సంచలనం సృష్టించిన బొటానికల్ గార్డెన్ సమీపంలో గర్భిణి దారుణ హత్య కేసు మిస్టరీని సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు చేధించారు. మృతురాలి భర్త, అత్త, మరిది ఈ ఘాతుకానికి పాల్పడ్డారని గుర్తించారు. ఆదివారమే సీసీ ఫుటేజీ ఆధారంగా కొన్ని కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు సోమవారం నిందితులను కనుగొన్నారు. కొండాపూర్‌లోని ఒక బార్‌లో పనిచేసే అమర్‌కాంత్ ఝా, అతని తల్లి, మృతురాలి భర్త కలిసి ఈ దారుణానికి ఒడిగట్టగా.. అమర్ కాంత్, అతని తల్లి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పడేశారని పోలీసులు తెలిపారు. నిందితుల తల్లిని అదుపులోకి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు మృతురాలి భర్త, మరిది అమర్‌కాంత్‌ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అమర్‌కాంత్ గత 10 రోజులుగా నగరంలోని లేడని వారు అద్దెకుంటున్న యజమాని సాక్షికి తెలిపారు. గత మూడు నెలలుగా తన ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు చెప్పారు.