దశరథ్కుమారు, సాంస్కృతిక ప్రదర్శనను సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి, ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ, కాళోజీ కళా ప్రాంగణాన్ని సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, యశ్పాల్ ప్రారంభించారు. అలాగే సీపీఎం నేతలు చేతి వృత్తుల ప్రదర్శనల్లో పాల్గొన్నారు. అలాగే పలువురు నేతలు డప్పులు కొట్టి..చెప్పులు కుట్టి సందడి చేశారు. ఎవరేమన్నారంటే.... సాక్షి, సిటీబ్యూరో: సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభల సందర్భంగా ఆదివారం నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ జనజాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పలువురు నేతలు ప్రసంగించారు. తెలంగాణ సంస్కృతికి నిదర్శనం తెలంగాణ పల్లెలోని ప్రజా సంస్కృతి ప్రతిబింబించే విధంగా జన జాతర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ బేబి అన్నారు.. చేతి వృత్తుల పరిరక్షణ కృషి చేస్తూనే....వారి జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తామన్నారు. ప్రదర్శనలు శ్రామిక జీవన విధానం ఉట్టి పడేలా ఉన్నాయని, పల్లెల్లో చేతి వృత్తి దారులు జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారని ఆయన కొనియాడారు. కోటి ఆశల ఆకాంక్ష...: తమ్మినేని తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇందుకు తెలంగాణ ప్రజలు సంఘటిత ఉద్యమాలు చేపట్టాలన్నారు. అభ్యుదయవాదులు, ప్రగతిశీల శక్తులు, వామపక్షాలు, కమ్యూనిస్ట్టులు సమష్టిగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. భూములను అమ్మనివ్వం: కంచె ఐలయ్య. తెలంగాణ వస్తే బాగుపడుతుందనుకున్నాం.. వచ్చినంక డబ్బులన్ని గుళ్లు, గోపురాలకు పోతున్నాయని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. వాస్తు పేరుతో భూములు అమ్మాలని చూస్తున్నారని.... ప్రాణం పోయినా అందుకు అంగీకరించేది లేదన్నారు. -
సామాన్యులకు జెడ్పీ చైర్మన్ పీఠం
జనశక్తి నుంచి జెడ్పీకి సాక్షి, కరీంనగర్: సాదాసీదా గొర్రెలకాపరి కుటుంబం నుంచి ఎదిగిన తుల ఉమ కరీంనగర్ జెడ్పీ పీఠాన్ని అధిరోహించిన తొలి మహిళగా రికార్డు నెలకొల్పారు. చిన్నప్పుడే అడవి బాట పట్టిన ఉమ.. పదేళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపారు. సీపీఐ (ఎంఎల్) జనశక్తి విప్లవోద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. అనారోగ్యంతో 1994లో లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. అదే ఏడాది సీపీఐ(ఎంఎల్) తరఫున జగిత్యాల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం టీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు. గృహిణి చేతికి పగ్గాలు సాక్షి, ఆదిలాబాద్: శోభారాణిది రాజకీయ కుటుంబమే. ఆమె నిర్మల్‌లోని సాయి కృప ఎడ్యుకేషనల్ సొసైటీ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. భర్త వల్లకొండ సత్యనారాయణగౌడ్ టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆదిలాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పదవిని ఈసారి బీసీ మహిళకు కేటాయించడంతో నిర్మల్ జెడ్పీటీసీగా గెలిచిన శోభారాణికి ఈ అవకాశం దక్కింది. అందలమెక్కిన అంగన్వాడీ టీచర్ సాక్షి, వరంగల్ : వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గంలోని నర్మెట మండలం గండిరామారం గ్రామానికి చెందిన గద్దల పద్మ నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. 