నల్లధనం వెలికితీతలో తమ ప్రభుత్వాన్ని విశ్వసించాలని ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణీలో ఆదివారం ఉదయం రెండోవిడత నిర్వహించిన మాన్కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ... ఎన్నిక సమయంలో దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. స్వచ్ఛభారత్ నిర్మాణం తమ ప్రభుత్వ ప్రధాన అంశమని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం శుభపరిణామమన్నారు. చిన్నారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అనార్యోగం దరి చేరకుండా ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలని ఆయన ప్రజలుకు విజ్ఞప్తి చేశారు. యువభారత్ ఏదైనా సాధించగలదు మోదీ పేర్కొన్నారు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు ఉపకార వేతనాలు అందజేస్తామని తెలిపారు. అందుకోసం చర్యలు చేపట్టినట్లు వివరించారు. దేశ రక్షణ కోసం పాటు పడుతున్న జవాన్లకు మోడీ ఈ సందర్భంగా సలాం చేశారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.