స్థానిక సంస్థలకు నిధులు, విధులు అవసరమని వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. నల్గొండ జిల్లా కోదాడలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె ప్రసంగించారు. పంచాయతీ ఎన్నికలలో అందరూ కలసికట్టుగా పార్టీ విజయం కోసం కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ఓటర్ల జాబితాపై నిఘాపెట్టమని సలహా ఇచ్చారు. కార్యకర్తలను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యకర్తల క్రమశిక్షణను ఆమె కొనియాడారు. పంచాయతీలకు వైఎస్ అన్నీ సమకూర్చారని, ఇప్పుడు అన్నీ చతికిలబడ్డాయన్నారు. ఈ ప్రభుత్వం ఆర్టీసి చార్జీలు మూడు సార్లు పెంచిందని, విద్యుత్ చార్జీలు పెంచిందని తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రం నుంచి ఎటువంటి సాయం తీసుకురావడంలేదన్నారు. ఆరోగ్యశ్రీ పథకంపై ఎన్నో ఆంక్షలు విధించారని తెలిపారు. ఈ సమావేశానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.