ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాయంలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన సోమవారం ఉదయం ప్రారంభమైంది. నీరు అందక ఎండిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించి రైతులను పరామర్శించారు.