2001లో టీఆర్ఎస్ తరఫున అబ్దుల్ నాగారం ఎంపీటీసీ సభ్యురాలుగా గెలిచారు. అనంతరం అంగన్వాడీ టీచర్‌గా పనిచేసేవారు. తాజాగా నర్మెట జెడ్పీటీసీ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. పలు సమీకరణాల నేపథ్యంలో వరంగల్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యా రు. ఎంపీటీసీ నుంచి రాజు ప్రస్థానం మొదలు సాక్షి, నిజామాబాద్: దఫేదార్‌రాజు 2001లో నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం గున్కుల్ ఎంపీటీసీగా టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2006లో గున్కుల్ గ్రామ సర్పంచ్‌గా గెలిచారు. 2013లో గున్కుల్ సింగిల్ విండో చైర్మన్‌గా పని చేశారు. సాధారణ ఎన్నికలకు పది నెలల ముందు, రాజు టీఆర్ఎస్లో చేఆరు. నిజాంసాగర్ మండల జెడ్పీటీసీ సభ్యుడిగా టీఆర్ఎస్ నుంచి ఎన్నికయ్యారు. ఇందూరు జెడ్పీ చైర్మన్ పదవి బీసీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో రాజును జెడ్పీ చైర్మన్ పదవి వరించింది. సర్పంచ్ నుంచి జెడ్పీ పీఠం వరకు.. సాక్షి, నర్సాపూర్: మెదక్ జెడ్పీ చైర్పర్సన్ గా ఎన్నికైన ఎ.రాజమణి సాధారణ గృహిణి. నర్సాపూర్ మేజర్ పంచాయతీ సర్పంచ్ (టీడీపీ)గా 2007లో ఎంపికై 2012 వరకు కొనసాగారు. 2009లో టీఆర్ఎస్లో చేరారు. నర్సాపూర్ జెడ్పీటీసీ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఆమె భర్త ఎ.మురళీధర్‌యాదవ్ 1995, 2000 ఎన్నికల్లో నర్సాపూర్ మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్‌గా గెలుపొందారు. ఎన్ఎస్యూఐ నుంచి ఎదిగిన బాలు సాక్షి, నల్లగొండ: బాలునాయక్ స్వస్థలం ముదిగొండ పంచాయతీలోని సూర్యాతండా. 1994లో దేవరకొండ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, డీసీసీ కార్యదర్శిగా పనిచేసి, 2004లో దేవరకొండ జెడ్పీటీసీగా నెగ్గారు. 2007లో దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో దేవరకొండ ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ప్రస్తుతం చందంపేట జెడ్పీటీసీ సభ్యుడిగా గెలిచి, నల్లగొండ జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. నాడు రైల్వే హమాలీ.. నేడు జెడ్పీ చైర్మన్ సాక్షి, గద్వాల : ఒకనాడు కర్నూలు రైల్వే వ్యాగన్ హమాలీగా పనిచేసిన బండారి భాస్కర్ నేడు మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయికి ఎదిగారు. టీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి కృష్ణమోహన్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉండేవారు. ఈ నేపథ్యంలోనే 2001 నుంచి 2006వరకు గద్వాల మండలం కాకులారం సర్పంచ్‌గా పనిచేశారు. తాజాగా గద్వాల నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా నెగ్గారు. -
వీఐపీలకే దర్శనభాగ్యమా?
సామాన్యులకు దూరమవుతున్న ఆపదమొక్కులవాడు ఒకటో తేదీ, ఏకాదశికి క్యూ కడుతున్న వీఐపీలు.. బంధుగణంతో సుమారు 180 మంది ఎంఎల్ఏలు, 30 మంది ఎంఎల్సీలు సాక్షి, తిరుమల: ఆపద మొక్కులవాడా...అని మొక్కగానే కష్టాలను తీర్చే తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సామాన్య భక్తులకు రోజురోజుకీ దూరమవుతోంది. ఒకప్పుడు పది అడుగుల దూరంలోని కులశేఖరపడి నుంచే ఆ దేవదేవుని రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం పొందేవారు. రద్దీని బూచిగా చూపి మహాలఘు దర్శనం పేరుతో 70 అడుగుల దూరానికి సామాన్య భక్తులను నెట్టివేశారు. ఇక కొత్త సంవత్సరం, వైకుంఠ ఏకాదశి రోజుల్లో సామాన్య భక్తులకు స్వామి దర్శనం గగనమైపోతోంది. ప్రతిసారి ధర్నాలు, ఆందోళనలు, తోపులాటలు, తొక్కిసలాటలు జరిగినా టీటీడీ ధర్మకర్తల మండలి పెద్దలు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా వేలాది బంధుగణంతో తరలి వచ్చే వీవీఐపీలు, రాజకీయ నేతలు, ప్రజా