ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన 'ఇంటి వద్దకే పెన్షన్' కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా ప్రారంభించిన గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా.. పెన్షన్లను గడపవద్దకే చేర్చాలన్న సంకల్పాన్ని సాకారం చేసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.