ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఆయన ఈ రోజు సాయంత్రం ఉప్పల్ లోని రోహిత్ నివాసానికి వెళ్లారు. రోహిత్ సస్పెన్షన్, ఆత్మహత్యకు గల కారణాలను వైఎస్ జగన్ ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ విషయాలు చెబుతూ రోహిత్ తల్లి రాధిక కన్నీరుమున్నీరుగా విలపించారు.