ఈ ఎన్నికలలో టిడిపి నేతల బండారం బయటపడింది. మునిసిపల్ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ నేతలు ఓటర్లను ఆకర్షించడానికి ఎంతకైనా దిగజారుతున్నారు. ఓట్ల కోసం నోట్లు ఇవ్వడమే తప్పు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో రెండు చోట్ల టిడిపి నేతలు ఓటర్లకు దొంగనోట్లు ఇచ్చి మోసం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో మునిసిపల్ ఎన్నికల సందర్భంగా టిడిపి నేతలు ఓటర్లకు దొంగనోట్లు పంచారు. దాంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో కూడా ఓ టీడీపీ నేతలు నకిలీ కరెన్సీ పంపిణీ చేశాడు. టీడీపీ నేతలు పంచింది అసలు నోట్లు కాదని.. నకిలీ నోట్లని తేలేడంతో ఓటర్లు కంగుతున్నారు. చెల్లని నోట్లని తేలడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను మోసగించిన టీడీపీ నేతలకు తగిన బుద్ది చెబుతామని ఓటర్లు హెచ్చరించారు.