తెలుగుదేశం పార్టీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అసంబద్ధ వైఖరి, టీడీపీ సర్కార్ పరిపాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీని వీడిన సంగతి తెలిసిందే. తాజాగా సీనియర్ నేత, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. అలాగే ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తప్పుకున్నారు. ఈ మేరకు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను ఆయన పంపించారు.