పతినిధులు, వ్యాపార, వాణిజ్య వేత్తలకు ఎర్ర తివాచీ వేసేందుకు టీటీడీ మరోసారి సమాయత్తమవుతోంది. వైకుంఠ ఏకాదశి రోజున ఏకంగా పదివేల వీఐపీ టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అంటే ఈ ఏడాది కూడా సామాన్య భక్తులకు అష్ట కష్టాలు తప్పవన్నమాట! పెరుగుతున్న సామాన్య భక్తులు.. తప్పని అగచాట్లు... తిరుమలకు సరాసరిగా రోజుకి 80వేలు, రద్దీ రోజుల్లో లక్ష, కొత్త సంవత్సరం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో రోజుకు లక్షన్నర వరకు భక్తులు వస్తారు. 1933 నుంచి 1970 వరకూ భక్తులు మహాద్వారం నుంచి నేరుగా ఆలయంలోకి వెళ్లి పది నిమిషాల్లోనే స్వామిని దర్శించుకుని వచ్చేవారు. 1945, ఏప్రిల్ 10న మొదటి ఘాట్‌రోడ్డు ప్రారంభమైన తర్వాత 1952 టీటీడీ లెక్కల ప్రకారం రోజుకు 2 వేలమంది స్వామిని దర్శించుకోగా... 2012 నాటికి 2.73 కోట్లకు పెరిగింది. ఇక 2013వ సంవత్సరం ఇప్పటివరకు సుమారు 3 కోట్లకు చేరింది. వీరిలో కేవలం నాలుగు నుంచి ఐదు శాతం మినహా అందరూ సామాన్య భక్తులే. ఎటువంటి సిఫారసులు లేకుండానే 10 గంటల నుంచి 36 గంటల పాటు కూడా క్యూలో నిరీక్షించి స్వామివారినిదర్శించుకుంటారు. ఇందులో కంపార్ట్మెంట్లలో రోజుల తరబడి వేచి ఉండే సర్వదర్శనం... అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాటల్లో నడిచి తిరుమలకు వచ్చి తిరిగి 10 నుంచి 16 గంటలపాటు క్యూలైన్లలో వేచి ఉండి దర్శించుకునే దివ్యదర్శనం... చంటి బిడ్డలతో వచ్చిన తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు దర్శనం.... తిరుమలలో ఎవరి సిఫారసు లేకుండానే 8 నుంచి 15 గంటలపాటు క్యూలైన్లలో వేచి ఉండే రూ.300 టికెట్ల భక్తులు... ఈ- దర్శన్ కేంద్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ కింద రూ.50 టికెట్ల సుదర్శనం... అర్ధరాత్రుల వరకు మేల్కొని ఆన్లైన్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకునే ఆర్జిత సేవా భక్తులు ఉన్నారు. వీరిలో ఆర్జిత సేవా భక్తులు మినహా మిగిలినవారు గంటల నుంచి రోజుల తరబడి క్యూలో నిరీక్షించిన తర్వాత స్వామి దర్శనం లభిస్తోంది. విశిష్ట పర్వదినాలు, వారాంతపు రద్దీరోజుల్లోనే కాదు సాధారణ రోజుల్లో కూడా భక్తుల ఆగచాట్లు నిత్యకృత్యం. మరోవైపు వీఐపీలు రాజమార్గంలో వెళ్లి అరగంట నుంచి గంటలోపే స్వామివారిని దర్శించుకుంటున్నారు. కొత్త సంవత్సరం, ఏకాదశిలో వీఐపీలకే ఎర్ర తివాచీ.. 2014 కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీ, 11వ తేదీ వైకుంఠ ఏకాదశి, 12వ తేదీ ద్వాదశి పర్వదినాల్లో వీఐపీ దర్శనాల కోసం తిరుమలకు తరలివచ్చే ప్రముఖులకు బస, దర్శన విషయంలో టీటీడీ పెద్దలు ఎర్ర తివాచీ సిద్ధం చేశారు. బంధుగణంతో సుమారు 180 మంది ఎంఎల్ఏలు, 30 మంది ఎంఎల్సీలు, మరో 25 మంది ఎంపీలు, 100 మందికి పైగా కేంద్ర , రాష్ట్ర ఉన్నతాధికారులు, జ్యుడీషియల్, వ్యాపార, వాణిజ్యవేత్తల రాకపై ఇప్పటికే టీటీడీకి సమాచారం అందింది. తిరుమలకు వస్తామో?రామో అన్న విషయం ఇంకా స్పష్టం కాకపోయినా తమపేరుతో తమ బంధుగణానికి శ్రీవారి సన్నిధిలో బస, దర్శన ఏర్పాట్లు సిద్ధం చేసుకోవటంలో నేతలు, అధికారులు బిజీబిజీ అయ్యారు. ఇందుకోసం ప్రత్యేకంగా రిసెప్షన్, ఆలయ అధికారులు, ఇంజనీర్లతో కూడిన అధికారులతో కమిటీలు కూడా వేసేశారు. తిరుమలకు వచ్చే వీఐపీకి బస, దర్శనం విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాచమర్యాదలు చేయాలని అధికారికంగా ఉత్తర్వులు సైతం ఇచ్చేశారు. దీంతో సంబంధిత టీటీడీ కింది స్థాయి అధికారులు కూడా ప్రముఖుల సేవకు సిద్ధమవుతున్నారు. -
ఆమ్ఆద్మీ పార్టీలో సామాన్యులెందరు?
