టాస్ గెలిచారు కానీ 12 పరుగులకే 2 వికెట్లు... భారీ భాగస్వామ్యం దక్కింది కానీ ఇన్నింగ్స్‌లో తడబాటు... మరో రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు వచ్చాయి కానీ ఆఖరి ఓవర్‌లో వికెట్ నష్టం... రెండో టెస్టు తొలి రోజు భారత్ పరిస్థితి ఇది. ముగ్గురు బ్యాట్స్‌మెన్ రాణించి, ముగ్గురు విఫలమైన చోట కోహ్లిసేన చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది.