మెదక్ లోక్‌సభ స్థానానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ రాజీనామా సమర్పించారు. నరేంద్రమోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవ్వడానికి దేశ రాజధానికి వెళ్లిన కేసీఆర్ తన రాజీనామ లేఖను లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు అందచేశారు. తాజా ఎన్నికల్లో కేసీఆర్ మెదక్ లోకసభ స్థానానికి, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల నుంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన కేసీఆర్ టీఆర్ఎస్ శాసనసభ పక్ష నాయకుడిగా ఎంపికయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత జూన్ 2 తేదిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో గజ్వేల్ శాసన సభ్యుడిగా కొనసాగతూ.. మెదక్ లోకసభకు రాజీనామా చేశారు.
Published Mon, May 26 2014 2:15 PM | Last Updated on Wed, Mar 20 2024 3:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement