ఎక్కడా నోట్లు లేవు! | Common People Facing Problems With Ban Of Currency Note | Sakshi
Sakshi News home page

ఎక్కడా నోట్లు లేవు!

Published Fri, Nov 25 2016 3:42 AM | Last Updated on Sat, Sep 22 2018 7:50 PM

ఎక్కడా నోట్లు లేవు! - Sakshi

ఎక్కడా నోట్లు లేవు!

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నగదు కొరత మరింత తీవ్రమైంది. రూ.5,000 కోట్ల విలువైన నోట్లను రాష్ట్రానికి పంపాలన్న ప్రభుత్వ విజ్ఞప్తికి ఇప్పటికీ ఆర్‌బీఐ నుంచి స్పందన లేకపోవటంతో నోట్ల కొరత ఉధృతమవుతోంది. రాష్ట్రంలో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర అధికారుల బృందం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. నగదు లేకపోవడంతో గురువారం గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో అనధికారికంగా చెల్లింపులు నిలిపివేశారు. కేవలం డిపాజిట్లు చేసుకోవడమే తప్ప.. ఇచ్చేందుకు డబ్బులు లేవంటూ ఖాతాదారులను తిప్పి పంపారు. దీంతో సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
 
 80 శాతం బ్యాంకుల్లో..
 హైదరాబాద్ నగరంలో దాదాపు 80 శాతం బ్యాంకుల్లో అనధికారికంగా చెల్లింపులు నిలిచిపోయారుు. కొత్త నోట్లకు అనుగుణంగా ఏటీఎంలను మార్చినా నగదు లేకపోవడంతో ఖాళీగానే ఉన్నారుు. వాస్తవానికి శుక్రవారం నుంచే అత్యధిక బ్యాంకుల్లో నగదు మార్పిడిని నిలిపివేశారు. అరుుతే పదిహేను రోజులుగా బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలు, నగదు మార్పిడి తంటాలు, రూ.2 వేల నోటును చిల్లరగా మార్చుకునేందుకు ప్రజలు పాడుతున్న పాట్లు నిత్యకృత్యంగా మారారుు. పాత పెద్ద నోట్ల చెల్లింపుల గడువు ముగుస్తోందనే ఆందోళనతో గురువారం పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లు, కరెంటు బిల్లులు, ప్రభుత్వ ఫీజుల చెల్లింపులకు జనం ఎగబడ్డారు.
 
 నగదు వెంటనే సరఫరా చేయండి
 నోట్ల కొరత ఇదే తీరుగా కొనసాగితే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు మరింత ఇబ్బంది పడతారని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. రాష్ట్రంలో నోట్ల రద్దు పరిణామాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం పర్యటన ముగియడంతో... గురువారం సాయంత్రం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో భేటీ అరుుంది. రాష్ట్రంలో ప్రజల కనీస అవసరాలకు సరిపడేంత డబ్బును విడుదల చేయాలని, రూ.5వేల కోట్ల విలువైన రూ.500, రూ.100 నోట్లు సరఫరా చేస్తే ఇబ్బందులు తగ్గుతాయని సీఎస్ ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయే ఆదాయాన్ని భర్తీ చేసేందుకు పాత బకారుులను విడుదల చేసేలా కేంద్రానికి సూచించాలని కోరారు.
 
 ఉద్యోగులు, పింఛన్లపై సర్కారు దృష్టి
 ఒకటో తేదీ వచ్చేస్తుండటంతో ఉద్యోగుల జీతాలు, ఆసరా పెన్షన్ల చెల్లింపులపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతంలో రూ.10 వేలు నగదుగా ఇచ్చే ప్రతిపాదన ముఖ్యమంత్రి వద్ద పరిశీలనలో ఉంది. ఉద్యోగులు తమ కార్యాలయాల్లోనే సంబంధిత అధీకృత అధికారి నుంచి ఓచర్ ద్వారా ఈ డబ్బు తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. లేని పక్షంలో బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి రూ.10 వేలు ఇప్పించాలనే ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తోంది. దీనిపై ఆర్‌బీఐ నుంచి అనుమతి తీసుకోవడంతో పాటు సరిపడేంత డబ్బు అందుబాటులో ఉంచాలంటూ కేంద్రానికి లేఖ రాయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించారుు. దీనిపై సీఎం తీసుకునే నిర్ణయం మేరకు శుక్రవారం స్పష్టత రానుంది. ఇక ఆసరా పెన్షన్లు సజావుగా చెల్లించేందుకు సరిపడా నోట్లు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆర్‌బీఐకి విజ్ఞప్తి చేసింది.
 
