సర్వేపల్లి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. టీడీపీ నేత సోమిరెడ్డి విదేశాల్లో అక్రమ ఆస్తులు కలిగి వున్నారని గోవర్ధన్ రెడ్డి గతంలో పలుమార్లు ఆరోపణలు చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. కాగా, గోవర్ధన్ రెడ్డి చేసిన ఆరోపణలపై సోమిరెడ్డి కోర్టులో కేసు వేశారు. గోవర్ధన్ రెడ్డి నకిలీ పత్రాలు సృష్టించి తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసును శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు కాకానిని అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.