న్యూఢిల్లీ: అవినీతిలేని పాలన, డబ్బు ప్రభావం లేని ఎన్నికలు తమ లక్ష్యంగా ప్రకటించి సామాన్య ప్రజల కోసమే తమ పార్టీ అంటూ అరవింద్ కేజ్రీవాల్ భారీ ప్రచారమే చేశాడు. పాలక, ప్రతిపక్ష నేతల అవినీతి, బంధు ప్రీతి, ధనదాహాలతో విసిగిన ప్రజలు కేజ్రీవాల్ మాటలు నమ్మి ఓటు వేసి అధికారానికి అందేంత దూరం తీసుకొచ్చారు. అనూహ్య ప్రజాదరణ ఫలితంగా ఆమ్ఆద్మీ పార్టీలో 28 మంది ఎమ్మెల్యేలు విజయబావుటా ఎగురవేశారు. అయితే వీరిలో సామాన్యులు, సగటు మనుషులు ఎందరని పరిశీలిస్తే సగానికి సగం కోటిశ్వరులే అని తేలింది. నిన్న మొన్నటి ఎన్నికల్లో గెలిచిన ఆమ్ఆద్మీ పార్టీ అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆస్తుల పట్టికల వివరాల ప్రకారమే 12 మంది కోటీశ్వరులు. కాంగ్రెస్ నాయకుడు రాజేశ్ లిలోతియాను పటేల్‌నగర్ స్థానంలో ఓటమిపాలు చేసిన వీణా ఆనంద్ ఆస్తులు 15.52 కోట్ల రూపాయలని వెల్లడైంది. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ సంస్థ విశ్లేషణ ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థుల సగటు ఆస్తులు రూ. 14.25 కోట్లు కాగా బీజేపీ అభ్యర్థుల ఆస్తుల సగటు రూ. 8.16 కోట్లు, ఇక ఇదే ఆమ్ఆద్మీ పార్టీ అభ్యర్థుల సగటును లెక్కిస్తే 2.51 కోట్ల రూపాయలని తేలింది. గెలుపొందిన వారిలో నాలుగింట మూడొంతుల మంది ఢిల్లీలో కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన వారే అని ఏడీఆర్ విశ్లేషణ తేల్చింది.ఇక కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారిలో సగానికి ఎక్కువ మంది కోటీశ్వరులు బీజేపీ పక్షానికి చెందిన వారు కాగా మిగతా వారు కాంగ్రెస్ మరియు ఆప్ పార్టీలకు చెందినవారు. ఎక్కువ మంది ఆస్తులు స్థిరాస్తుల రూపంలోనే ఉన్నాయని తేలింది. ఇక బీజేపీ, ఆప్‌లకు చెందిన ముఖ్యమంత్రి అభ్యర్థులు డాక్టర్ హర్షవర్ధన్, అరవింద్ కేజ్రీవాల్‌లు కోటీశ్వరులైన ఎమ్మెల్యేల లెక్కలోనే చేరారు. ఆప్ తరఫున ఎన్నికయివారిలో 10 మంది ఆస్తులు మాత్రం అతి సాధారణంగా ఉన్నాయి. వీరు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వివరాల ప్రకారం సీమాపురి నియోజకవర్గం నుంచి ఎన్నికైన ధర్మేందర్‌సింగ్ కోలి ఆస్తుల విలువ 20,800 రూపాయలని, మంగోల్‌పురి నియోజకవర్గం నుంచి గెలిచిన రాఖీ బిర్లా ఆస్తుల విలువ రూ.51,150లని తేలింది. మోడల్ టౌన్ అభ్యర్థి అఖిలేష్పతి త్రిపాఠీ ఆస్తులు రూ. 1.59 లక్షలుగా ప్రకటించారు.ఇక మొత్తం ఢిల్లీ ఎమ్మెల్యేల్లో అతి శ్రీమంతుడు మంజీందర్ సింగ్ సిర్సా. ఈయన శిరోమణి అకాలీదళ్ పార్టీ అభ్యర్థి రాజోరీగార్డెన్ నుంచి గెలిచిన ఈయన ఆస్తుల విలువ రూ.235.51 కోట్లని తేలింది.