 నగదు రహిత లావాదేవీలే పరిష్కారం: రెడ్డి సుబ్రమణ్యం
 నోట్ల రద్దు సమస్యను అధిగమించేందుకు నగదు రహిత లావాదేవీలే పరిష్కారమని కేంద్ర బృందం ప్రతినిధి రెడ్డి సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. ‘‘నోట్ల రద్దు వల్ల ప్రజలు, ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలు క్షేత్రస్థారుులో పరిశీలించాం. జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నాం. చిన్న నోట్లు లేకపోవడంతో గ్రామీణ ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అందుకే నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించాలి. గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలు నగదు రహిత లావాదేవీలకు చేపట్టేందుకు సుముఖంగా ఉన్నారు. నోట్ల రద్దుతో రాష్ట్రానికి రూ.3 వేల కోట్లు నష్టం వస్తోందని ప్రభుత్వం నివేదించింది. వీటన్నింటినీ ప్రధానికి, ఆర్‌బీఐకి తెలియజేస్తాం..’’ అని చెప్పారు. 
 
 వంటగ్యాస్‌కూ  డబ్బుల్లేక..
 ఈమె పేరు బీసం కొండమ్మ. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం నాగరాల గ్రామానికి చెందిన ఈమెది వ్యవసాయ కుటుంబం. వరి, వేరుశనగ పంటలు సాగు చేశారు. పొద్దున లేస్తే పొలానికి వెళ్లాల్సిందే. ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ ఉన్నా గ్యాస్ అరుుపోరుుంది. రీఫిల్ సిలిండర్ తీసుకుందామనుకుంటే చేతిలో డబ్బులు లేవు. బ్యాంకుకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడినా.. చివరకు డబ్బు లేదంటున్నారు. దీంతో చేసేది లేక కట్టెల పొరుు్య మీదనే వంట చేసుకుని పొలం పనులకు వెళ్తున్నామని కొండమ్మ వాపోరుుంది.
 
 ‘చిల్లర’ తిప్పలు
 ఆసరా పింఛన్ దారులకూ చిల్లర కష్టాలు తప్పడం లేదు. యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని తపాలా కేంద్రాల్లో గురువారం వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు. చిల్లర లేకపోవడం వల్ల ఇద్దరిద్దరికి కలిపి రూ.2వేల నోటు చొప్పున ఇచ్చారు. దీంతో పింఛన్‌దారులు డబ్బు పంచుకోవడానికి నానా తంటాలూ పడ్డారు. కనిపించిన వారినల్లా చిల్లర కోసం ప్రాధేయపడ్డారు. ఇలా భువనగిరి మండలం తాతానగర్‌కు చెందిన ముదిగొండ యాదమ్మ, కొండె నాగమ్మ తమ వృద్ధాప్య పింఛన్ కోసం సబ్ పోస్టాఫీస్‌కు రాగా.. ఇద్దరికీ కలిపి రూ.2వేల నోటు ఇచ్చారు. వీరిలో యాదమ్మ ఆ నోటును తీసుకుని.. చిల్లర మార్చి శుక్రవారం ఇస్తానని చెప్పడంతో నాగమ్మ వెళ్లిపోరుుంది. ఇక వికలాంగులు తమకిచ్చే రూ.1,500 పింఛన్ కోసం మరింత అవస్థ పడ్డారు. ముందుగానే రూ.500 చిల్లర తీసుకుని వెళితే.. రూ.2 వేల నోటు ఇస్తున్నారు. దీంతో తెలిసినవారి వద్ద అడిగి చిల్లర తెచ్చుకోవడానికి వికలాంగులు తిప్పలు పడ్డారు. ఇలా చాలా మంది పింఛన్‌దారులకు ‘నోట్లు’ కన్నీళ్లు తెప్పించారుు.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement