తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గిన ముఖ్యమంత్రి పళనిస్వామి తన మంత్రి వర్గసహచరులు, ఎమ్మెల్యేలతో అమ్మ సమాధి వద్దకు తరలి వెళ్లారు. అమ్మ గెలిచిందంటూ నినాదాలతో మెరీనా బీచ్ లోని అమ్మ సమాధి మారుమోగింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత సమాధి వద్దకు తన మద్దుతారుదలతో తరలి వెళ్లిన ఆయన అమ్మకు నివాళులర్పిస్తూ పళని స్వామి కన్నీరు పెట్టారు. దీంతో అమ్మ గెలిచిందంటూ నినాదాలు మిన్నంటాయి